-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest trending breaking news in your hands of july 29 vr
-

Breaking News: ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తెస్తున్నాం: జగన్
ABN , First Publish Date - Jul 29 , 2025 | 06:22 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 29, 2025 19:53 IST
పాక్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌ను మేం రద్దు చేశాం: ప్రధాని మోదీ
అట్టారి సరిహద్దు మూసివేశాం: ప్రధాని మోదీ
సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేశాం: ప్రధాని మోదీ
నదీ జలాల వివాద పరిష్కార బాధ్యతను వరల్డ్ బ్యాంక్‌కు నెహ్రూ అప్పగించారు
నది మనది, నీళ్లు మనవి కానీ పెత్తనం మాత్రం వాళ్లది: ప్రధాని మోదీ
80 శాతం నీళ్లు పాక్‌కు అప్పగించారు: ప్రధాని మోదీ
ఇదేం తెలివి? ఇదేం దౌత్యనీతి?: ప్రధాని మోదీ
-
Jul 29, 2025 19:53 IST
భారత్ తయారీ ఆయుధాలకు భారీ డిమాండ్: ప్రధాని మోదీ
రక్షణరంగ ఉత్పత్తుల్లో 250 శాతం వృద్ధి: ప్రధాని మోదీ
100కి పైగా దేశాలకు డిఫెన్స్ ఎగుమతులు: ప్రధాని మోదీ
మేం శాంతి, సమృద్ధి కోరుకుంటాం: ప్రధాని మోదీ
దేశ భద్రతపై కాంగ్రెస్‌ది ఎప్పుడూ రాజీ ధోరణే: మోదీ
1971లో POKని స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పోగొట్టింది
1974లో కచ్చతీవ్ దీవులను శ్రీలంకకు అప్పగించారు: ప్రధాని మోదీ
ధైర్యంగా, తెలివిగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోయింది: మోదీ
-
Jul 29, 2025 19:53 IST
కార్గిల్ విజయాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ స్వీకరించలేదు: ప్రధాని మోదీ
నేడు సాక్ష్యాలకు కొదవలేదు.. అంతా కళ్ల ముందే ఉంది: ప్రధాని మోదీ
పాక్ స్వరం కలిపి కాంగ్రెస్ మాట్లాడుతోంది: ప్రధాని మోదీ
వ్యతిరేకించేందుకు కాంగ్రెస్‌కు ఏదో ఒకటి కావాలి: ప్రధాని మోదీ
దేశమంతా వాళ్లను చూసి నవ్వుతోంది: ప్రధాని మోదీ
సైన్యంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకభావం ఎప్పటినుంచో ఉంది: ప్రధాని మోదీ
-
Jul 29, 2025 19:53 IST
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: ప్రధాని మోదీ
పాక్ మళ్లీ దుస్సాహసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
స్వావలంబనతో భారత్ ముందుకు సాగుతోంది: ప్రధాని మోదీ
కానీ పాక్ కోసం కాంగ్రెస్ దిగజారిపోతోంది: ప్రధాని మోదీ
కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్ అధికార ప్రతినిధులుగా మారాయి
పాక్ ఎజెండాను కాంగ్రెస్ దిగుమతి చేస్తున్నట్లుంది: ప్రధాని మోదీ
మన సైన్యం విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్ ముగించింది: ప్రధాని మోదీ
రుజువులు చూపాలని కాంగ్రెస్ అడుగుతోంది: ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద విషయం కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు: మోదీ
-
Jul 29, 2025 19:53 IST
దాడి ఆపండి అని పాక్ గగ్గోలు పెట్టి వేడుకుంది: ప్రధాని మోదీ
పాక్ DGMO ఫోన్ చేసి వేడుకున్నారు: ప్రధాని మోదీ
మా దాడి రెచ్చగొట్టే దాడి కాదని స్పష్టం చేశాం: ప్రధాని మోదీ
జూన్ 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు ప్రయత్నించారు
నేను సైన్యంతో మీటింగ్‌లో ఉండి మాట్లాడలేకపోయా: ప్రధాని మోదీ
చాలా సమయం తర్వాత జేడీ వాన్స్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ
పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని వాన్స్ చెప్పారు: ప్రధాని మోదీ
పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అప్పుడే చెప్పా: ప్రధాని మోదీ
పాక్‌కు ఏ దేశం సహాయం చేసినా ఊరుకోం అని చెప్పా: ప్రధాని మోదీ
బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తాం అని చెప్పా: ప్రధాని మోదీ
-
Jul 29, 2025 19:53 IST
మన పరిధి ఎంత విస్తృతమో ప్రపంచమంతా చూసింది: మోదీ
