-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 06th May 2025 Tuesday Live Updates on Top Stories Latest Headlines Politics Sports Business and Real Time Updates in Telugu Siva
-
Breaking News: ఆర్టీసీ సమ్మె వాయిదా..
ABN , First Publish Date - May 06 , 2025 | 11:53 AM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-05-06T17:59:47+05:30
దారుణం.. వృద్ధులను చంపి ఆపై..
హైదరాబాద్: అల్వాల్‌లో వృద్ధ దంపతుల హత్య కేసు ఛేదించిన పోలీసులు
నిందితుడు పాత నేరస్థుడు చింతగింజ అనిల్‌గా గుర్తింపు
జైల్ నుంచి ఇటీవలే బెయిల్‌పై వచ్చిన అనిల్
వృద్ధ దంపతులను చంపి నగలు, నగదు దోచుకున్నట్లు అనుమానం
అనిల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం
-
2025-05-06T17:58:42+05:30
బీఆర్ఎస్ తప్పిదాలను సరిచేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు..
సీఎం రేవంత్ ముక్కుసూటి మనిషి: మంత్రి శ్రీధర్‌బాబు
ఉన్న విషయాలను ఉన్నట్లుగా రేవంత్ మాట్లాడతారు: మంత్రి శ్రీధర్‌బాబు
సీఎం రేవంత్ బెదిరించారనడం సరికాదు: శ్రీధర్‌బాబు
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేస్తున్నామని మాత్రమే సీఎం చెప్పారు: శ్రీధర్‌బాబు
ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కేసీఆర్ పెంచారు: శ్రీధర్‌బాబు
-
2025-05-06T17:56:08+05:30
అవమానాలు ఎదుర్కొన్నా: సబిత..
OMC కేసులో న్యాయం జరిగింది: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను: సబిత
ఈ కేసులో 12 ఏళ్లపాటు అవమానాలు ఎదుర్కొన్నా: సబిత
నా నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారు: సబిత
-
2025-05-06T17:55:24+05:30
హైకోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి..
సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో సవాల్ చేస్తామన్న గాలి జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది
హైకోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్ వేయనున్న గాలి తరఫు లాయర్
మరోవైపు ఈనెల 17న గాలి జనార్దన్‌రెడ్డి కుమారుడి వివాహం
-
2025-05-06T16:14:01+05:30
ఓబులాపురం మైనింగ్ కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు..
ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు
OMC కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
రిటైర్డ్ IAS కృపానందం(A8)ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి(A9)ని నిర్దోషిగా తేల్చిన కోర్టు
A1 బీవీ శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్‌రెడ్డికి శిక్ష ఖరారు
A3 వి.డి.రాజగోపాల్, A4 OMC ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీఖాన్‌కు శిక్ష ఖరారు చేసిన నాంపల్లి సీబీఐ కోర్టు
బీవీ శ్రీనివాసరెడ్డి(A1)కి 7 ఏళ్ల జైలు శిక్ష
గాలి జనార్దన్‌రెడ్డి(A2)కి 7 ఏళ్ల జైలు శిక్ష
120B r/w 420, 409, 468, 471తో పాటు..అవినీతి నిరోధక చట్టంలోని..
13(2) r/w 13(1) (D) కింద అభియోగాలు నమోదు
-
2025-05-06T15:57:05+05:30
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
156 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
81 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
2025-05-06T15:56:29+05:30
హైదరాబాద్‌లో మాక్ డ్రిల్.. ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్‌లో రేపు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDO..
మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్
రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్
వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్
-
2025-05-06T15:15:28+05:30
ఆర్టీసీ సమ్మె వాయిదా..
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం
ఉద్యోగ సంఘాలతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ
ముగ్గురు IAS అధికారులతో కమిటీ వేసిన టీజీ సర్కార్
కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్
వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
-
2025-05-06T12:08:15+05:30
మాక్ డ్రిల్‌పై కేంద్ర హోంశాఖ సమావేశం..
రేపటి మాక్ డ్రిల్‌పై అన్ని రాష్ట్రాల సిఎస్‌లతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్.
దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజన.
కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం.
కేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్, ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి.
259 జిల్లాలలో మాక్ డ్రిల్స్.
మెట్రోలు , రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన రేపు మాక్ డ్రిల్.
-
2025-05-06T11:53:30+05:30
ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ..
యుద్ధ సన్నద్దతపై మోదీకి వివరించిన అజిత్ దోవల్
సివిల్ డ్రిల్ పై వివిధ రాష్ట్రాల సి ఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ
దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్‌కు సంబంధించి ఏర్పాట్ల పై చర్చ
ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు , సివిల్ డిఫెన్స్ విభాగాధిపతులు.
రేపు దేశవ్యాప్తంగా సివిల్ డ్రిల్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశం.