-
-
Home » Mukhyaamshalu » abn brings you the latest breaking news in your hands of july 26 vr
-

BREAKING: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం
ABN , First Publish Date - Jul 26 , 2025 | 06:31 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 26, 2025 19:19 IST
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం
వరుసగా ఢీకొన్న 20 వాహనాలు, నలుగురు మృతి
మరో 17 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
వర్షం కారణంగా ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు
-
Jul 26, 2025 17:10 IST
సంస్కరణల అమలుకు జైపాల్ రెడ్డి తాపత్రయపడ్డారు: రేవంత్ రెడ్డి
రాజకీయాల్లో ధనప్రవాహం తగ్గాలని జైపాల్ రెడ్డి చెప్పేవారు: రేవంత్
రాజకీయాల్లో జైపాల్ రెడ్డి 40 ఏళ్ల పాటు అజాతశత్రువుగా ఉన్నారు: రేవంత్
జైపాల్ రెడ్డికి ప్రతిపక్షాలతో సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమే ఉండివి
పీవీ తర్వాత చట్టసభల్లో జైపాల్ రెడ్డిది ప్రముఖ పాత్ర: రేవంత్ రెడ్డి
స.హ.చట్టం రావడంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉంది: రేవంత్ రెడ్డి
-
Jul 26, 2025 17:10 IST
హైదరాబాద్: ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవం
హోటల్ తాజ్‌కృష్ణలో కార్యక్రమం, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ICFAI & క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారు: రేవంత్ రెడ్డి
ఇవాళ రాజకీయాలు ప్రమాదకర దిశలో వెళ్తున్నాయి: సీఎం రేవంత్
ప్రజాస్వామిక విలువలు తగ్గి... పొలిటికల్ మేనేజ్‌మెంట్ పెరిగింది
సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలపడంలో తప్పులేదు: రేవంత్
ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించామని చెప్పేవారు సమస్యలపై ప్రజలు నిరసన తెలిపితే అడ్డుకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 26, 2025 17:10 IST
సికింద్రాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదు
సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేశారని ఆరోపణ
IVF కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు వెళ్లిన దంపతులు
భర్త కాకుండా.. మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించారని ఆరోపణ
ఇతరుల వీర్యకణాలతో IVF పద్ధతిలో పిండాన్ని వృద్ధి చేసిన ఆస్పత్రి
మహిళ ఫిర్యాదుతో DNA టెస్టులు చేయించిన పోలీసులు
బాధితుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో పోలీసుల తనిఖీలు
-
Jul 26, 2025 16:44 IST
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ ఐఏఎస్ సుడిగాలి పర్యటన
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష
జిల్లాలో భారీ వర్షాలతో ముందు జాగ్రత్త చర్యలపై పలు సూచనలు
ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను అలర్ట్ చేసిన శరత్
-
Jul 26, 2025 16:44 IST
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు
ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
మొత్తం 33 జిల్లాలకు నిధులు విడుదల
జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.33 కోట్లు విడుదల
తక్షణ చర్యలు, అవసరమైన సామగ్రి కొనుగోలుకు అనుమతి
ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేందుకే తక్షణ చర్యలకు ఆదేశాలు
కలెక్టర్లకు అత్యవసర నిధి కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 26, 2025 15:53 IST
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మరో ప్రీ లాంచ్ మోసం
భారతి బిల్డర్స్ పేరిట ప్రీ లాంచ్ అంటూ రూ.కోట్ల మేర టోకరా
ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌కు రూ.కోట్లు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులు
ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతి బిల్డర్స్
-
Jul 26, 2025 15:53 IST
తిరుపతిలో హీరో విజయ్ దేవరకొండ సినిమాకు నిరసన సెగ
గతంలో దళితులపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం
కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్‌ను అడ్డుకుంటాం: దళితులు
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు
గతంలో ఉగ్రవాదులతో ట్రైబల్స్‌ను పోల్చిన విజయ్ దేవరకొండ
-
Jul 26, 2025 15:53 IST
నిద్రలో కూడా కేసీఆర్ గుర్తొస్తున్నారు: హరీశ్ రావు..
రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకువస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్‌రావు
రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు: హరీశ్
రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు... నిధులు ఢిల్లీ: హరీశ్‌రావు
-
Jul 26, 2025 15:51 IST
కేటీఆర్‌కు కౌంటర్‌గా ఎంపీ సి.ఎం.రమేష్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ, కాంగ్రెస్ శత్రువులు.. ఆ పార్టీలు ఎక్కడైనా కలుస్తాయా?
