Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:38 AM
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు.

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు. యాత్రికుల బస్సు జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌కు చేరుకోగానే ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాత్రికుల్లో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే అనేక మందికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.