Share News

Air India: సాంకేతిక లోపంతో వెనక్కొచ్చిన ఎయిరిండియా విమానం

ABN , Publish Date - Jul 23 , 2025 | 02:41 PM

క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో లోపం తలెత్తడంతో ముందస్తు జాగ్రత్తగానే విమానాన్ని వెనక్కు మళ్లించామని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Air India: సాంకేతిక లోపంతో వెనక్కొచ్చిన ఎయిరిండియా విమానం
Air India Express

మలప్పురం: ఎయిరిండియా (Air India) విమానాలు ఇటీవల కాలంలో తరచు సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. కేరళలోని కాలికట్ నుంచి దోహాకు బుధవారంనాడు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ (IX 375)లో సాంకేతిక లోపం తలెత్తింది. గాలిలో ఉండగానే సాంకేతిక లోపం బయటపడటంతో వెంటనే దానిని వెనక్కు మళ్లించారు. సిబ్బంది, పైలట్లతో సహా 188 మంది ప్రయాణికులతో ఉదయం 9.07 గంటలకు బయలుదేరిన విమానం 11.12 గంటలకు బయలుదేరిన చోటికే సురక్షితంగా ల్యాండ్ అయినట్టు అధికారులు తెలిపారు.


క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో లోపం తలెత్తడంతో ముందస్తు జాగ్రత్తగానే విమానాన్ని వెనక్కు మళ్లించామని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఫుడ్, రిఫ్రెష్‌మెంట్ ఏర్పాటు చేశామని, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేశామని చెప్పారు.


దీనికి ముందు, మంగళవారంనాడు హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులను బయటపడటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన

భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 02:47 PM