Share News

Sleeping Tips: నేలపై నిద్రపోతే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు..

ABN , Publish Date - May 14 , 2025 | 05:00 PM

Sleeping On Floor Benefits: కొందరికి మెత్తటి పరుపుపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మరికొందరికి నేలపై పడుకుంటేనే నచ్చుతుంది. కానీ, నేలపై నిద్రపోవడాన్ని మంచి అలవాటుగా ఎందుకు పరిగణిస్తారో మీకు తెలుసా. ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా నేలపైనే పడుకోవడం మొదలుపెడతారు.

Sleeping Tips: నేలపై నిద్రపోతే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు..
Sleeping On Floor Benefits

Sleeping On Floor vs Bed: నేలపై పడుకోవడం చాలా ప్రయోజనకరమని పెద్దవాళ్లు చెప్పగా వినే ఉంటారు. పూర్వం ప్రజలంతా ఎక్కువగా నేలపైనే పడుకునేవారు. నేటికీ నేలపై పడుకోవడానికి అలవాటు పడినవారు మెత్తటి పరుపులపై కూడా పడుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా వేసవిలో మంచం కాలిపోతూ ఉంటుంది. ఇక దానిపై పరుపు ఉంటే మరింత వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చల్లని నేలపై పడుకుంటే శరీరానికి గొప్ప రిలీఫ్ దక్కుతుంది. ఈ అలవాటు ఎంత విశ్రాంతినిస్తుందో.. అన్నే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి, మెత్తటి పరుపుల కంటే నేలపై నిద్రిస్తే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఏంటి ? ఈ అలవాటును ఎందుకు అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వెన్నెముక

గట్టిగా, చదునుగా ఉండే నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. అదే మీరు మృదువైన పరుపు మీద పడుకుంటే వెన్నెముక వంగిపోతుంది. కాలక్రమేణా ఆకృతిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా సరైన భంగిమలో నిద్రించకపోతే వెన్నునొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సరైన అమరికలో ఉంటుంది. ఇది శరీర ఆకృతిని సరిగ్గా ఉంచుతుంది. వెన్నునొప్పిని కూడా నివారిస్తుంది.


రక్త ప్రసరణ

నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నేల చదునుగా ఉండటం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై సమాన బరువు పడుతుంది. కొన్ని భాగాలపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా, మీరు ఉదయం మేల్కొన్నప్పుడు మరింత శక్తిమంతంగా, తాజాగా ఉన్నట్లు భావిస్తారు.


వెన్నునొప్పి

మీరు చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతుంటే నేలపై పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల వీపుకు బలమైన సపోర్ట్ లభిస్తుంది. దీని కారణంగా వెన్నెముక నిటారుగా మారుతుంది. వెన్నునొప్పి నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది.


నిద్ర నాణ్యత

నేలపై పడుకోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఇలా నిద్రించే సమయంలో మీ శరీరం కదులుతున్నట్లు మీకు అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది. గాఢనిద్రకు సహాయపడుతుంది. పరుపు మీద కంటే నేలపై పడుకుంటే చల్లగా, సౌకర్యంగా ఉండి మంచి నిద్ర పడుతుంది.


కండరాలు

నేలపై పడుకోవడం వల్ల కండరాల దృఢత్వం పెరుగుతుంది. అదే పరుపు మీద పడుకుంటే శరీర అమరిక చెదిరిపోతుంది. నేలపై అయితే కండరాలు సాగి విశ్రాంతి పొందుతాయి. ముఖ్యంగా తుంటి, తొడలు లేదా కాళ్ళలో దృఢత్వం తగ్గి కండరాల బలహీనతతో బాధపడేవారు నేలపై నిద్రిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Read Also: Parenting Tips: ప్రతి తండ్రి తన టీనేజ్ కొడుకుకు కంపల్సరీగా నేర్పించాల్సిన అలవాట్లు ఇవే.. ఎందుకంటే..

Chanakya Niti: పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు పిచ్చిగా ప్రేమిస్తారు..

Husband Wife Relationship: మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు ఈ పనులు

Updated Date - May 14 , 2025 | 05:19 PM