-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International latest breaking news and live updates on 8th Dec 2025 vreddy
-
BREAKING: గ్లోబల్ సమ్మిట్‌లో అంచనాకు మించి ఒప్పందాలు
ABN , First Publish Date - Dec 08 , 2025 | 07:31 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 08, 2025 20:47 IST
జపాన్‌లో భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై 7.6గా భూకంప తీవ్రత నమోదు
సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్ ప్రభుత్వం
జపాన్ పలిఫిక్ తీర ప్రాంతంలో 3 మీటర్ల మేర అలలు ఎగసిపడే అవకాశం
-
Dec 08, 2025 20:44 IST
ఎలక్ట్రికల్ కారు ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారు ఆవిష్కరించిన సీఎం రేవంత్
స్వయంగా కారు నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి
ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు
-
Dec 08, 2025 20:43 IST
AGIDCతో రూ.70 వేల కోట్ల ఒప్పందం
సింగపూర్‌కు చెందిన AGIDC కంపెనీ రూ.70 వేల కోట్లతో ఒప్పందం
AI ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న AGIDC కంపెనీ
వియత్నాంకు చెందిన విన్ గ్రూప్‌తో రూ.27 వేల కోట్లతో ఒప్పందం
సోలార్‌ప్లాంట్లు, ఈవీ, ఎనర్జీ స్టోరేజీలను ఏర్పాటు చేయనున్న విన్ గ్రూప్
-
Dec 08, 2025 20:31 IST
ఇండిగో సమస్యపై వివరాలు తెలుసుకొని విశ్లేషిస్తే బాగుండు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పార్టీ పరంగా మేం మాట్లాడుతున్నాం: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
రామ్మోహన్ ప్రయాణికుల సమస్యను తీర్చడానికి పని చేస్తున్నారు
విమాన రంగంలో రామ్మోహన్ పలు సంస్కరణలు తీసుకొచ్చారు
ఇండిగో సమస్యపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది: శ్రీకృష్ణదేవరాయలు
-
Dec 08, 2025 20:31 IST
గ్లోబల్ సమ్మిట్‌లో అంచనాకు మించి ఒప్పందాలు
ఒక్క రోజే రూ. 4లక్షల కోట్ల పెట్టుబడుదలకు MOU
విద్యుత్ శాఖలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
రేపు ఐటీ, వినోదం సెక్టార్‌లో పెట్టుబడులకు ఒప్పందాలు
-
Dec 08, 2025 20:31 IST
రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
రేపు సా.6 గంటలకు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
రేపు ఉదయం 9 నుంచే ప్యానల్ డిస్కషన్స్
రాత్రి గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా డ్రోన్లప్రదర్శన
-
Dec 08, 2025 19:10 IST
ఢిల్లీ: ప్రహ్లాద్ జోషిని కలిసిన మంత్రి నాదెండ్ల మనోహర్
2025-26 ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీకి..
51 లక్షల మెట్రిక్ టన్నుల వరి లక్ష్యాన్ని కేటాయించింది: మంత్రి నాదెండ్ల
ఏపీ పౌర సరఫరాల సంస్థ 25 రోజుల్లో 2.69 లక్షల మంది రైతుల నుంచి...
17.37 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసింది: మంత్రి నాదెండ్ల
రోజువారీ సేకరణలో 90,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది
రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ చేశాం: నాదెండ్ల
రైతులు దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు: మంత్రి నాదెండ్ల
-
Dec 08, 2025 19:10 IST
పరకామణి కేసును మీరు సపోర్ట్ చేస్తారా?: సీఎం చంద్రబాబు
దేవుడి సొమ్మును లెక్కిస్తూ.. పట్టుబడిన వారిని సమర్థిస్తారా?: చంద్రబాబు
చిన్న కేసుగా చూస్తారా? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్ధం చేసుకోండి
వెంకటేశ్వర స్వామికి 121 కేజీల బంగారాన్ని.. నేను దేవుడికి ఇవ్వాలని..
