Punjab: 32 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. బాంబు పేల్చిన కాంగ్రెస్ నేత
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:49 PM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని బజ్వా మరో సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ ఆయనను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

చండీగఢ్: పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. తాజాగా 'ఆప్' ప్రభుత్వం పని అయిపోయిందన్న రీతిలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా (Pratap Singh Bajwa) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ (ఆప్)కి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని, పార్టీ ఫిరాయించేందుకు తగిన సమయం కోసం వేచిచూస్తున్నారని చెప్పారు.
West Bengal: డాక్టర్లు, వైద్య సిబ్బందికి భారీగా వేతనాల పెంపు
''రాబోయే రోజుల్లో పంజాబ్‌లో కూడా ఏక్‌నాథ్ షిండే తరహా (మహారాష్ట్ర) ఎపిసోడ్ ఇక్కడ కూడా పునరావృతం కానుంది. అడ్వాన్స్ టిక్కెట్ల కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొందరు ఇతర పార్టీల వైపు కూడా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం చివరివరకూ ఉండదని చెప్పగలను. రాబోయే ఐదారు నెలల్లో ఈ ప్రభుత్వానికి ఏక్‌నాథ్ షిండే ఎపిసోడ్ ఎదురవుతుంది. మహారాష్ట్ర విమానం ఛండీగఢ్‌లో దిగుతుంది'' అని ఆయన జోస్యం చెప్పారు.
సీఎం సైతం బీజేపీతో టచ్‌లో..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని బజ్వా మరో సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ ఆయనను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాన్‌కు, కేంద్రానికి మధ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రి రవ్‌నీత్ సింగ్ భిట్టూ మధ్యవర్తిత్వం సాగిస్తున్నారని, వాళ్లు రహస్య సమావేశాలు కూడా జరుపుతున్నారని అన్నారు. కేవలం అబద్ధాలకే పరిమితమైన ఆప్ ప్రభుత్వం ఎప్పుడో పడిపోయిందని ప్రజలు కూడా స్థిరనిశ్చయానికి వచ్చినట్టు చెప్పారు.
బజ్వా ఆరోపణలను తిప్పికొట్టిన ఆప్
కాగా, బజ్వా చేసిన ఆరోపణలను ఆప్ పంజాబ్ అధ్యక్షుడు అమన్ అరోరా తోసిపుచ్చారు. ప్రతాప్ సింగ్ బజ్వా బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందని ప్రత్యారోపణ చేశారు. ఇప్పటికే బీజేపీలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని, కొద్దిరోజుల క్రితం బెంగళూరు వెళ్లారని, రహస్యంగా బీజేపీ సీనియర్ నేతలను కలిసారని ఆరోపించారు. దీనిపై బజ్వాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగాలని కోరారు. పంజాబ్ అసెంబ్లీలో ఆప్‌కు 94 మంది ఎమ్మెల్యేలున్నారని, బజ్వా ఊహించినట్టు 32 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నా 64 మంది ఎమ్మెల్యేలతో తమకు పూర్తి మెజారిటీ ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.