సింధూ నుంచి సిందూర్ వరకు మన పరాక్రమం చూపాం: మోదీ
భారత్‌పై దాడి చేస్తే పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది
ఉగ్రవాద ప్రభుత్వం, ఉగ్రనేతలను వేర్వేరుగా చూడం: మోదీ
193 దేశాల్లో కేవలం 3 మాత్రమే పాక్‌ను సమర్థించాయి: మోదీ
ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుబడుతోంది: మోదీ
ప్రపంచ మద్దతు దొరికింది కానీ.. కాంగ్రెస్ మద్దతు దొరకలేదు: మోదీ
నన్ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది: మోదీ
స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు: మోదీ
హెడ్‌లైన్స్‌లో వచ్చేందుకు కొందరు తప్పుడు ఆరోపణలు చేశారు: మోదీ
-
Jul 29, 2025 19:53 IST
భారత్ శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది: ప్రధాని మోదీ
మేడిన్ ఇండియా డ్రోన్లు, మిస్సైళ్లు పాక్‌ను చీల్చి చెండాడాయి: మోదీ
త్రివిధ దళాల సమన్వయానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం: మోదీ
ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్‌మైండ్స్‌కు నిద్ర దూరమైంది: మోదీ
వారికి తెలుసు భారత్ వస్తుంది.. దాడి చేసి వెళ్తుందని: ప్రధాని మోదీ
-
Jul 29, 2025 19:53 IST
ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానం
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది: ప్రధాని మోదీ
మతం అడిగి మరీ అమాయకుల ప్రాణాలు తీశారు: మోదీ
పాక్‌లో ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టాం: ప్రధాని మోదీ
ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను తుడిచిపెట్టాం: మోదీ
22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: మోదీ
మా లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేశాం: ప్రధాని మోదీ
ఉగ్రవాదుల మూలాలను నాశనం చేశాం: ప్రధాని మోదీ
అక్కడివరకు వెళ్తామని ఎవరూ ఊహించి ఉండరు: మోదీ
పాక్‌కు ఏళ్ల తరబడి గుర్తుండే పాఠం భారత సైన్యం ఇచ్చింది
పాక్ అణు హెచ్చరిక అబద్ధం అని నిరూపించాం: మోదీ
న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు భారత్ లొంగదు: మోదీ
-
Jul 29, 2025 18:29 IST
ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన ధర్నా వాయిదా
బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ధర్నాకు నిర్ణయం
ఢిల్లీలో ధర్నా చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం
ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ ధర్నా వాయిదా
ఆగస్టు 15 తర్వాత ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయం
-
Jul 29, 2025 18:28 IST
ఢిల్లీ: లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ
ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని మోదీ సమాధానం
ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోంది: ప్రధాని మోదీ
భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నాం: ప్రధాని మోదీ
సింధూర్ శపథాన్ని నెరవేర్చినందుకు ఈ విజయోత్సవాలు: ప్రధాని
ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకే ఈ విజయోత్సవాలు
140 కోట్ల భారతీయుల విజయోత్సవాల గురించి మాట్లాడుతున్నా: మోదీ
-
Jul 29, 2025 17:32 IST
పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటన పాకిస్థాన్ పనే: రాహుల్ గాంధీ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అత్యంత అమానుషం: రాహుల్
పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు: రాహుల్
ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు వృద్ధులు చనిపోయారు: రాహుల్
భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపేశారు: రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్‌కు ముక్తకంఠంతో మద్దతు ఇచ్చాం: రాహుల్
దేశ భద్రత విషయంలో ప్రభుత్వానికి అండగా ఉన్నాం: రాహుల్
-
Jul 29, 2025 16:39 IST
కొత్త రేషన్ కార్డులు.. ఎప్పుడంటే..
ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల మనోహర్
ఐదేళ్ల లోపు, 80 ఏళ్లు దాటిన వారికి e-KYC అవసరంలేదు: నాదెండ్ల
-
Jul 29, 2025 16:38 IST
పీఏసీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తెస్తున్నాం: జగన్
వైసీపీ కార్యకర్తలను ఎవరు వేధించినా యాప్‌లో ఆధారాలు అప్‌లోడ్ చేయొచ్చు: జగన్
పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తాం: జగన్
అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తాం: జగన్
వేధించిన అందరికీ సినిమా చూపిస్తాం: జగన్
-
Jul 29, 2025 16:17 IST
2025 ఏప్రిల్‌లో పహల్గామ్ దాడి జరిగింది: మల్లికార్జున ఖర్గే
అప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాం: ఖర్గే
పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై ప్రధాని మోదీకి రాహుల్ లేఖ రాశారు: ఖర్గే
రాహుల్ గాంధీ లేఖకు కనీసం సమాధానం ఇవ్వలేదు: మల్లికార్జున ఖర్గే
సమయం వచ్చినప్పుడు జవాబు ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్పారు: ఖర్గే
పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు అధికారపక్షం వెనుకాడింది: ఖర్గే
విపక్షాలు రాసిన లేఖలను కనీసం చూడరు.. చెత్తకుండీలో వేస్తారు: ఖర్గే
మీ అహంకారం, గర్వం పోయేరోజు తప్పకుండా వస్తుంది: మల్లికార్జున ఖర్గే
-
Jul 29, 2025 16:17 IST
పహల్గామ్‌లోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు?: మల్లికార్జున ఖర్గే
పహల్గామ్ దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది: ఖర్గే
పహల్గామ్ ఘటన తర్వాత అఖిలపక్ష భేటీకి ప్రధాని ఎందుకు రాలేదు?
దేశ భద్రత కంటే మోదీకి రాజకీయ ర్యాలీలే ఎక్కువయ్యాయా?: ఖర్గే
పహల్గామ్ ఘటన ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే: మల్లికార్జున ఖర్గే
ఇంటెలిజెన్స్ వైఫల్యానికి హోంమంత్రి బాధ్యత వహించాల్సిందే: ఖర్గే
కాంగ్రెస్‌ను నిందిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు: మల్లికార్జున ఖర్గే
కేంద్రం అసవాస్తవాలను ఎవరూ నమ్మరు.. ఇప్పటికైనా నిజాలు చెప్పండి: మల్లికార్జున ఖర్గే
ఉగ్రమూలాలను దెబ్బతీస్తే.. పహల్గామ్‌లోకి ఎలా వచ్చారు?: ఖర్గే
-
Jul 29, 2025 16:17 IST
ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో చర్చ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచమంతా చూసింది: మల్లికార్జున ఖర్గే
పాకిస్థాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు: ఖర్గే
పహల్గామ్ ఘటనతో సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారు: ఖర్గే
ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందని మొదటి నుంచి చెబుతున్నాం: ఖర్గే
మాపై నిందలు మోపి మీరే పాక్ నేతలను కౌగిలించుకుంటున్నారు: ఖర్గే
ఆహ్వానించకుండానే పాకిస్థాన్ వెళ్లడం సిగ్గుచేటు: మల్లికార్జున ఖర్గే
మీరు తప్పులు చేసి మాపై అసత్య ఆరోపణలా?: మల్లికార్జున ఖర్గే
అసత్యాలతో ప్రజలను ఎక్కువకాలం మభ్యపెట్టలేరు: మల్లికార్జున ఖర్గే
మేం ఎప్పుడూ పాక్‌కు మద్దతు ఇవ్వలేదు.. ఇవ్వబోం: మల్లికార్జున ఖర్గే
దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌కు ఘన చరిత్ర ఉంది: మల్లికార్జున ఖర్గే
-
Jul 29, 2025 14:40 IST
ఉగ్రవాదాన్ని తుదముట్టించామని అమిత్ షా చెబుతున్నారు: ప్రియాంక
కశ్మీర్‌లో గతంలోనూ TRF పలుచోట్ల దాడులు చేసింది: ప్రియాంక గాంధీ
2024లో TRF దాడుల్లో 9 మంది చనిపోయారు: ప్రియాంక గాంధీ
TRF వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది?: ప్రియాంక గాంధీ
పహల్గామ్ ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా?: ప్రియాంక గాంధీ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు బాధ్యత ఎవరిది?: ప్రియాంక గాంధీ
హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా?: ప్రియాంక గాంధీ
-
Jul 29, 2025 14:38 IST
కశ్మీర్‌లో పరిస్థితులు మారాయని కేంద్రం చెబుతోంది: ప్రియాంకగాంధీ
కశ్మీర్‌లో శాంతిభద్రతలు నెలకొన్నాయని మోదీ అన్నారు: ప్రియాంక
పహల్గామ్‌లో పర్యాటకులను దారుణంగా చంపారు: ప్రియాంకగాంధీ
వివరాలు అడిగిమరీ యాత్రికులను కాల్చిచంపారు: ప్రియాంకగాంధీ
తన భార్య చూస్తుండగానే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారు: ప్రియాంకగాంధీ
పహల్గామ్‌లో పర్యాటకుల దగ్గర భద్రతాసిబ్బంది ఎందుకు లేరు?: ప్రియాంక
పర్యాటకుల భద్రత కేంద్ర ప్రభుత్వానిది కాదా?: ప్రయాంకగాంధీ
-
Jul 29, 2025 13:24 IST
హైదరాబాద్: ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
స్పెర్మ్ టెక్‌లో ఆధారాలు సేకరిస్తున్న వైద్యారోగ్యశాఖ, క్లూస్ టీమ్
ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో నిల్వ ఉంచి వీర్యం శాంపిల్స్ సీజ్
అక్రమంగా IVF విధానాలను అనుసరిస్తున్నట్టు గుర్తించిన వైద్యారోగ్యశాఖ
