Share News

Breaking News: ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన

ABN , First Publish Date - Jun 15 , 2025 | 08:10 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన

Live News & Update

  • Jun 15, 2025 20:10 IST

    ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు: ఇరాన్‌

    • ఇజ్రాయెల్ సైనిక చర్య నిలిపివేస్తే తాము దాడులు ఆపేస్తాం: ఇరాన్‌

    • ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని కొనసాగించాలి ఉద్దేశం లేదు: ఇరాన్‌

  • Jun 15, 2025 20:10 IST

    ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌..

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌

    • ఫ్రాన్స్‌లో నివసించే యూదులు, అమెరికన్లు ఉండే ప్రాంతాల్లో భద్రత పెంపు

  • Jun 15, 2025 20:10 IST

    ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు

    • పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడితే భారీ మూల్యం చెల్లించక తప్పదు

    • ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

  • Jun 15, 2025 20:10 IST

    గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..

    • ఏపీలో మూడుచోట్ల పారిశ్రామిక పార్కులు: పీయూష్ గోయల్‌

    • ఎగుమతులు, దిగుమతుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు

    • త్వరలో కృష్ణపట్నం పార్క్‌ అభివృద్ధి పనులు పూర్తి

    • పొగాకు బోర్డు ద్వారా పొగాకు రైతుల పిల్లల ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు

    • రుణాల కాలపరిమితి 3 నుంచి ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం

    • అమరావతిలో NID ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి: పీయూష్ గోయల్‌

  • Jun 15, 2025 20:10 IST

    కొనసాగుతున్న ప్రక్రియ

    • కొనసాగుతున్న విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ

    • ఇప్పటివరకు DNA పరీక్షలతో 47 మృతదేహాలు గుర్తింపు

    • 24 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగింత

  • Jun 15, 2025 16:28 IST

    అయ్యో.. ఘోరం..

    • మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం

    • ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన

    • ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు

    • పుణెలో కొనసాగుతోన్న సహాయక చర్యలు

  • Jun 15, 2025 15:56 IST

    బాబోయ్.. చిరుత..

    • కర్నూలు: కోసిగిలోని బసవన్న కొండల్లో చిరుత సంచారం

    • బసవన్న కొండల్లో రైతులకు కనిపించిన చిరుత

    • సోషల్ మీడియాలో చిరుత సంచారం వీడియో వైరల్‌

  • Jun 15, 2025 15:56 IST

    లీడర్” పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

    • యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదిక: కవిత

    • రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక: కవిత

    • ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దు: కవిత

  • Jun 15, 2025 15:56 IST

    అభినందనలు తమ్ముళ్లు: సీఎం చంద్రబాబు..

    • నీట్ యూజీలో ఉత్తీర్ణులైన వారికి అభినందనలు: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

    • తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు: చంద్రబాబు

  • Jun 15, 2025 15:56 IST

    ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

    • ఘజియాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన విమానం

    • సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

    • ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పడిగాపులు

  • Jun 15, 2025 12:16 IST

    తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం

    • ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌

    • త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటన: మంత్రి పొంగులేటి

    • రేపటి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం: మంత్రి పొంగులేటి

    • తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: పొంగులేటి

    • అనంతరం సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు: పొంగులేటి

  • Jun 15, 2025 10:35 IST

    ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధం

    • విధ్వంసకర దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్-ఇరాన్.

    • ఇరాన్‌లోని సైనిక, అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు.

    • ఇరాన్‌లోని కీలక శాస్త్రవేత్తలు, అధికారులను హతమార్చిన ఇజ్రాయెల్.

    • రెండు రోజుల్లో 9 మంది శాస్త్రవేత్తలు, అధికారులు మృతి.

    • ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది మృతి, 320 మందికి గాయాలు.

    • ప్రతీకారంగా మిస్సైల్స్‌, డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్.

    • అడ్డుకోలేకపోయిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ.

    • ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.

    • మరోసారి ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలు లక్ష్యంగా మిస్సైల్స్.

    • ఉద్రిక్తతలను ఆపాలంటూ ఇజ్రాయెల్-ఇరాన్‌కు ఐ.రా.స. పిలుపు.

  • Jun 15, 2025 08:14 IST

    ఉత్తరాఖండ్‌: గౌరీకుండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

    helicopter crash kedarnath

    • ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం.

    • డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా ఘటన.

    • ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం.

    • ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌గా గుర్తింపు.

    • ఘటనాస్థలిలో కొనసాగుతోన్న సహాయక చర్యలు.

  • Jun 15, 2025 08:10 IST

    Breaking News: ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక

    • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధం.

    • ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు.

    • ఇరాన్‌లోని 150లక్ష్యాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్.

    • ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు.

    • మూడు F-35 జెట్‌లు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటన.