Sleeping Tips: నిద్రలేమి వేధిస్తోందా.. 4-7-8 టెక్నిక్‌తో క్షణాల్లో గాఢ నిద్ర..
ABN , Publish Date - May 10 , 2025 | 09:17 PM
How To Sleep Fast Naturally: మీకు రాత్రుళ్లు పడుకున్న తర్వాత ఎంతో సేపటికి గానీ నిద్ర పట్టడం లేదా.. నిద్రలేమితో పొద్దున లేవగానే శరీరమంతా భారంగా, మనసంతా ఇబ్బందిగా అనిపిస్తోందా.. అయితే, ఈ సమస్యను ఎదుర్కోవటానికి 4-7-8 టెక్నిక్ ప్రయత్నించండి. క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.

4-7-8 Breathing Technique For Fast Sleep: జీవితంలో ఆహారం, నీరు ఎంత అవసరమో తగినంత నిద్ర కూడా అంతే అవసరం. అందరూ బాగా నిద్రపోవాలని కోరుకుంటారు. అప్పుడే అలసట తీరి మరుసటి రోజున ఉత్సాహంగా, తాజాగా ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, మీరు 4-7-8 శ్వాస పద్ధతిని అవలంబించవచ్చు. ఇకపై నిద్రలేమి కారణంగా రాత్రుళ్లు పక్కపై అటు ఇటూ దొర్లుతూ ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. మరి, ఈ పద్ధతి ఏమిటి? దానిని ఎలా అనుసరించాలో తెలుసుకుందాం.
4-7-8 శ్వాస ప్రక్రియ అంటే ఏమిటి?
ధ్యానం, విజువలైజేషన్‌ను కలిపి చేసే శ్వాస పద్ధతులు మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. 4-7-8 శ్వాస టెక్నిక్ మెదడు, మనసును విశ్రాంతిగా మారుస్తుంది. ఆందోళనను తగ్గించి వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిలో ముక్కు ద్వారా ముందుగా 4 సెకన్ల పాటు గాలి పీల్చాలి. తర్వాత 7 సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. చివరగా 8 సెకన్ల పాటు నోటి ద్వారా గాలిని వదలాల్సి ఉంటుంది.
ఈ పద్ధతిని ఎలా అనుసరించాలి
Step 1- సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి లేదా పడుకోండి.
Step 2- మీ నాలుక కొనను మీ పై ముందు దంతాల వెనుక ఉంచండి.
Step 3- మీ ముక్కు ద్వారా నాలుగు అంకెలు లెక్కించే వరకూ నిశ్శబ్దంగా గాలిని పీల్చుకోండి.
Step 4- ఏడు లెక్క పెట్టేంతవరకూ శ్వాసను బిగపట్టుకుని ఉంచండి.
Step 5- ఎనిమిది అంకెలు మనసులో లెక్కించుకుంటూ నోటి ద్వారా పూర్తిగా గాలిని వదులండి.
Step 6- ఈ సైకిల్ కనీసం నాలుగు సార్లు పునరావృతం చేయండి.
ఈ టెక్నిక్ ప్రయోజనకరంగా ఉంటుంది
ఈ శ్వాస టెక్నిక్ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఆందోళన భావాలను తగ్గిస్తుంది. దీనివల్ల ప్రజలు నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ టెక్నిక్‌ని అవలంబించడం వల్ల మీరు త్వరగా నిద్రపోగలరు. దీనితో పాటు నిద్ర నాణ్యతను కూడా మెరుగుపడుతుంది.
Read Also: Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..
Summer Tips: ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ ఆన్‌లో ఉంచడం సరైందేనా..
Cooking Tips: ఈ కూరల్లో ఉల్లిపాయ మిక్స్ చేస్తే.. రుచి, ఆరోగ్యం రెండూ చెడిపోతాయి..