Post Breakup Healng Tips: బ్రేకప్ అయిందా? ఈ పనులు చేయండి.. హ్యాపీగా ఉంటారు..!
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:18 PM
బ్రేకప్ అనే పదాన్నే చాలామంది జీర్ణించుకోలేరు. ప్రియమైన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే అది చాలా బాధిస్తుంది. ఆ బాధ నుండి బయటపడలేక మానసికంగా కుంగిపోవడం లేదా చెడు అలవాట్లకు బానిసలుగా మారి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే, హార్ట్ బ్రేక్ తర్వాత తిరిగి లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.

చాలా ప్రేమకథలు మధ్యలోనే ముగిసిపోతాయి. కులం-మతం, ఆస్తి-హోదా, అహం ఇలా ప్రేమికులు విడిపోవడానికి అనేక కారణాలు. ఇటీవల పెళ్లయిన తర్వాత చిన్న చిన్న కారణాలకే జంటలు విడాకుల బాట పడుతున్నాయి. కారణం ఏదైనా, జీవితాంతం తోడుంటారని ఊహించిన వ్యక్తి అనూహ్యంగా విడిపోతే మనసు పడే వేదన వర్ణనాతీతం. ఈ బాధ నుంచి బయటపడలేక లోలోపలే కుంగిపోతూ కొందరు జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటే.. మరికొందరు మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బ్రేకప్ బాధ నుంచి కోలుకుని తిరిగి రోజువారీ పనులపై దృష్టి పెట్టి జీవితాన్ని ఆస్వాదించాలంటే.. ఈ కింది పనులు తప్పక చేయాలి.
మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి
విడిపోయిన తర్వాత తెగిపోయిన బంధం గురించి, మాజీ గురించి ఆలోచించడం మానేయండి. ఇది చెప్పినంత సులభం కాదు. కానీ, జిమ్‌కు వెళ్లడం, డ్యాన్స్ చేయడం లేదా నచ్చిన హాబీలపై దృష్టి పెట్టండి. మీకు ఆనందం కలిగించే పనులు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
ట్రిప్ కి వెళ్లండి
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి ప్రదేశానికి ట్రిప్ కి వెళ్లండి. ట్రిప్ కి వెళ్లేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో క్వాలిటీ సమయాన్ని గడపడం వల్ల బ్రేకప్ బాధ నుండి విముక్తి కలగవచ్చు.
చెడు విషయాలకు దూరంగా ఉండండి
విడిపోయిన వెంటనే కొంతమంది ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను ప్రారంభిస్తారు. కానీ తరువాత ఈ అలవాట్లు వారి జీవితాలను నాశనం చేస్తాయి. కాబట్టి, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన పనులు చేస్తూ గడపండి. అప్పుడు మీరు చెడు అలవాట్ల గురించి ఆలోచించరు.
మిమ్మల్ని మీరు నిందించడం మానేయండి
విడిపోయిన తర్వాత కొంతమంది తమను తాము నిందించుకుంటూ నిత్యం ప్రతికూల ఆలోచనలతో నిరాశ, నిస్పృహ, మానసిక అశాంతితో కొట్టుమిట్టాడుతుంటారు. అందుకే ముందు మిమ్మల్ని మీరు బాధించుకోవడం మానేయండి. రిలేషన్ బ్రేక్ అవడానికి నేనే కారణం అంటూ కుంగిపోయే బదులు.. గతాన్ని మరిచి భవిష్యత్తును అందంగా, సంతోషంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రస్తుతం ఏం చేయాలో ఆలోచించండి.
ఎక్స్ లవర్ నంబర్ బ్లాక్ చేయండి
కొంతమంది విడిపోయిన తర్వాత కూడా వారి మాజీ ప్రేమికుడు/ప్రేయసి నంబర్, ఫోటోలను దాచుకుంటారు. వాటిని పదే పదే చూస్తూ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఎక్స్ లవర్ ను మర్చిపోలేరు. బ్రేకప్ బాధ నుంచి బయట పడటం కష్టమవుతుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలనుకుంటే ముందుగా మీ ఎక్స్ లవర్ ఫోటోలు, నంబర్ డిలీట్ చేసుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
డైలీ 10 నిమిషాలు ఈ పనిచేయండి.. బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది..!
హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.