Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:40 AM
Tan Removal Home Remedy: సమ్మర్‌లో ఎప్పటికప్పుడు చర్మ సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఎండ తగిలే శరీర భాగాలు నల్లగా కమిలిపోయి ఎన్నాళ్లకి తొలగిపోవు. వీటిని వెంటనే పోగొట్టుకుని కాంతివంతమైన చర్మం పొందాలంటే ఇంట్లో ఈ సన్ ట్యాన్ రిమూవల్ లోషన్ తయారు చేసుకోండి.

Tan Removal Home Remedy: సన్ ట్యానింగ్ పోగొట్టుకోవడం కోసం ఖరీదైన క్రీములు, లోషన్లు వాడుతున్నారా.. అయినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వేసవి ఎండకు, వేడి గాలులకు కందిపోయి రంగు మారిన ముఖం, కాళ్లు, చేతులు వంటి శరీరభాగాలు ఇబ్బందిపెడుతుంటే.. ఇంట్లోనే ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ తయారుచేసుకుని వాడి చూడండి. నిల్వ కూడా చేసుకునేందుకు వీలుండే ఈ ప్యాక్ ప్రతి రాత్రి ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేశారంటే ఇట్టే పోతుంది. చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి, ట్యానింగ్ సమస్య వదిలించుకోవడానికి ఈ ప్రత్యేకమైన ట్యాన్ రిమూవల్ లోషన్ తయారు చేయండి.
టాన్ రిమూవల్ లోషన్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు:
నిమ్మరసం - అర టీస్పూన్
గ్లిజరిన్ - 1 టీస్పూన్
రోజ్ వాటర్ - 1 టీస్పూన్
తయారీవిధానం:
మీరు ఈ లోషన్ ముఖ సంరక్షణ కోసం తయారు చేస్తుంటే.. అర టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ గ్లిజరిన్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపండి. సరిపోతుంది. ఒకవేళ చేతులు, కాళ్ళ చర్మం కోసం దీన్ని తయారు చేస్తుంటే నిమ్మరసం మొత్తాన్ని రెండు చెంచాలకు పెంచండి. అన్ని పదార్థాలను కలిపి ఒక సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
ట్యానింగ్ లోషన్ ఎలా వాడాలి
ఈ యాంటీ-టానింగ్ లోషన్‌ను ప్రతి రాత్రి పడుకునే ముందు చర్మంపై అప్లై చేసి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రం చేసుకుని మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి. ట్యానింగ్ జరిగి ఉంటే ఒక వారంలోనే తేడా కనిపిస్తుంది. దీన్ని ప్రతిరోజూ అప్లై చేసుకున్నారంటే చర్మంపై ట్యానింగ్ కనిపించదు.
Read Also: Food Hacks: కిచెన్‌లో ఒక్క రోజులో పాడయ్యే ఆహార పదార్థాలు.. జాగ్రత్త తీసుకోకపోతే అంతేసంగతి..
Milk Storage Tips: వేసవిలో ఫ్రిజ్ లేకున్నా పాలు చెడిపోకుండా ఉండేందుకు.. అద్భుతమైన టిప్స్..
Water Bottle Car: కారులో వాటర్ బాటిల్ ఉంచుతున్నారా.. అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..