Share News

Home Remedies for Lice: తలలో పేలు ఇబ్బందిపెడుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే రిలీఫ్..!

ABN , Publish Date - Jul 29 , 2025 | 03:49 PM

తలలో పేలు పడితే అంత ఈజీగా వదలవు. ఇవి చికాకుతోపాటు విపరీతమైన దురదను కలిగిస్తాయి. చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి ఈ సమస్య వస్తుంది. పేల బెడద పూర్తిగా వదిలించుకోవాలంటే ఈ సింపుల్ హోం చిట్కాలను ప్రయత్నించండి.

Home Remedies for Lice: తలలో పేలు ఇబ్బందిపెడుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే రిలీఫ్..!
Home Remedies for Lice

ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు పేల సమస్యతో బాధపడుతుంటారు. జుట్టు అడుగున పేరుకుపోయిన మురికి, చెమట పేను సమస్యకు ప్రధాన కారణాలు. ఇది మాత్రమే కాదు. పేలు ఒకరి తల నుంచి మరొకరి తలకు వేగంగా వ్యాపిస్తాయి. ఇవి చికాకుతోపాటు విపరీతమైన దురదను కలిగిస్తాయి. పేల సమస్య ఒకసారి వస్తే వదిలించుకోవడం కష్టం. షాంపూలు వంటివి వాడినా జుట్టు పాడయ్యే అవకాశముంది. అందుకే, పేల బెడద శాశ్వతంగా పోగొట్టుకునేందుకు ఈ సింపుల్ హోం చిట్కాలను ప్రయత్నించండి.


ఉల్లిపాయ రసం

ఉల్లిపాయల్లో సల్ఫర్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పేను సమస్యను నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి, పేను సమస్య నుంచి బయటపడటానికి తురిమిన ఉల్లిపాయ నుంచి రసాన్ని తీయండి. దీనిని కొంచెం కొబ్బరి నూనెతో కలిపి వేసి తలపై మసాజ్ చేయండి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి హెడ్ బాత్ చేయండి. ఇలా వారానికి 1-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

వెనిగర్

వెనిగర్ తలపై పేలు పెరగకుండా నిరోధిస్తుంది. ఒక కప్పు నీటిలో మరో కప్పు వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి.

కర్పూరం నూనె

కొబ్బరి నూనెను కర్పూరంతో కలిపి జుట్టుకు రాయడం వల్ల పేల సమస్య నుంచి బయటపడవచ్చు. దీని కోసం 7-8 కర్పూరాలను మెత్తగా చేసి వేడిచేసిన కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు రాయండి. తల చల్లబడి దురద తగ్గుతుంది. పేల సమస్యనూ తొలగిస్తుంది. అలాగే, జుట్టు బలంగా, దట్టంగా పెరుగుతుంది.


వేప నీరు

వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది తల చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సాయపడతాయి. కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోయండి. ఈ నీళ్లను స్నానం చేసే ముందు తలపై స్ప్రే చేసుకోండి. ఈ సింపుల్ రెమెడీ పేలను తగ్గిస్తుంది. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వెల్లుల్లి రసం

వెల్లుల్లిలో పేలను పోగొట్టేందుకు సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి రసాన్ని తలకు అప్లై చేసి అరగంట పాటు ఉండండి. అనంతరం షాంపూతో తలస్నానం చేయండి. పేల సమస్యను శాశ్వతంగా వదిలించుకునేందుకు ఇది ప్రభావంతమైన నివారణ.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:

డైలీ 10 నిమిషాలు ఈ పనిచేయండి.. బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది..!

బ్రేకప్ అయిందా? ఈ పనులు చేయండి.. హ్యాపీగా ఉంటారు..!
Read
Latest and Health News

Updated Date - Jul 29 , 2025 | 03:57 PM