సేకరించిన వీర్యాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు IVF కేంద్రాలకు తరలింపు
ఇప్పటికే ఇండియన్ స్పెర్మ్ టెక్ యజమాని పంకజ్‌తో పాటు ఏడుగురు అరెస్ట్
-
Jul 29, 2025 12:50 IST
విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి: అమిత్‌షా
ఉగ్రవాదులను మట్టుబెడితే ఆనందం వ్యక్తం చేస్తారనుకున్నా
కానీ విపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు: అమిత్‌షా
ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలి
ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం కూడా లేదు: అమిత్‌షా
ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు..
ఆధారాలు ఉన్నాయా అని చిదంబరం ప్రశ్నించారు: అమిత్‌షా
పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా?: అమిత్‌షా
పాక్‌కు క్లీన్‌చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి?: అమిత్‌షా
కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదు
పాక్ నుంచి వచ్చారనేందుకు మా దగ్గర ఆధారాలున్నాయి: అమిత్‌షా
ఉగ్రవాదుల నుంచి కొన్ని పాక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం: అమిత్‌షా
-
Jul 29, 2025 12:30 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట
భూ వివాదం కేసులో పెద్దిరాజు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం
ఇప్పటికే రేవంత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని..
పెద్దిరాజు పిటిషన్‌ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన పెద్దిరాజు
పెద్దిరాజుతో పాటు ఆయన అడ్వొకేట్ రితేష్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు
తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశం
కోర్టుకు క్షమాపణ చెప్పిన పిటిషనర్ తరఫు అడ్వొకేట్ రితేష్ పాటిల్
కేసు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి కోరిన న్యాయవాది రితేష్
కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ప్రశ్నించిన సుప్రీం
సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం
తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
Jul 29, 2025 12:18 IST
ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ
పహల్గామ్ దాడి అమానుష ఘటన: అమిత్ షా
పహల్గామ్‌లో కుటుంబసభ్యుల ముందే చంపేశారు: అమిత్ షా
మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపేశారు: అమిత్ షా
నిన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాం: అమిత్ షా
పహల్గామ్ దాడి కీలక నిందితుడు సులేమాన్‌ను హతమయ్యాడు: అమిత్ షా
పహల్గామ్ దాడి ప్రాంతానికి నేను వెళ్లా: అమిత్ షా
-
Jul 29, 2025 11:51 IST
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు హతం
-
Jul 29, 2025 11:20 IST
NCLTలో జగన్‌కు ఊరట
జగన్ పిటిషన్‌ను అనుమతించిన NCLT
తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్
జగన్ వాదనలతో ఏకీభవించిన NCLT
విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ NCLT తీర్పు
NCLT తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం
-
Jul 29, 2025 10:37 IST
బాపట్ల: వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం దౌర్జన్యం
సంతమాగులూరులో రెండు గ్రానైట్ క్వారీలు లీజుకు తీసుకున్న ఏసురత్నం
వైసీపీ హయాంలో సర్వే హద్దు రాళ్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏసురత్నం
హద్దు రాళ్ల పేరుతో రూ.వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము దోపిడీ
లీజు గడువు ముగిసినా క్వారీని ప్రభుత్వానికి స్వాధీనం చేయని MLC ఏసురత్నం
లీజు అద్దె నగదు సైతం చెల్లించకుండా MLC ఏసురత్నం బెదిరింపులు
రూ.6 కోట్లు విలువైన క్వారీని రూ.2 కోట్లుకు తనకే అమ్మాలని బెదిరింపులు
తమకు న్యాయం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు
-
Jul 29, 2025 10:18 IST
హైదరాబాద్: ఈడీ ఆఫీస్‌కు BRS నేతలు
పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని BRS నేతలు ఆరోపణ
మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్‌కు రానున్న BRS నేతలు
పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణ జరపాలని ఈడీని కోరనున్న BRS
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటోన్న BRS నేతలు
-
Jul 29, 2025 10:09 IST
చంద్రబాబుతో భేటీపై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి కీలక ప్రకటన
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది: మంత్రి టాన్సీ లెంగ్
భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ: మంత్రి టాన్సీ లెంగ్
ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తి: మంత్రి టాన్సీ లెంగ్
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో..
పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చ: మంత్రి టాన్సీ లెంగ్
-
Jul 29, 2025 10:02 IST
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్
జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటనలు
నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ క్యాడర్ తో సమావేశమవుతోన్న కేటీఆర్
గులాబీ కార్యకర్తలను లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ చేస్తోన్న కేటీఆర్
మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలవటమే లక్ష్యమంటోన్న బీఆర్ఎస్
నేడు సొంత నియోజకవర్గం సిరిసిల్లకు కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలాల వారిగా ముఖ్యనాయకులతో కేటీఆర్ వరుస సమావేశాలు
-
Jul 29, 2025 09:55 IST
ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు రేపటికి వాయిదా
తుది జాబితాను మరోసారి పరిశీలించనున్న బోర్డు
రేపు పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న హోం మంత్రి అనిత
-
Jul 29, 2025 09:53 IST
హైదరాబాద్ శివారులో భూముల వేలానికి సర్కార్ సన్నద్ధం
TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలు సిద్ధం
రాయదుర్గంలో 4ప్లాట్లు, ఉస్మాన్‌సాగర్‌లో 46 ఎకరాలు, 13 ప్లాట్లు వేలం వేయాలని నిర్ణయం
టెండర్ దాఖలుకు ఆగస్టు 8వరకు గడువు
అదే రోజు TGIICలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డ్
రాయదుర్గంలోని 15A/2 ప్లాట్‌కు మార్కెట్ ధర రూ.71.60కోట్లుగా నిర్ణయం
రాయదుర్గంలో మొత్తం 7.67 ఎకరాల భూమి వేలం
రాయదుర్గంలో ఎకరం ధర 104.74 కోట్లుగా నిర్ధారించిన TGIIC
-
Jul 29, 2025 09:28 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికులకే టికెట్: మంత్రి పొన్నం
బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వం: మంత్రి పొన్నం
అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది: మంత్రి పొన్నం
-
Jul 29, 2025 09:20 IST
నిమిష ప్రియ వ్యవహారంలో మరో మలుపు
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు: కేంద్ర విదేశాంగశాఖ
ఉరిశిక్ష రద్దు వార్తల్లో నిజం లేదు: కేంద్ర విదేశాంగశాఖ
ఉరిశిక్ష రద్దైనట్టు అధికారిక సమాచారం లేదు: విదేశాంగశాఖ
యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిష ప్రియకు శిక్ష
-
Jul 29, 2025 09:19 IST
జార్ఖండ్: దేవ్‌గఢ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
ట్రక్కును ఢీకొన్న బస్సు, 18 మంది మృతి
పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
కన్వర్ యాత్రకు బస్సులో వెళ్తుండగా ఘటన
-
Jul 29, 2025 09:07 IST
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై HRC సీరియస్
ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించిన HRC
ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు
మరో ఇద్దరి కోసం కొనసాగుతోన్న గాలింపు
నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు
-
Jul 29, 2025 08:55 IST
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ
లోకసభలో కొనసాగనున్న ఆపరేషన్ సిందూర్‌పై చర్చ
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత ప్రత్యేక చర్చ ప్రారంభం
చర్చలో భాగంగా ఉభయసభల్లో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం
-
Jul 29, 2025 08:52 IST
ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో MoU
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీ ఏర్పాటు
ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ MoUపై సంతకాలు
సృజనాత్మక కంటెంట్ తయారీకి ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
-
Jul 29, 2025 08:34 IST
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ అల్టిమేటం
పుతిన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా: ట్రంప్
పుతిన్‌కు గతంలో ఇచ్చిన 50 రోజుల గడువు తగ్గిస్తా: ట్రంప్
ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రష్యాకు 10-12 రోజులే సమయం
ఒప్పందం కుదరకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు: ట్రంప్
-
Jul 29, 2025 08:15 IST
రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లోట్‌పై సైబర్ దాడి
100కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన ఏరోఫ్లోట్
తామే దాడిచేశామన్న ఉక్రెయిన్, బెలారస్ హ్యాకర్లు
-
Jul 29, 2025 07:57 IST
అమెరికాలో కాల్పుల కలకలం, ఐదుగురు మృతి
న్యూయార్క్ మన్‌హట్టన్‌లో దుండగుడి కాల్పులు
దుండగుడి కాల్పుల్లో పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి
దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు
-
Jul 29, 2025 07:56 IST
సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
నేడు 10కి పైగా సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
క్యారియర్, విల్మర్, TVS, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు
యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం
సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం,..
మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ భేటీ కానున్న సీఎం
గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు,..
డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సీఎం సమావేశం
మధ్యాహ్నం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్‌ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు
-
Jul 29, 2025 07:27 IST
చైనాలో భారీ వరదలు, బీజింగ్‌లో 34 మంది మృతి
80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
హబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
-
Jul 29, 2025 07:20 IST
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్టైఫండ్,..
సిబ్బంది జీతభత్యాలు, సౌకర్యాలపై విజిలెన్స్ అధికారులు ఆరా
అనుబంధ ఆస్పత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, కాన్పుల వివరాలు సేకరణ
-
Jul 29, 2025 07:16 IST
నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
-
Jul 29, 2025 07:16 IST
నేడు ఢిల్లీలో విపత్తు నిర్వహణ మెగా మాక్‌డ్రిల్
ఏకకాలంలో 55 చోట్ల మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు
విపత్తులను ఎదుర్కొనే సన్నద్దతలో భాగంగా మాక్‌డ్రిల్
-
Jul 29, 2025 07:15 IST
రేపు నైసార్ ఉపగ్రహ ప్రయోగం
రేపు సా.5:40కి నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F16 రాకెట్
రూ.11,200 కోట్లతో నాసా, ఇస్రో ఉమ్మడి ప్రయోగం
అత్యంత ఖరీదైన భూపరిశీలన ఉపగ్రహంగా నైసార్ రికార్డు
-
Jul 29, 2025 07:14 IST
లోక్‌సభలో మ.12 గంటలకు అమిత్ షా ప్రసంగం
సాయంత్రం ముగింపు ప్రసంగం చేయనున్న ప్రధాని
ఆపరేషన్ సిందూర్‌పై నేడు రాజ్యసభలో చర్చ
కాంగ్రెస్ తరఫున చర్చ ప్రారంభించనున్న మల్లికార్జున ఖర్గే
రాజ్యసభలో చర్చకు కాంగ్రెస్‌కు 2 గంటలు కేటాయింపు
-
Jul 29, 2025 07:03 IST
భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు
నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించిన యెమెన్
యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిష ప్రియకు శిక్ష
-
Jul 29, 2025 06:52 IST
నేటినుంచి GSLV కౌంట్‌డౌన్
GSLV-F16 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
నాసా, ఇస్రో సంయుక్తంగా కక్ష్యలోకి నైసార్ ఉపగ్రహం
రేపు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F16
-
Jul 29, 2025 06:40 IST
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
భూకంప తీవ్రత 6.2గా నమోదు
-
Jul 29, 2025 06:25 IST
అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పులు
మన్‌హట్టన్‌లోని భవనంలోకి గన్‌తో చొరబడ్డ ఆగంతకుడు
దుండగుడి కాల్పుల్లో పోలీస్ సహా ఇద్దరు మృతి
దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు
-
Jul 29, 2025 06:22 IST
నేడు ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల
సచివాలయంలో ఫలితాలు విడుదల చేయనున్న హోంమంత్రి అనిత
ఇవాళ ఉ.11 గం.కు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయనున్న అనిత
2022 అక్టోబర్‌లో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలు
న్యాయ వివాదాల తర్వాత నేడు ఫలితాలు విడుదల