కంచ భూముల్లో నాకు కాంట్రాక్ట్ రాలేదు: ఎంపీ సి.ఎం.రమేష్
కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయి: సి.ఎం.రమేష్
నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చింది: సి.ఎం.రమేష్
వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు: సి.ఎం.రమేష్
-
Jul 26, 2025 15:51 IST
ఢిల్లీ: సెంటిమెంట్‌తో చిచ్చుపెట్టే BRSను ఎవరూ నమ్మడం లేదు: ఎంపీ చామల
ఫోన్ ట్యాపింగ్‌తో అధికార దుర్వినియోగం చేశారు: ఎంపీ చామల
కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు కేటీఆర్: చామల
16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి: ఎంపీ చామల
ఎన్నికల వేళ ఓటు వేయాలని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు: చామల
రేవంత్ రెడ్డిపై విమర్శలతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు: చామల
-
Jul 26, 2025 13:09 IST
కాగ్ నివేదిక ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆందోళనకరంగా ఉన్నాయి: జగన్
ఆదాయం లేకపోగా అప్పులు పెరుగుతున్నాయి: జగన్
ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది: జగన్
ఏపీలో ఆర్ధిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేదు: జగన్
ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది: జగన్
ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది: జగన్
పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయి: జగన్
-
Jul 26, 2025 12:49 IST
తెలంగాణలో కొత్త నాయకత్వం కావాలి: కవిత
19ఏళ్ళుగా తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుంది: కవిత
చాలా సంస్థలు పుడతాయి..పోతాయి..
కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయి: కవిత
-
Jul 26, 2025 12:26 IST
పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
AOB పరిధిలో మావోయిస్టు డంప్ లభ్యం
AK 47 సహా 15 తుపాకులు, రాకెట్ లాంఛర్లు, వాకీటాకీలు..
హ్యాండ్ గ్రనేడ్లు సహా ఇతర పేలుడు పదార్థాలు సీజ్
పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
లొంగిపోయిన వారిలో కృష్ణా జిల్లా వాసి అరుణ అలియాస్ విమల, అలియాస్ సరిత
లొంగిపోయిన వారిలో విజయవాడకు చెందిన రామకృష్ణ అలియాస్ కమలేష్
-
Jul 26, 2025 12:20 IST
పడమట పోలీస్ స్టేషన్ కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీ
కోర్టు కండిషనల్ బెయిల్ నిమిత్తం సంతకం చేసేందుకు పడమటి స్టేషన్ కు వల్లభనేని వంశీ
-
Jul 26, 2025 11:43 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు.
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు.
ఈ వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై BNS 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు
-
Jul 26, 2025 11:37 IST
గోవా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అశోక్‌గజపతిరాజు
హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్, ఏపీ మంత్రి లోకేష్, పలువురు టీడీపీ నేతలు
-
Jul 26, 2025 11:26 IST
పోలీసు విచారణకి హాజరుకాని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.
అనిల్ రాక కోసం ఎదురు చూస్తున్న విచారణ అధికారులు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కేసులో హై కోర్టుని ఆశ్రయించిన అనిల్.
తనపై నమోదైన కేసుని కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అనిల్.
పోలీసులకి ఫోనుల్లోనూ కూడా అందుబాటులోకి రాని అనిల్.
క్వార్ట్జ్ అక్రమాల కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే విచారణకి హాజరు కాలేదనే చర్చలు.
-
Jul 26, 2025 11:17 IST
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వే నివేదికలో వెల్లడి
భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా..
మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా అగ్రస్థానంలో మోదీ
75 శాతం మంది మద్దతుతో మొదటి స్థానంలో నిలిచిన మోదీ
జులై 4-10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే
-
Jul 26, 2025 11:01 IST
BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్.
కొండాపూర్ లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు
కౌశిక్ రెడ్డి పై దాడికి NSUI పిలుపు
NSUI పిలుపు నేపథ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ నేతలు
కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అనుచరులు
ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు
-
Jul 26, 2025 11:00 IST
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం
షేక్‌పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం
లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్‌లో వర్షం
మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్‌హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం
వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
-
Jul 26, 2025 10:57 IST
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసుల అలర్ట్
ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు
ములుగు ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు
-
Jul 26, 2025 10:03 IST
నేటి నుంచి తమిళనాడులో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన
తూత్తుకుడి ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోదీ
రేపు గంగైకొండ చోళపురాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ
రూ.4,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
-
Jul 26, 2025 09:16 IST
నెల్లూరు: నేడు కోవూరు పీఎస్‌కు మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి..
