Share News

Herbal Skin Care: బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేదు.. గ్లోయింగ్ స్కిన్ కోసం 5 ఆకులు చాలు..

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:22 PM

మొటిమలు, మచ్చలు మీ అందాన్ని చెడగొడుతున్నాయని బాధపడుతున్నారా? ఇవే కాదు. ఏ చర్మ సమస్యలనైనా మటుమాయం చేసే శక్తి ఈ కింది ఆకులకు ఉంది. ఆయుర్వేదం ప్రకారం, ఇవి చర్మానికి సంజీవని లాంటివి.

Herbal Skin Care: బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేదు.. గ్లోయింగ్ స్కిన్ కోసం 5 ఆకులు చాలు..
Herbal Skincare Remedies

మొటిమలు, మచ్చలు మీ అందాన్ని చెడగొడుతున్నాయని బాధపడుతున్నారా? వీటిని శాశ్వతంగా వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? ఎన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా ఫలితం కనిపించలేదని దిగాలు పడకండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో లభించే ఈ 5 ఆకులు చాలు. ఆయుర్వేదం ప్రకారం, ఇవి చర్మానికి సంజీవని లాంటివి. మీ చర్మ సమస్యలను శాశ్వతంగా పూర్తిగా నయం చేసే శక్తి వీటికుంది. ఈ కింది చిట్కాలను పాటించారంటే మచ్చల్లేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.


వేప

మీకు వేప గురించి తెలిసే ఉంటుంది. దీని చేదు చర్మానికి ఎంత మేలు చేస్తుందో.. ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. చర్మ సంరక్షణ కోసం వేపను ఉపయోగించాలంటే దీని ఆకులను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోండి. తర్వాత దాన్ని నేరుగా మొటిమలు లేదా కురుపులపై పూయండి. అనంతరం వేప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయి. దీనితో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్న వేప మొటిమలు, తామర వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్మాన్ని డీటాక్సిఫై చేసి శుభ్రంగా మెరిసేలా చేస్తుంది.

తులసి

భారతీయ సంస్కృతిలో తులసి ఆకులకు మతపరమైన ప్రాముఖ్యత ఉందని తెలిసిందే. ఇది చర్మానికి అద్భుతమైన ఔషధం కూడా. చర్మ ఆరోగ్యం కోసం తులసి ఆకులను రుబ్బి రోజ్ వాటర్ లేదా గంధపు పొడితో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. దీనిని 15-20 నిమిషాలు అప్లై చేసి తర్వాత కడిగేయండి. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచి మచ్చలను పోగొడతాయి. అంతేకాదు, చర్మం కూడా కాంతిమంతమవుతుంది.


పుదీనా

వేసవిలో పుదీనా చట్నీ ఎంత ఉపశమనం ఇస్తుందో అది మీ చర్మాన్ని కూడా ప్రశాంతపరుస్తుంది. పుదీనాను ఆకులను చూర్ణం చేసి నేరుగా మొటిమలపై పూయండి లేదా దాని రసాన్ని తీసి టోనర్‌గా ఉపయోగించండి. పుదీనాలో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మొటిమలను ఎండిపోయేలా చేస్తుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లబరచి దురదను తగ్గిస్తుంది. జిడ్డు చర్మంగల వారికి అద్భుతంగా పనిచేస్తుంది.

కరివేపాకు

ఆహారానికి రుచిని జోడించే కరివేపాకు చర్మానికి చాలా మంచిది. వీటిని ఎండబెట్టి పొడి చేసి పెరుగు లేదా పాలతో కలిపి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. కరివేపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి. ఇది నల్ల మచ్చలను తేలికపరచడంలో కూడా సహాయపడుతుంది.


కలబంద

కలబంద జెల్ చర్మానికి ఒక వరం లాంటిది. కలబంద ఆకు నుండి తాజా జెల్‌ను తీసి చర్మంపై రాసుకోండి. మీరు దీనిని మాయిశ్చరైజర్‌గా, సన్‌బర్న్ ట్రీట్‌మెంట్‌గా లేదా నైట్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. కలబంద చర్మంలో తేమను పెంచుతుంది. మంటను తగ్గిస్తుంది. మొటిమలను, మచ్చలను పోగొడుతుంది. వడదెబ్బ, దురద చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 23 , 2025 | 03:22 PM