Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:08 AM
Air Purifying Indoor Plants: ప్రస్తుత కాలంలో ఇంటా బయటా ఎక్కడ చూసినా కలుషితంతో నిండిన గాలే. ఈ పరిస్థితులు మన జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెరుగైన వాతావరణంలో ఉంటేనే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, ఆక్సిజన్‌ను పంచే ఈ ఔషధ మొక్కలను ఇంట్లో నాటుకోండి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ మీ సొంతమవుతాయి.

Indoor Plants For Clean Air: ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉండే వాతావరణం కూడా కాలుష్యరహితంగా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు వయసు పెరుగుతున్నా ఉత్సాహం, చురుకుతనం తగ్గదు. వృద్ధాప్యంలోనూ ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఇప్పటి నుంచే ఈ పని చేయడం మొదలుపెట్టండి. ఆక్సిజన్ బ్యాంకులుగా పిలిచే ఈ ఔషధ మొక్కలను ఇంట్లో నాటుకోండి. ఇవి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు సానుకూల వాతావారణాన్ని, శాంతిని సృష్టిస్తాయి. ఇంట్లో ఉండే చెడు గాలిని బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని ప్రవహింపజేసి మిమ్మల్ని ఆరోగ్యంగా, శక్తిమంతంగా మారుస్తాయి. మరి, ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన ఆ ఔషధ మొక్కలేవో తెలుసుకుందామా..
తులసి
ఆయుర్వేదంలో తులసిని సకల వ్యాధులకు నివారణగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మొక్క జలుబు, దగ్గు, జ్వరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది మాత్రమే కాదు. తులసి మొక్క దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి ఇంట్లో సానుకూల పరిస్థితులు సృష్టిస్తుంది.ఈ ఆకుల కషాయం ఆరోగ్యానికి చాలా మంచిది.
కలబంద
కలబందలోని ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. చర్మానికి, ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తుంది. జీర్ణక్రియను మెరుగుదల, గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్క తక్కువ స్థలంలో కూడా పెరుగుతుంది.
వేప
చర్మ సమస్యలు , మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలను నయం చేయడానికి వేపాకులు, బెరడును ఉపయోగిస్తారు . ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వేప మొక్క ఇంటి ఆవరణలో నాటితే గాలిలో ఉండే బ్యాక్టీరియా, విష పదార్థాలు నాశనం అవుతాయి.
పుదీనా
పుదీనా వాసన శరీరంలో ఉత్తేజాన్ని పెంచుతుంది. దీన్ని జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు తలనొప్పి, ఒత్తిడిని తగ్గిపోతాయి. పుదీనా ఆకులను టీ, చట్నీ, సలాడ్, డికాక్షన్ తయారీలో ఉపయోగించవచ్చు. వేసవిలో దీన్ని నాటుకుంటే ఇల్లు చల్లదనం, తాజాదనంతో నిండిపోతుంది.
అశ్వగంధ
అశ్వగంధ ఒత్తిడి, ఆందోళనను తొలగించి శరీరానికి శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని ఇంట్లో నాటుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యంగానూ ఉండగలుగుతారు.
తిప్పతీగ
ఆయుర్వేద సంజీవని పేరొందిన తిప్పతీగ లేదా గిలోయ్‌ను అమృతం మొక్క అని కూడా పిలుస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, జ్వరం, శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అదీగాక ఈ తీగను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం.
స్నేక్ ప్లాంట్
ఈ మొక్క రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసి ఇంట్లో గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలో ఉండే దుమ్ము దాని మైనపు లాంటి ఆకులకు అంటుకుంటుంది. ఇది ఇంట్లో ఉంటే హాయిగా, గాఢంగా నిద్రపోతారు. టెన్షన్స్ తగ్గి ప్రశాంతంగా గడపాలంటే ఇంట్లో ఈ మొక్క నాటుకుంటే చాలు.
Read Also: Kedarnath Yatra 2025: గంటల్లోనే కేదార్‌నాథ్ దర్శించుకునే ఛాన్స్.. అందుకోసం భక్తులు ఏం చేయాలంటే..
Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..
Morning Walk Tips: మార్నింగ్ వాక్‍కు వెళ్లే ముందు ఈ పొరపాట్లు చేయకండి..