అనుకుంటున్నాను అని నాకు ఒక భక్తుడు చెప్పారు: చంద్రబాబు
రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు: చంద్రబాబు
అన్నప్రసాదం ఎలా ఉంటుంది అనేది అందరు చెబుతున్నారు
లడ్డు తయారీ ఎలా ఉంది అనేది అందరు చూస్తున్నారు: చంద్రబాబు
-
Dec 08, 2025 19:10 IST
పైలట్లకు విశ్రాంతి అవసరం: సీఎం చంద్రబాబు
ఇండిగో ప్రమాణాలు పాటించలేదు: సీఎం చంద్రబాబు
సమయం ఇచ్చినా చేయలేకపోయారు: చంద్రబాబు
దీంతో విమానాలు రద్దు అయ్యాయి..ఇబ్బందులు వచ్చాయి
క్షమాపణలు చెప్పినా.. అసౌకర్యం కలిగింది: చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది: సీఎం చంద్రబాబు
-
Dec 08, 2025 19:09 IST
రామ్మోహన్‌తో ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్‌లో మంతనాలు
ఇండిగో వ్యవహారంలో రామ్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన సమాధానంపై మోదీ సంతృప్తి
ఇండిగో వ్యవహారంలో ప్రయాణీకులకు మేలు జరిగేలా..
సమయస్పూర్తిగా వ్యవహరించారని రామ్మోహన్‌కు ప్రధాని మోదీ కితాబు
శాఖాపరంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని మోదీ ప్రశంస
విమర్శలు పట్టించుకోకుండా ముందుకెళ్లాలని రామ్మోహన్‌కు మోదీ సూచన
-
Dec 08, 2025 17:43 IST
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని గొప్పగా పెడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత
కానీ కూకట్‌పల్లిలో కనీస వసతులు కూడా లేవు: కవిత
అసలు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ అని ఎలా చెబుతున్నారు?
JNTU మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది: కవిత
పాలక పక్షం పట్టించుకోవడం లేదు.. ప్రతిపక్షం అడగటం లేదు
అందుకే జాగృతి బాధ్యతను భుజాన వేసుకుని ప్రశ్నిస్తోంది: కవిత
-
Dec 08, 2025 16:44 IST
ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం: భట్టి
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ ముందుకు పోతుంది: భట్టి
2047 లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి
-
Dec 08, 2025 16:43 IST
తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది: సీఎం రేవంత్
2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నాం: రేవంత్
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది మా ఆశయం: రేవంత్
విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు: రేవంత్
అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల సూచనలను ఆహ్వానిస్తున్నాం: రేవంత్
ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం: సీఎం రేవంత్
తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయి, సానుకూల వాతావరణం ఉంది
దేశ జీడీపీలో తెలంగాణ నుంచి 5% వాటాను అందిస్తున్నాం: సీఎం రేవంత్
2047 నాటికి GDPలో 10% వాటాను అందించాలన్నది మా లక్ష్యం: రేవంత్ రెడ్డి
తెలంగాణను 3 భాగాలుగా విభజించాం.. సేవా, తయారీ, వ్యవసాయ రంగం
ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా విభజించాం: సీఎం రేవంత్
ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం: సీఎం రేవంత్
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE),..
రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ(RARE)గా విభజన: సీఎం రేవంత్
చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా,..
సింగపూర్ స్పూర్తిగా తెలంగాణ ఎదుగుతోంది.: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్
-
Dec 08, 2025 15:43 IST
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రోబో..
భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
-
Dec 08, 2025 15:41 IST
భారత్ ఫ్యూచర్ సిటీకి గవర్నర్..
నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..
-
Dec 08, 2025 15:03 IST
ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం: శ్రీధర్‌బాబు
మౌలిక వసతుల కల్పనలో మనమే ముందున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
దేశంలోనే తొలిసారి AI విలేజ్ నిర్మిస్తున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
AI, స్కిల్స్ యూనివర్సిటీలు, క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం
తెలంగాణకు విజన్ ఉంది, ప్రణాళిక ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు
-
Dec 08, 2025 14:53 IST
ఫ్యూచర్ సిటీ వేదికగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'
సమ్మిట్‌లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి
హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే
పాల్గొన్న నోబెల్ గ్రహితలు కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ
సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
-
Dec 08, 2025 14:53 IST
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్: గవర్నర్ జిష్ణుదేవ్
లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది లక్ష్యం: గవర్నర్
అన్ని రంగాల్లో తెలంగాణ విప్లవాత్మక మార్పులు: గవర్నర్
మహిళా రైతులను పలువిధాలుగా ప్రోత్సహిస్తున్నాం: గవర్నర్
బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చాం: గవర్నర్
తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉంది: గవర్నర్
-
Dec 08, 2025 14:48 IST
గ్లోబల్ సమిట్ విజయవంతమైంది: కైలాస్ సత్యార్థి
తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోంది: సత్యార్థి
తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు
మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు: సత్యార్థి
విద్యా ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ కృషి చేస్తోంది
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు: సత్యార్థి
సంస్కృతి, కళలు, టెక్నాలజీ, పరిశ్రమల హబ్‌గా తెలంగాణ: సత్యార్థి
ఐకమత్యం, శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యం: కైలాస్ సత్యార్థి
-
Dec 08, 2025 14:48 IST
భారీ పెట్టుబడులు
తెలంగాణలో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ భారీ పెట్టుబడులు
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్ మీడియా టెక్నాలజీస్
పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు: ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్
-
Dec 08, 2025 13:44 IST
ఫ్యూచర్ సిటీ వేదికగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'
సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు, నటుడు నాగార్జున
సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
పాల్గొన్న నోబెల్ గ్రహితలు కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ
-
Dec 08, 2025 13:29 IST







-
Dec 08, 2025 13:22 IST
గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా రోబో
వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్న రోబో
గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వివరిస్తున్న రోబో
-
Dec 08, 2025 13:13 IST
50 ఏండ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాము: నటుడు నాగార్జున
ఇక్కడ వాతావరణం బాగుంది
తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉంది
ఇక్కడ మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ వాళ్ళు కలిసి ముందుకు రావడం మంచి పరిణామం.
అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్ తో పెద్ద నిర్మాణం చేయవచ్చు
-
Dec 08, 2025 13:04 IST
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
సమ్మిట్ వేదిక దగ్గర స్టాళ్లు పరిశీలించిన సీఎం రేవంత్
సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరణ
సీఎం వెంట మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి
భట్టి విక్రమార్కతో కలిసి సదస్సుకు హాజరైన నటుడు నాగార్జున
కాసేపట్లో సమ్మిట్‌ను ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
-
Dec 08, 2025 12:20 IST
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి
సమ్మిట్ వేదిక దగ్గర స్టాళ్లు పరిశీలిస్తున్న రేవంత్
కాసేపట్లో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ప్రారంభం
సమ్మిట్‌ను ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సమ్మిట్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి, నటుడు నాగార్జున
-
Dec 08, 2025 12:20 IST
చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు
వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న...
దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు చంద్రబాబు హాజరు
చంద్రబాబు బృందంలో మంత్రులు లోకేష్, TG భరత్
పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసిన అధికార వర్గాలు
-
Dec 08, 2025 11:51 IST
కేరళ: ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట
లైంగిక వేధింపుల కేసులో A8 దిలీప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
దోషిగా ఎలాంటి ఆధారాలు లేవన్న ఎర్నాకుళం కోర్టు
A1 నుంచి A6 వరకు దోషులుగా నిర్ధారించిన ఎర్నాకుళం కోర్టు
-
Dec 08, 2025 11:32 IST
రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది: మాజీ మంత్రి హరీశ్‌రావు
రెండేళ్లలో రేవంత్ ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీలేదు: హరీశ్‌రావు
కేసీఆర్ ప్రారంభించిన స్కీమ్‌లు అన్ని అటకెక్కించారు: హరీశ్‌రావు
తెలంగాణలో రోడ్లు, స్కూళ్లు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయి: హరీశ్‌రావు
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదు: హరీశ్‌రావు
-
Dec 08, 2025 11:14 IST
భారత్‌తో బంధాన్ని అమెరికా బలోపేతం చేసుకోవాల్సిందే
నొక్కి చెప్పిన అమెరికా నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2026
ఆదివారం దీనిని విడుదల చేసిన అమెరికా కాంగ్రెస్ నాయకులు
-
Dec 08, 2025 11:14 IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ భద్రత
6వేల మంది పోలీస్ సిబ్బంది, అక్టోపస్ బలగాలతో బందోబస్తు
ఓఆర్‌ఆర్ నుంచి ప్రధాన వేధిక వరకు డ్రోన్లతో నిఘా
-
Dec 08, 2025 10:26 IST
ఇండిగో షేర్లు భారీగా పతనం
ట్రేడింగ్ మొదట్లో 7% విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
తర్వాత కోలుకుని ప్రస్తుతం 3 శాతానికి పైగా నష్టాల్లో కంపెనీ షేర్లు
-
Dec 08, 2025 10:06 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉక్కు నిర్వాసితుల ఆందోళన
మెయిర్‌గేట్ ఎదుట బైఠాయించి నిర్వాసితుల నిరసన
డ్యూటీలకు వెళుతున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత
ఉద్యోగులు, నిర్వాసితుల మధ్య పరస్పర వాగ్వాదం
-
Dec 08, 2025 10:05 IST
గుంటూరు: మంగళగిరిలో శ్రీకృష్ణుని మందిరం వద్ద ఉద్రిక్తత
శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం
విగ్రహం తొలగించవద్దంటూ అడ్డుకుని ఆందోళనకు దిగిన భక్తులు
విగ్రహం మరోచోట ప్రతిష్టించేందుకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్
-
Dec 08, 2025 08:53 IST
అమరావతి: మ.12గంటలకు సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న చంద్రబాబు
సా.4గంటలకు ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Dec 08, 2025 08:29 IST
నెట్‌ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ డీల్‌ను సమీక్షిస్తా: ట్రంప్ ప్రకటన
వినోద రంగంలో రూ.6.48 కోట్లతో జరిగిన భారీ ఒప్పందాల్లో ఇదొకటి
ఈ ఒప్పందంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ షేర్ భారీగా పెరుగుతుందని ట్రంప్ ఆందోళన
-
Dec 08, 2025 08:14 IST
హైదరాబాద్‌లో 77 ఇండిగో విమానాలు రద్దు
విశాఖ నుంచి 7 ఇండిగో విమానాలు రద్దు
-
Dec 08, 2025 08:13 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం
కాంట్రాక్టర్, గుమస్తాను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
మావోయిస్టుల చెర నుంచి తప్పించుకున్న గుమస్తా
కాంట్రాక్టర్ కోసం భద్రతా బలగాల గాలింపు
-
Dec 08, 2025 08:13 IST
ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీ
ఇవాళ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం
ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచన
-
Dec 08, 2025 07:31 IST
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
కన్నూర్-హైదరాబాద్, ఫ్యాంక్‌ఫెర్ట్-హైదరాబాద్,..
లండన్-హైదరాబాద్ విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండైన విమానాలు
మూడు విమానాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
-
Dec 08, 2025 07:31 IST
నేడు గంగవరం పోర్టు ముట్టడికి కార్మికుల పిలుపు
ఒప్పందం అమలులో కాలయాపన చేయడంపై ఆగ్రహం
-
Dec 08, 2025 07:31 IST
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు
పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు
మ.1:30కు సదస్సును ప్రారంభించనున్న గవర్నర్
మ.2:30కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
సదస్సులో నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు
గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు