-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Friday 13th June 2025 Top news and Major Events Across India Siva
-
Breaking News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ABN , First Publish Date - Jun 13 , 2025 | 10:07 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 13, 2025 21:26 IST
గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ నిర్ణయం
2023 జనవరి 1 నుంచి పెంచిన డీఏ వర్తింపు
-
Jun 13, 2025 20:47 IST
అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం
బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తున్న ఈడీ
కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో బాధితులు
19 లక్షల మంది మోసపోయినట్టు గుర్తించిన ఈడీ
అగ్రిగోల్డ్ స్కాంలో ఇప్పటికే 33 మందిపై చార్జ్‌షీట్
ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు చెల్లిస్తున్న ఈడీ
-
Jun 13, 2025 20:47 IST
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
ఈ నెల 23 నుంచి ఏపీలో ఇంటింటికీ 'తొలి అడుగు' విజయయాత్ర
నెల రోజులపాటు 'తొలి అడుగు' విజయయాత్ర: సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్
పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తిచేయండి: సీఎం చంద్రబాబు
జులైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు: సీఎం చంద్రబాబు
తల్లికి వందనం నిధుల విడుదలతో సర్వత్రా సంతృప్తి: చంద్రబాబు
వచ్చే వారమే 'అన్నదాత సుఖీభవ' పథకం అమలు: చంద్రబాబు
ఒకే నెలలో రెండు సూపర్ సిక్స్ పథకాలు అమలు: సీఎం చంద్రబాబు
ప్రతిరోజూ పార్టీకి ఎమ్మెల్యేలు కొంత సమయం కేటాయించాలి: చంద్రబాబు
-
Jun 13, 2025 19:55 IST
ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్
ఇరాన్‌పై దాడి పరిస్థితులను మోదీకి వివరించిన నెతన్యాహు
మోదీతో పాటు ప్రపంచ నేతలకు నెతన్యాహు ఫోన్
జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడికి నెతన్యాహు ఫోన్
-
Jun 13, 2025 18:24 IST
సుప్రీంకోర్టు నోటీసులు..
'థగ్ లైఫ్' బ్యాన్‌పై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
'థగ్ లైఫ్' సినిమాను ఎప్పటినుంచి ప్రదర్శిస్తారని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు
ఇప్పటికే 'థగ్ లైఫ్' సినిమాపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్
-
Jun 13, 2025 18:08 IST
9,600 పాఠశాలల్లో వన్ టీచర్ విధానం పెంచాం: లోకేష్
గతంలో 1,200పాఠశాలల్లో మాత్రమే అమలు: లోకేష్
నిధులు జమ కాకపోతే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం
2శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్: లోకేష్
డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్
సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం: మంత్రి లోకేష్
-
Jun 13, 2025 18:08 IST
తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ చెందేలా చర్యలు
గత ప్రభుత్వం 42లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది: లోకేష్
67.27లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం అమలు
గతం కంటే రూ.3,405కోట్లు అదనంగా తల్లికి వందనం నిధులు
ఇప్పటి వరకూ 18.55లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ: లోకేష్
-
Jun 13, 2025 18:08 IST
అసత్య ఆరోపణలని గతంలోలాగా భరించం: మంత్రి లోకేష్
నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు: లోకేష్
టీచర్ల బదిలీలు సోమవారంలోగా పూర్తి: మంత్రి లోకేష్
అందరి ఆమోదంతోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చాం
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం: లోకేష్
-
Jun 13, 2025 18:08 IST
వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్..
రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలపై చర్చలు తప్పవు: లోకేష్
రూ.2వేలు నా ఖాతాలో పడినట్లు రుజువు చేయాలి: లోకేష్
లేదంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి: లోకేష్
అలా చేయకుంటే వారిపై చట్టప్రకారం ముందుకెళ్తా: లోకేష్
-
Jun 13, 2025 18:05 IST
కేసీఆర్‌కు వైద్య పరీక్షలు..
హైదరాబాద్: గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించిన AIG ఆసుపత్రి వైద్యులు
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహణ
-
Jun 13, 2025 18:04 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో నలుగురు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మెడికోలు మృతి
ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 28 మంది మెడికోలు మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 269కి చేరిన మృతుల సంఖ్య
-
Jun 13, 2025 17:38 IST
అణు ఒప్పందంపై ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక
అణు ఒప్పందం కుదుర్చుకోవాలని మరోసారి ప్రతిపాదన
తక్షణమే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్న ట్రంప్
లేదంటే ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతాయని ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై దారుణ దాడులకు ఇజ్రాయెల్ ప్రణాళికలు: ట్రంప్
అమెరికాతో అణు ఒప్పందం ఒక్కటే ఇరాన్‌ను కాపాడుతుంది: ట్రంప్
వినాశనం జరగకుండా ఆపే అవకాశం ఇరాన్‌కు ఇంకా ఉంది: ట్రంప్
-
Jun 13, 2025 17:36 IST
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం: కేటీఆర్
లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?: కేటీఆర్
జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షలను లైవ్‌గా చూపిద్దాం: కేటీఆర్
ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు: కేటీఆర్
-
Jun 13, 2025 16:31 IST
విమాన ప్రమాదం.. మరో నలుగురు మృతి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో నలుగురు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మెడికోలు మృతి
ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 28 మంది మెడికోలు మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 269కి చేరిన మృతుల సంఖ్య
-
Jun 13, 2025 14:01 IST
కృష్ణా: పేర్ని నానికి మతి భ్రమించింది: మంత్రి కొల్లు రవీంద్ర
అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొల్లు
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పేర్ని విమర్శలు: కొల్లు
నకిలీ ఇళ్ల పట్టాలతో పేదలను మోసం చేశారు: మంత్రి కొల్లు
తండ్రీకొడుకులు పరారై ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు: కొల్లు
-
Jun 13, 2025 13:41 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
ఎల్బీనగర్, హయత్‌నగర్, చైతన్యపురిలో వర్షం
వనస్థలిపురం, నాగోల్‌లో వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం
-
Jun 13, 2025 13:34 IST
'థగ్ లైఫ్' సినిమా వివాదంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్
పిటిషన్ దాఖలు చేసిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ CEO వి.నారాయణ్.
