-
-
Home » Mukhyaamshalu » telugu Viral trending Breaking Telangana Andhra Pradesh national and international news today 24rd nov kjr
-
BREAKING: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
ABN , First Publish Date - Nov 24 , 2025 | 06:15 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 24, 2025 20:29 IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్‌లు SECకి పంపిన ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు SECకి చెప్పిన ప్రభుత్వం
రేపు హైకోర్టులో విచారణ తర్వాత షెడ్యూల్ ఇచ్చే యోచనలో SEC
-
Nov 24, 2025 17:31 IST
హైదరాబాద్: కోకాపేటలో రికార్డు ధర పలికిన ప్లాట్లు
నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ప్లాట్లు.
రికార్డు స్థాయిలో రూ.137.25 కోట్లు పలికిన ఎకరం ధర.
ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వేలం నిర్వహించిన HMDA అధికారులు.
ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్లు పలికిన ధర.
ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా.. ఎకరానికి రూ.137.25 కోట్లు పలికిన ధర.
వేలంలో 9.90 ఎకరాలకుగాను HMDAకి రూ.1,355.33 కోట్లు ఆదాయం.
కోకాపేట్‌లో మిగిలిన భూములను 28న HMDA వేలం.
-
Nov 24, 2025 17:31 IST
స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.
రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.
3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ. 304 కోట్లు జమ.
-
Nov 24, 2025 16:56 IST
హైదరాబాద్: సనత్‌నగర్ ESI ఆస్పత్రిలో ప్రమాదం
భవనం రెనోవేషన్ చేస్తుండగా కూలిన సెంట్రింగ్
స్లాబ్ పెచ్చులు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి
ESI ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ చేస్తుండగా ఘటన
-
Nov 24, 2025 16:29 IST
నటుడు ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల సంతాపం..
అమరావతి: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల సీఎం చంద్రబాబు, పవన్ సతాపం
ధర్మేంద్ర కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్
కోట్లాది మంది అభిమానుల హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారు: సీఎం చంద్రబాబు
ధర్మేంద్ర మృతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
-
Nov 24, 2025 14:59 IST
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతికి.. ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
-
Nov 24, 2025 14:44 IST
శ్మశాన వాటిక వద్దకు చేరుకుంటున్న సీనియర్ నటుడు ఆమీర్ ఖాన్
-
Nov 24, 2025 14:38 IST
ధర్మేంద్ర కడసారి చూపుకోసం.. శ్మశాన వాటికకు చేరుకుంటున్న సీనియర్ నటుడు సంజయ్ దత్
-
Nov 24, 2025 14:36 IST
శ్మశాన వాటికకు చేరుకుంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్..
-
Nov 24, 2025 14:32 IST
ధర్మేంద్ర కడసారి చూపుకోసం.. శ్మశానానికి చేరుకుంటున్న పలువురు ప్రముఖులు
-
Nov 24, 2025 14:25 IST
ధర్మేంద్ర పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యాలు
-
Nov 24, 2025 14:05 IST
బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూత..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర..
1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర..
300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర..
బాలీవుడ్ హీమ్యాన్‌గా ధర్మేంద్రకు గుర్తింపు..
ధర్మేంద్ర సినీ కెరీర్‌ను మలుపుతిప్పిన 'షోలే' చిత్రం..
2012లో ధర్మేంద్రకు పద్మభూషణ్ పురస్కారం..
1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..
ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్‌సింగ్ డియోల్..
ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.
-
Nov 24, 2025 13:56 IST
లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి..
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి..
తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి-హిండోలఖల్ సమీపంలో ప్రమాదం..
ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు..
ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది.
-
Nov 24, 2025 13:08 IST
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..
ఢిల్లీ: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..
ముంబై నుండి డెహ్రాడూన్ కు వెళ్తున్న ఇండిగో 6E5032 విమానాన్ని ఢీకొట్టిన పక్షి..
పక్షి ఢీకొట్టడంతో వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్..
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా మరో విమానా సర్వీస్ ను నడిపిన ఎయిర్ ఇండియా..
ప్రయాణికులకు అల్పాహారం అందించిన విమాన సిబ్బంది..
అధికారికంగా వెల్లడించిన ఇండిగో సంస్థ అధికార ప్రతినిధి.
-
Nov 24, 2025 13:00 IST
చెవిరెడ్డికి అస్వస్థత..
విజయవాడ: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అస్వస్థత..
వెరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్న చెవిరెడ్డి..
వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.
-
Nov 24, 2025 12:17 IST
బ్రిడ్జి పైనుంచి దూకి.. వ్యక్తి ఆత్మహత్య..
అనంతపురం: నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తి
మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని భావిస్తున్న పోలీసులు..
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆత్మహత్య దృశ్యాలు..
గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
-
Nov 24, 2025 12:13 IST
రెండు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి..
తమిళనాడు: టెంకాశి జిల్లాలో రోడ్డు ప్రమాదం..
2 ప్రైవేట్ బస్సులు ఢీ..
ఆరుగురు మృతి, 30 మందికి గాయాలు.
-
Nov 24, 2025 12:11 IST
తల్లి ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం రమేష్ స్పందన
నా తల్లి ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోంది: ఎంపీ సీఎం రమేష్
హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు: ఎంపీ సీఎం రమేష్
-
Nov 24, 2025 11:53 IST
దంపతులను ఢీ కొట్టిన లారీ.. భర్త మృతి..
జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో రోడ్డు ప్రమాదం..
ఉదయం రోడ్డు దాటుతుండగా దంపతులను ఢీ కొట్టిన లారీ...
వెంకటరామిరెడ్డి(62) అక్కడిక్కడే మృతి...
వెంకటరామిరెడ్డి భార్య లత(58) కు తీవ్రగాయాలు..
చింతల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న లత..
ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Nov 24, 2025 11:50 IST
పాత నేరస్థుడి హల్‌చల్.. స్థానికులపై దాడి..
మేడ్చల్ జిల్లా: సూరారం పీఎస్ పరిధిలోని దయానంద నగర్‌లో పాత నేరస్థుడి హల్‌చల్..
గంజాయి మత్తులో స్థానికులపై దాడిచేసిన పాత నేరస్థుడు రవి అలియాస్ గజ (25)..
ముగ్గురిని గాయపరిచి కాలనీలో హల్‌చల్ సృష్టించిన రవి ...
కాలనీ వాసులు ముకుమ్మడిగా పీఎస్‌లో పిర్యాదు...
పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్.
-
Nov 24, 2025 10:49 IST
ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టుల బహిరంగ లేఖ..
మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే..
ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని మావోయిస్టుల లేఖ..
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాలకు మావోయిస్టు పార్టీ లేఖ..
ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం: మావోయిస్టు పార్టీ
కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటన..
ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం,..
వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి.. ఆయుధ విరమణపై ప్రకటన చేస్తాం..
సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు..జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపిన మావోయిస్టులు.
-
Nov 24, 2025 10:38 IST
రాజమండ్రికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాజమండ్రి : రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గాన ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం బయలుదేరిన పవన్ కళ్యాణ్..
మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేయనున్న డిప్యూటీ సీఎం.
-
Nov 24, 2025 10:31 IST
ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్: చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల స్కూల్‌లో విషాదం..
10వ తరగతి విద్యార్థి షేక్ మూస (15) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య..
నిజామాబాద్‌కి చెందిన విద్యార్థిగా గుర్తింపు.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Nov 24, 2025 10:07 IST
పాత నేరస్తుల పరారీ..
ప్రకాశం: ఒంగోలులోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి ఇద్దరు పాత నేరస్తుల పరారీ..
కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు, దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఒంగోలుకు చెందిన నేరస్తులు..
గంజాయి కేసుల్లోనూ ప్రమేయం ఉండటంతో ఇటీవల వీరిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు..
పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి పారిపోయిన ఇద్దరు నేరస్తులు ఆజాద్, నాగుల్ మీరా..
గాలింపు చేపట్టిన పోలీసులు.
-
Nov 24, 2025 09:51 IST
వరుస స్ట్రీట్ ఫైట్స్‌తో కలకలం..
హైదరాబాద్ నగరంలో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం..
వరుస సంఘటనలతో భయాందోళనలో స్థానికులు..
సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్..
గత వారం టోలీచౌకీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రీట్ ఫైట్స్ జరగగా..
తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద జరిగిన మరో స్ట్రీట్ ఫైట్..
వరుసగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండడంతో పోలీసులపై స్థానికుల ఆగ్రహం.
-
Nov 24, 2025 09:32 IST
నేడు సుప్రీంకోర్టు నూతన సీజేఐ ప్రమాణస్వీకారం
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం
ఉదయం 10 గం.కు జస్టిస్ సూర్యకాంత్‌తో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి
సీజేఐ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ
సీజేఐ ప్రమాణానికి హాజరుకానున్న పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
-
Nov 24, 2025 09:00 IST
నార్సింగిలో డ్రగ్స్ పట్టివేత..
నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్ చేసిన మాదాపూర్ ఎస్ఓటి..
మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్ఓటీ..
వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్‌కు హెరాయిన్ స్మగ్లింగ్..
వెస్ట్ బెంగాల్‌కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాల అరెస్ట్..
NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.
-
Nov 24, 2025 08:58 IST
నరసరావుపేటలో యువకుడు హత్య..
పల్నాడు జిల్లా: నరసరావుపేటలో యువకుడు హత్య..
కొండల్ రావుపేటకి చెందిన బాజి (34)ని పొడిచి చంపిన గుర్తుతెలియని దుండగులు..
SRKT వద్ద హోటల్ లో ఉన్న బాజి (34)పై కత్తులతో దుండగులు దాడి..
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాజి మృతి..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
-
Nov 24, 2025 08:44 IST
నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..
రాష్ట్రపతి భవన్‌లో సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం..
మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం..
సాయంత్రం కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
సాయంత్రం4 గంటలకు కొడంగల్‌లో అక్షయపాత్ర ఇంటిగ్రేటెడ్ కిచెన్ ప్రారంభించనున్న సీఎం..
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
-
Nov 24, 2025 08:13 IST
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..
నార్సింగిలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు..
టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..
ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు..
భారీగా ఫేక్ సర్టిఫికేట్లతో పాటు బోనాఫైడ్ సర్టిఫికేట్లు స్వాధీనం..
రూ.50 వేలకు టెన్త్, రూ.75 వేలకు ఇంటర్, రూ.1.20 లక్షలకు డిగ్రీ సర్టిఫికేట్ విక్రయిస్తున్న ముఠా.
-
Nov 24, 2025 08:06 IST
కారు బీభత్సం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..
అల్వాల్: మచ్చ బొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద కారు బీభత్సం..
సెలెక్ట్ థియేటర్ వద్ద దుకాణాలు, వ్యాపార సముదాయాలపై దూసుకెళ్లిన ఎర్టిగా కారు..
మచ్చ బొల్లారం నుండి సెలెక్ట్ థియేటర్ వైపునకు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పడంతో ఘటన..
వాహనదారుడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు..
ఈ ప్రమాదంలో నుజ్జయిన కారు.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
ఘటన స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు..
ధ్వంసమైన దుకాణాలు.. దుకాణాల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం.
-
Nov 24, 2025 07:58 IST
నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమం..
అమరావతి: నేటి నుంచి రైతులు కోసం సరికొత్త కార్యక్రమం..
వారం రోజులు పాటు రైతన్న మీకోసం పేరుతో కొత్త కార్యక్రమం..
అన్నదాత ఇళ్లకు నేరుగా తరలిరానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు..
లాభసాటి సాగుకు పంచ సూత్రాలపై అవగాహన..
పంటల మార్పిడిపై రైతుల్లో అవగాహన తెచ్చే విధంగా అవగాహన.
-
Nov 24, 2025 07:55 IST
ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్..
విశాఖ: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్..
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణ..
అర్హులైన అభ్యర్థులు ఈనెల 26 లోగా దరఖాస్తు చేసుకోవాలి..
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి: అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, IAS వి.ప్రసన్న వెంకటేష్
-
Nov 24, 2025 07:38 IST
కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం..
మేడ్చల్ జిల్లా: శామీర్ పేట్ పీఎస్ పరిధిలో ఓఅర్ఆర్పై కారులో చెలరేగిన మంటలు..
మంటల్లో సజీవ దహనమైన కారు డ్రైవర్..
కారును రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకొని నిద్రిస్తున్న సమయంలో మంటలు చేలరేగినట్టు గుర్తించిన పోలీసులు..
శామీర్ పేట్ నుండి కీసరకు వెళుతున్న క్రమంలో ఘటన..
క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
-
Nov 24, 2025 07:16 IST
నేటితో ముగియనున్న ఐ బొమ్మ రవి కస్టడీ..
హైదరాబాద్: నేటితో ముగియనున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కస్టడీ..
గత నాలుగు రోజులుగా రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు..
పోలీసుల కస్టడీకి సహకరించని రవి..
మరోసారి కస్టడీ పెంపుపై నాంపల్లి కోర్టును అభ్యర్థించునున్న పోలీసులు..
విదేశీ పౌరసత్వం ఉండడంతో ఇప్పటికే కేసు వివరాలను కరీబియన్ కంట్రీకి అందజేసిన సీసీఎస్ పోలీసులు..
పోలీసులు అడిగే ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే విధంగా జవాబులు చెబుతున్నాడని సమాచారం.
-
Nov 24, 2025 06:20 IST
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి..
వికారాబాద్: నేడు మ.2:30కు హెలికాప్టర్‌లో కొడంగల్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి..
పోలేపల్లి, హకీంపేట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్ హబ్.. ఏరియల్ సర్వే ద్వారా స్థల పరిశీలన..
కొడంగల్ శివారులోని ఎన్కేపల్లిలో అక్షయపాత్ర గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ..
నియోజకవర్గంలో 103 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ.
-
Nov 24, 2025 06:15 IST
పెళ్లి బస్సుకు ప్రమాదం..
కృష్ణా: శ్రీకాకుళం జిల్లా పొందూరు పెళ్లి బస్సుకు ప్రమాదం..
గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద చోటు చేసుకున్న ఘటన..
లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో జరిగిన ప్రమాదం..
లారీని ఢీకొన్న పెళ్ళివారి బస్సు, పెళ్లి బస్సును ఢీకొన్న కారు..
చిన్నపిల్లలతో సహా 20 మంది పెళ్లివారికి స్వల్ప గాయాలు..
బస్ డ్రైవర్ పరిస్థితి విషమం.