అనుచిత వ్యాఖ్యల కేసులో A2గా అనిల్‌కుమార్ యాదవ్
పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న అనిల్‌కుమార్ యాదవ్
-
Jul 26, 2025 08:53 IST
సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్‌కు నిపుణుల కమిటీ నివేదిక
సిగాచి ప్రమాదంపై ఈనెల 2న నిపుణల కమిటీ వేసిన టీజీ ప్రభుత్వం
ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన నిపుణుల కమిటీ
ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని సూచన
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలి: నిపుణుల కమిటీ
పారిశ్రామికవాడలో ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి: నిపుణుల కమిటీ
ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: నిపుణుల కమిటీ
కమిటీ నివేదికపై ఎల్లుండి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న టీజీ ప్రభుత్వం
-
Jul 26, 2025 08:35 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి..
ఆయనపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు..
ఫిర్యాదు చేసిన ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత...
-
Jul 26, 2025 08:10 IST
ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు సాయం చేయొద్దని చైనాకు అమెరికా సూచన
అగ్నికి ఆజ్యం పొయొద్దని చైనాకు అమెరికా వార్నింగ్
అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన చైనా
నిందలు మాని శాంతిచర్చలను ప్రోత్సహించాలని అమెరికాకు చైనా కౌంటర్
-
Jul 26, 2025 07:48 IST
తిరుపతి జూపార్క్ రోడ్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి చిరుత యత్నం
బైక్ వేగంగా నడపడంతో తప్పిన ప్రాణాపాయం
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చిరుత దాడి దృశ్యాలు
-
Jul 26, 2025 07:05 IST
యాదాద్రి: చౌటుప్పల్ మండలం కైతాపురంలో రోడ్డుప్రమాదం
లారీని ఢీకొన్న కారు, ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు మృతి
అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్రగాయాలు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
-
Jul 26, 2025 06:52 IST
ఆగస్టు 6న ఏపీ కేబినెట్ సమావేశం
ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం భేటీ
ఆగస్టు 4వ తేదీ నాటికి కేబినేట్ పెట్టే అంశాలపై ఆయా శాఖల అధిపతులు తమ ప్రతిపాదనలు పంపాలని ఆదేశించిన చీఫ్ సెక్రటరీ
-
Jul 26, 2025 06:38 IST
తెలంగాణలో నేడు లాసెట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 22న సీట్ల కేటాయింపు
-
Jul 26, 2025 06:38 IST
నేడు తెలంగాణలో పీజీ ఈసెట్ నోటిఫికేషన్
ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 11, 12న పీజీ ఈసెట్ తొలివిడత వెబ్ ఆప్షన్లు
ఆగస్టు 16న పీజీఈసెట్ సీట్ల కేటాయింపు
ఆగస్టు 18 నుంచి 21 వరకు కాలేజ్‌ల్లో విద్యార్థుల రిపోర్ట్
-
Jul 26, 2025 06:35 IST
నేడు రాత్రి సింగపూర్ బయల్దేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఆరు రోజుల పాటు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు
బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పర్యటన
-
Jul 26, 2025 06:35 IST
నెల్లూరు: నేడు కోవూరు పీఎస్‌కు మాజీమంత్రి అనిల్
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వ్యాఖ్యల కేసులో..
పోలీసుల ఎదుట హాజరుకానున్న అనిల్‌కుమార్
-
Jul 26, 2025 06:34 IST
నేటి నుంచి ఫిడే మహిళల చెస్ వరల్డ్‌కప్ ఫైనల్
రెండురోజుల పాటు జరగనున్న ఫైనల్
ఫైనల్‌లో తలపడనున్న కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్
-
Jul 26, 2025 06:33 IST
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
కోస్తా, రాయాలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు
-
Jul 26, 2025 06:31 IST
గోవా గవర్నర్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజు
ఉ.11గంటలకు గోవా గవర్నర్ బంగ్లా దర్బార్‌హాల్‌లో ప్రమాణస్వీకారం
-
Jul 26, 2025 06:31 IST
రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ-1 మల్లారెడ్డిపై వేటు
ఉప్పల్‌లోని కార్యాలయంలో మద్యం తాగినట్టు ఆరోపణలు
కార్యాలయాన్ని సిబ్బందితోనే శుభ్రం చేయించినట్టు అభియోగం
మల్లారెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు సరెండర్ చేస్తూ రాచకొండ సీపీ ఉత్తర్వులు
ట్రాఫిక్ డీసీపీ-1గా రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు
-
Jul 26, 2025 06:31 IST
నేడుఏ బీఆర్ఎస్, జాగృతి పోటాపోటీ కార్యక్రమాలు
కేటీఆర్ ముఖ్య అతిథిగా BRS విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి సదస్సు
కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి 'లీడర్' శిక్షణ ప్రారంభం
నాచారంలో VNR కన్వెన్షన్‌లో సమావేశానికి BRS ఏర్పాట్లు
BRSV సమావేశంలో ప్రధాన వక్తలుగా పాల్గొననున్న కేటీఆర్, హరీష్‌రావు