కర్ణాటకలో 'థగ్ లైఫ్' విడుదలకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్.
తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు.
-
Jun 13, 2025 13:13 IST
నెల్లూరు: వందేభారత్ రైలులో సాంకేతిక లోపం
నెల్లూరులో నిలిచిన హైదరాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.
రైలులో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికుల అవస్థలు.
-
Jun 13, 2025 12:47 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న సస్పెన్స్
ఇప్పటి వరకు దొరకని బ్లాక్‌బాక్స్ ఆచూకీ
బ్లాక్‌బాక్స్ కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
బ్లాక్‌బాక్స్ దొరికిందన్న వదంతులను కొట్టిపారేసిన AI
-
Jun 13, 2025 12:40 IST
ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలపై భారత్ స్పందన
ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ సూచన.
చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు.
ఇరాన్, ఇజ్రాయెల్‌లో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
-
Jun 13, 2025 12:21 IST
ఢిల్లీ: కొమ్మినేనికి సుప్రీంలో ఊరట.
జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్.
మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో బెయిల్.
అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం.
భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సుప్రీం హెచ్చరిక.
ఇంకోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించొద్దని హెచ్చరిక.
కింది కోర్టు షరతులకు లోబడే బెయిల్ ఇస్తున్నామన్న సుప్రీంకోర్టు.
-
Jun 13, 2025 11:42 IST
బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సాక్షి యాంకర్ కొమ్మినేని..
అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని అరెస్ట్.
కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించిన ట్రయల్ కోర్టు.
క్రింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసిన కొమ్మినేని.
అక్కడ ఆయన బెయిల్ పిటీషన్ పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొమ్మినేని.
కొమ్మినేని బెయిల్ పిటీషన్ ను మరికొద్ది సేపట్లో విచారించనున్న జస్టిస్ పికె మిశ్రా ధర్మాసనం.
-
Jun 13, 2025 11:03 IST
అమరావతి: ప్రారంభమైన 'తల్లికి వందనం' నిధుల జమ
తల్లుల ఖాతాల్లో జమ అవుతున్న నిధులు.
ఇవాళ 54 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులు.
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ 'తల్లికి వందనం'.
ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున 'తల్లికి వందనం' నిధులు.
-
Jun 13, 2025 11:01 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ కీలక పోస్ట్..
-
Jun 13, 2025 11:01 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ కీలక పోస్ట్..
విమాన ప్రమాదం అత్యంత విషాదకర ఘటన.
విమాన ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యా.
అధిక మంది చనిపోవడం మాటల్లో చెప్పలేనిది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.
మృతుల కుటుంబాల బాధ అర్థం చేసుకోగలం.
ప్రమాదస్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉంది.
-
Jun 13, 2025 10:52 IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లతో ఇరాన్ దాడి
ఇరాన్ డ్రోన్లను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్
-
Jun 13, 2025 10:43 IST
భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త..
విశాఖ: భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త గోపీనాథ్.
రెడ్డికంచరపాలెంలో నిన్న అర్ధరాత్రి ఘటన.
భార్య తలపై ఇనుప డంబుల్‌తో కొట్టి హతమార్చిన భర్త.
కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చినట్టు పోలీసులకు వెల్లడి.
తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాధలైన ఇద్దరు పిల్లలు.
గోపీనాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో తిరస్కరించని భార్య.
మధ్య రాత్రి 2:30 వరకు భార్య వెంకటలక్ష్మితో చెలరేగిన వివాదం.
ఇంట్లో ఉన్న డంబుల్‌తో తల మీద కొట్టి చంపి మధ్య గదిలో గడియ పెట్టుకొని గోపీనాథ్ కూడా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి.
దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు.
-
Jun 13, 2025 10:24 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందం
ఘటనా స్థలిలో ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు
-
Jun 13, 2025 10:24 IST
అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి NSG టీం
ఇప్పటికే బ్లాక్‌బాక్స్ రికవరీ చేసిన NSG
బ్లాక్‌బాక్స్‌ను DGCAకు అప్పగించనున్న NSG బృందం
-
Jun 13, 2025 10:23 IST
కర్ణాటక హోస్కోట దగ్గర రోడ్డుప్రమాదం
లారీ, రెండు చిత్తూరు ఆర్టీసీ బస్సులు ఢీకొని నలుగురు మృతి
ప్రమాదంలో మరో 16 మందికి తీవ్రగాయాలు
మృతుల్లో ఏడాది చిన్నారి, కేశవరెడ్డి(44), తులసి(21), ప్రణతి(4)
-
Jun 13, 2025 10:12 IST
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులతో గగనతలం మూసివేత
పలు విమానాలు రద్దు, దారిమళ్లింపు
16 ఎయిరిండియా విమాన రాకపోకలకు అంతరాయం
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: ఎయిరిండియా
-
Jun 13, 2025 10:10 IST
ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..
-
Jun 13, 2025 10:09 IST
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ..
-
Jun 13, 2025 10:07 IST
Breaking News: అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ.
మోదీతో పాటు ఘటనాస్థలిలో కేంద్రమంత్రి రామ్మోహన్.
ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ.
సివిల్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోదీ.