Bihar Voter List: 51 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:51 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ బాధ్యతగా ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్నామని ఈసీ తెలింది. ఎస్ఐఆర్‌పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.

పాట్నా: బిహార్ ఎన్నికల జాబితా (Bihar Electoral Roll) నుంచి 51 లక్షల పేర్లు తొలగించినట్టు ఎన్నికల కమిషన్ (EC) మంగళవారంనాడు ప్రకటించింది. ఓటర్లు మరణించడం, వలస వెళ్లడం ఇందుకు కారణాలుగా తెలిపింది. ముసాయిదా ఎన్నికల జాబితాలో అర్హులైన ఓటర్లను చేరుస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు 1న జాబితాను పబ్లిష్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
'బిహార్ ఎస్ఐఆర్‌లో ఇంతవరకూ వెల్లడైన నిజాలు' అనే పేరుతో ఎన్నికల కమిషన్ ఒక నోట్ విడుదల చేసింది. ఇంతవరకూ నిర్వహించిన బిహార్ స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తమ దృష్టికి రాగా, 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని వివరించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ బాధ్యతగా ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్నామని ఈసీ తెలింది. ఎస్ఐఆర్‌పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి..
అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు
నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి