-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana latest national International breaking news and live updates on 10th December 2025 kjr
-
BREAKING: సీఎం రేవంత్‌తో యూపీ మాజీ సీఎం అఖిలేష్ భేటీ
ABN , First Publish Date - Dec 12 , 2025 | 07:11 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 12, 2025 19:31 IST
రేవంత్‌తో అఖిలేష్ భేటీ
హైదరాబాద్: సీఎం రేవంత్‌తో యూపీ మాజీ సీఎం అఖిలేష్ భేటీ
తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న..
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు వివరించిన రేవంత్
-
Dec 12, 2025 19:31 IST
తెలంగాణలో పర్యటిస్తున్న అఖిలేష్ యాదవ్..
హైదరాబాద్: ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో యాదవ సంఘాల సమ్మేళనం, పాల్గొన్న యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. మనమంతా ఒక్కటే: అఖిలేష్ యాదవ్
రాజకీయాలకు అతీతంగా ఇక్కడ కలుస్తున్నాం: అఖిలేష్ యాదవ్
సదర్ సమ్మేళనానికి గొప్పగా ఏర్పాట్లు చేయాలి: అఖిలేష్ యాదవ్
యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నాం: అఖిలేష్ యాదవ్
ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చేది కాదు: అఖిలేష్ యాదవ్
-
Dec 12, 2025 19:31 IST
దేశంలో 54 మార్గాల్లో విమానాలు నడుస్తున్నాయి: రామ్మోహన్
రద్దీ రూట్లలో ఫిక్స్‌డ్ విమాన ఛార్జీలు: కేంద్రమంత్రి రామ్మోహన్
పండుగల వేళ విమాన ఛార్జీలు పెంచుతున్నారు: రామ్మోహన్
విమాన సర్వీస్ ఛార్జీల మార్పుపై పరిశీలిస్తున్నాం: రామ్మోహన్
-
Dec 12, 2025 16:52 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
2027లో రెండు విడతల్లో డిజిటల్ టెక్నాలజీతో జనగణన
జనగణనకు రూ.11,718 కోట్లు కేటాయింపు
2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు గృహగణన
2027 ఫిబ్రవరి 2 నుంచి జనగణన
బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పూజ్య బాపూ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్పు
ఏడాదికి 120 పనిదినాలు తప్పనిసరి చేసిన కేంద్రం
పూజ్య బాపూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.1.51 లక్షల కోట్లు కేటాయింపు
-
Dec 12, 2025 16:00 IST
ఏరియల్ వ్యూ
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులపై సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ
ఎయిర్‌పోర్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఆరా
-
Dec 12, 2025 16:00 IST
ఓట్ చోరీతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారు: మహేష్‌గౌడ్
తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది ఎంత?: మహేష్‌గౌడ్
BJP ఎమ్మెల్యేలు, ఎంపీలకు వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయి?: మహేష్‌గౌడ్
BRS నేతల బాగోతాలను కవిత బయటపెడుతోంది, కవిత ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీఎంను కోరతా: మహేష్‌గౌడ్
-
Dec 12, 2025 16:00 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
450 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
148 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Dec 12, 2025 15:08 IST
విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
కాగ్నిజెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు భూమిపూజ
స్వయంగా పార పట్టి మట్టి తీసిన సీఎం చంద్రబాబు
పాల్గొన్న మంత్రి లోకేష్, ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్
రూ.1,583 కోట్లతో 3 దశల్లో క్యాంపస్ నిర్మాణం పూర్తికి ప్రణాళిక
2026 నాటికి మొదట దశ పనులు పూర్తయ్యేలా ప్రణాళిక
మొత్తం 8 వేల మందికి ఉపాధి ఇచ్చేలా ప్రణాళిక
నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్‌గా విశాఖ: సీఎం చంద్రబాబు
ఏడాదిలోనే ఎయిర్‌పోర్ట్ పూర్తి, మెట్రో కూడా వస్తుంది: చంద్రబాబు
కాగ్నిజెంట్‌కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలి: సీఎం చంద్రబాబు
నేను ఏది చేసినా మెగా స్కేల్‌లో ఉంటుంది: సీఎం చంద్రబాబు
విశాఖ వంటి సుందరమైన నగరం మరొకటి లేదు: చంద్రబాబు
గతంలో దేశం అంటే చిన్నచూపు ఉండేది: సీఎం చంద్రబాబు
-
Dec 12, 2025 14:22 IST
అఖండ-2 నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట
సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
తదుపరి విచారణ ఈనెల 15కు వాయిదా
అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందన్న డివిజన్ బెంచ్
-
Dec 12, 2025 11:57 IST
హైకోర్టును ఆశ్రయించిన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని కోర్టులో పిటిషన్..
తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్..
పవన్ కల్యాణ్ తరపున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది సాయి దీపక్..
వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశం
తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే సంస్థలపై చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన మెటా, గూగుల్ ఎక్స్‌లను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు..
కేసు విచారణను డిసెంబర్ 22 వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.
-
Dec 12, 2025 10:48 IST
MLAలు మహేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావుకు కవిత లీగల్ నోటీసులు
తనపై, తన భర్తపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని నోటీసులు
వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్
'T NEWS'కు కూడా లీగల్ నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
-
Dec 12, 2025 10:23 IST
కడప: వైసీపీ మేయర్ పాకా సురేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
ఇంటి పన్ను కట్టకుండా కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారని ఫ్లెక్సీలు
మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు అంటూ ఫ్లెక్సీలు
ఫ్లెక్సీలను వెంటనే తొలగించిన మేయర్ సురేష్ అనుచరులు
-
Dec 12, 2025 10:22 IST
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటన
-
Dec 12, 2025 10:22 IST
ఢిల్లీ: పార్లమెంట్‌లో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలతో రాహుల్‌గాంధీ సమావేశం
కాంగ్రెస్ ఎంపీలతో రివ్యూ సమావేశం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ
-
Dec 12, 2025 09:41 IST
తెలంగాణ: మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
నేటి నుంచి మొక్కజొన్న రైతుల ఖాతాల్లో నగదు జమ
రూ.588 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సర్కార్
ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ
ప్రయోజనం పొందనున్న 55,904 మంది రైతులు
-
Dec 12, 2025 08:03 IST
articleText
-
Dec 12, 2025 08:02 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు
నేడు పోలీసుల ముందు సరెండర్ కానున్న ప్రభాకర్‌రావు
సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోనున్న ప్రభాకర్‌రావు
సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోనున్న ప్రభాకర్‌రావు
ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణకు అనుమతించిన సుప్రీం
విచారణలో భౌతికంగా హాని తలపెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశం
-
Dec 12, 2025 07:13 IST
లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి
అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు
8 మంది మృతి.. మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
అరకు నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.