Share News

Summer Vacation Tips: సమ్మర్ వెకేషన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..

ABN , Publish Date - May 03 , 2025 | 01:16 PM

Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్‌తో పాటు ఫిట్‌నెస్‌ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.

Summer Vacation Tips: సమ్మర్ వెకేషన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..
Summer Vacation Nutrition Tips

Nutrition Guide For Summer Trips: వేసవిలో అందరితో కలిసి వెకేషన్ వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ప్రయాణాల్లో చేసే అల్లరి, సందడి అన్నీ ఇన్నీ కావు. ట్రిప్ మీకు నచ్చినట్టుగా సరదాలు, సాహసాలు, అడ్వెంచర్లతో సాగాలంటే ఆరోగ్యం గురించి కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే, తీవ్రమైన ఎండల్లో ప్రయాణాలు చేస్తే డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. విమానం, కారు, బస్సు ఇలా ఎందులో ట్రావెల్ చేస్తున్నా హీట్ వేవ్స్ శరీరాన్ని ఏదో రకంగా దెబ్బతీస్తాయి. కాబట్టి, వెకేషన్ వెళ్లే ముందే ప్రయాణాల్లో కోల్పోయిన శక్తిని రీఫిల్ చేసుకునేందుకు ఇలా ప్లాన్ చేసుకోండి.


హైడ్రేషన్

వేసవి ప్రయాణాల్లో అందరూ అత్యంత తరచుగా ఎదుర్కొనే సమస్యలలో డీహైడ్రేషన్ ఒకటి. మీరు ఏ వాహనంలో ప్రయాణించినా అధిక వేడి కారణంగా శరీరం వేగంగా నీరు కోల్పోతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ ఓ వాటర్ బాటిల్ వెంట ఉంచుకుని తరచూ నీరు తాగుతూ ఉండండి. చిన్న మొత్తంలో పింక్ సాల్ట్ లేదా ఎలక్ట్రోలైట్ పౌడర్ కలిపి తాగితే శరీరంలో ద్రవ స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టేవాళ్లు ఈ టిప్ కచ్చితంగా పాటించాలి.


హెల్తీ స్నాక్స్

ప్రయాణాలలో ఆకలిగా ఉన్నప్పుడు అందరూ సాధారణంగా చిప్స్ లేదా ఏదైనా ప్రీప్యాక్ చేసిన స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ ఆహారాలలో అధిక ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఫలితంగా కడుపులో ఉబ్బరం, అలసట, గ్యాస్ట్రిక్ వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి. బదులుగా, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. కాల్చిన మఖానా (తామర గింజలు), ఖర్జూరం లేదా ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు లేదా ఆపిల్ వంటి తాజా పండ్లు లేదా క్లీన్-లేబుల్ ప్రోటీన్ బార్‌లను ప్యాక్ చేసుకోండి. ఈ ఆరోగ్యకరమైన స్నాక్ మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. ప్రయాణ సమయంలో అలసిపోకుండా చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.


సమతుల్య భోజనం

ప్రయాణ సమయంలో భోజనం ఎల్లప్పుడూ సకాలంలో తినలేకపోవచ్చు లేదా పోషకాలతో కూడిన ఆహారం దొరక్కపోవచ్చు. కాబట్టి, బయట తినేటప్పుడు ప్రోటీన్ (గుడ్లు, చికెన్ లేదా పప్పులు వంటివి), కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. ముఖ్యంగా వేయించిన లేదా భారీ మోతాదులో ఆహారం తినడం మానుకోండి. ఎందుకంటే ఇవి తింటే అలసట, జీర్ణక్రియకు ఆటంకం కలిగి అసౌకర్యానికి దారితీస్తాయి.


ఆల్కహాల్, చక్కెర పానీయాలు

వేసవి సెలవుల్లో, చాలా మంది కూల్ కూల్ గా ఉండే కూల్ డ్రింక్స్ లేదా ఆల్కహాల్ విపరీతంగా తాగేస్తుంటారు. కానీ ఆల్కహాల్‌ను అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. జీర్ణక్రియకు ఆటంకం కలిగించి మీ నిద్రను చెడగొడుతుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా, సోడాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌ల వంటి చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. అనవసర కేలరీలను శరీరంలో నింపుతాయి. బదులుగా, నీరు, తాజా నిమ్మ సోడా లేదా కొబ్బరి నీరు వంటి సహజ, హైడ్రేటింగ్ పానీయాలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని చల్లగా, తాజాగా చేయడమే కాకుండా ప్రయాణించేటప్పుడు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.


జీర్ణక్రియ

ప్రయాణాల్లో సమయానికి ఆహారం, నీరు తీసుకోలేరు. అందువల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరగదు. ఇలా జరగకూడదంటే పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలను లేదా ప్రోబయోటిక్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉండండి. కడుపు శాంతిస్తుంది. భోజనం తర్వాత అల్లం టీ లేదా ఫెన్నెల్ టీ (సోంపు గింజల టీ) వంటి హెర్బల్ టీలు కూడా జీర్ణక్రియకు సహాయపడతాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి.


Read Also: Coconut: కొబ్బరికాయ కొనేటపుడు ఈ 4 విషయాలు గుర్తు పెట్టుకోండి..

Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. పొరపాటున కూడా ఈ 5 మంది సలహా తీసుకోకండి..

Prathyekam: మురికి దిండుపై తల పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

Updated Date - May 03 , 2025 | 01:17 PM