Black Mold on Onion: నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు వాడుతున్నారా? జాగ్రత్త .!
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:39 PM
నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు వంటకు వాడటం, తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వాటిని తింటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఉల్లిపాయలు మన వంటగదిలో ఒక ప్రధానమైన కూరగాయ. ఇవి లేకుంటే వంట రుచి రుచి అసంపూర్ణంగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఉల్లిపాయలపై నల్ల మచ్చలు లేదా బూజు (ఫంగస్) కనిపిస్తుంటాయి. అలాంటి ఉల్లిపాయలు తినడం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు అనే విషయం మీకు తెలుసా? అలాంటి ఉల్లిపాయలను వాడటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఎందుకు వాడకూడదు? వాడితే ఏలాంటి ప్రభావాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చెడు ప్రభావం
నల్ల మచ్చలు లేదా బూజు ఉన్న ఉల్లిపాయలను ఎప్పుడూ ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. దానిలో మైకోటాక్సిన్ అనే విషపదార్థాలు కలిగిన ఒక రకమైన టాక్సిన్ ఏర్పడుతుందని, ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల ఫుడ్ అలెర్జీ, వాంతులు , విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా ఇది దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల, అలాంటి ఉల్లిపాయలను కడిగి లేదా కట్ చేసి వాడటానికి బదులుగా, వాటిని నేరుగా పారవేయడమే మంచిదని సూచిస్తున్నారు.
తాజా ఉల్లిపాయలను వాడండి
ఎప్పుడూ తాజా, శుభ్రమైన ఉల్లిపాయలను ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజా ఉల్లిపాయలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
నల్ల మచ్చలను ఎలా నివారించాలి?
ఉల్లిపాయలపై నల్ల మచ్చలు లేదా ఫంగస్ రాకుండా నిరోధించడానికి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం . చాలా మంది ఉల్లిపాయలను పదే పదే కొనకుండా ఉండటానికి ఒకేసారి చాలా కొంటారు. దీనివల్ల నిల్వ చేసేటప్పుడు మచ్చలు, ఫంగస్ అభివృద్ధి చెందుతాయి. ఉల్లిపాయలను చల్లని ప్రదేశాలలో, ఫ్రిజ్‌లో లేదా తేమతో కూడిన ప్రదేశాలలో అస్సలు ఉంచవద్దు. వర్షాకాలంలో ఉల్లిపాయలలో ఫంగస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, ఈ సీజన్‌లో మీ వినియోగానికి అనుగుణంగా ఉల్లిపాయలను కొనండి. తద్వారా అవి తాజాగా ఉంటాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి .
ఇవి కూడా చదవండి
వర్షాకాలంలో ఈ పదార్థాలు తింటే పేగు ఆరోగ్యానికి ముప్పు..!
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..
For More Health News