Canada Election Results 2025: సినిమా స్టైల్లో ఎన్నికల ప్రచారం.. దాదాపు ఖాయమైన గెలుపు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:03 AM
కెనడా రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలకు కేంద్రంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయానికి దగ్గరైంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ దాదాపు 150 సీట్లు గెలుచుకున్నట్టు అంచనాలు వచ్చాయి.

కెనడా రాజకీయాలు (Canada Election Results 2025) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ, పియరీ పోయిలివ్రే కన్జర్వేటివ్ పార్టీని ఓడించి, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే దిశగా దూసుకెళ్తోంది. కార్నీ పార్టీ ఇప్పటివరకు దాదాపు 158 సీట్లు గెలుచుకుందని తెలిసింది. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ లిబరల్ పార్టీ విజయం సాధించిందని పలు నివేదికలు వస్తున్నాయి. అంచనాల ప్రకారం లిబరల్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ప్రతిపక్ష స్థాయిలో
మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రే తన ఓటమిని అంగీకరించారు. ఈ పరిణామంతో, ఆయన పార్టీ ప్రతిపక్ష స్థాయిలో కొనసాగనుంది. కొన్ని నెలల క్రితం సర్వేల్లో వెనుకబడిన లిబరల్స్‌కు ఈ ఫలితం కీలక పరిణామం అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు, కెనడాను "51వ రాష్ట్రం"గా మారుస్తామనే బెదిరింపులు, ఈ ఎన్నికల్లో జాతీయవాద భావనలను రగిల్చాయి. 2015 కెనడియన్ సమాఖ్య ఎన్నికలు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు కన్జర్వేటివ్ పాలనను ముగించి, లిబరల్స్ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సినిమా ట్రైలర్ మాదిరిగా
ఈ క్రమంలోనే బ్రిటిష్ కొలంబియాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి వ్యాట్ స్కాట్ ఒక అసాధారణమైన ప్రచార వీడియో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ, సమానత్వం, విద్య వంటి కీలక అంశాలను తన ప్రచారంలో ఉపయోగించాడు. కానీ, అతని సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి ఎంచుకున్న మార్గం సాంప్రదాయకమైనది కాదు. 60 సెకన్ల నిడివిగల ఒక ప్రచార వీడియోను రూపొందించాడు. వీడియోలో స్కాట్ ఆకాశంలో ఎగురుతూ, ఒక భారీ కత్తితో డ్రాగన్‌ను చంపుతాడు. అంతటితో ఆగకుండా, అతని కళ్ళ నుంచి లేజర్ కిరణాలను ప్రయోగించి ఒక రోబోట్‌ను నాశనం చేస్తాడు. ఒక గ్రహాంతరవాసిని పిడికిలితో కొడతాడు. ఆకాశం నుంచి పడిపోతున్న వ్యక్తిని కూడా రక్షిస్తాడు. ఈ వీడియో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ట్రైలర్‌ను తలపించేలా ఉంది. కానీ ఇది ఒక రాజకీయ ప్రచారం కావడం విశేషం.
వైరల్ కావడంతో..
ట్రంప్ "కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తాం" అనే బెదిరింపులు, కెనడియన్లలో ఒక రకమైన ఐక్యతను తీసుకొచ్చాయి. మార్క్ కార్నీ ఈ జాతీయవాద భావనను తన ప్రచారంలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఇది కెనడా ఇక్కడ ఏమి జరగాలో మేమే నిర్ణయిస్తామని కార్నీ ప్రచార ప్రకటనలో పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇది క్రమంగా పదేళ్ల తర్వాత కెనడా రాజకీయాలను మార్చేసింది.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్
వేడి నుంచి ఉపశమనం..ఈ ప్రాంతాల్లో మే 3 వరకు వర్షాలు..
మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Latest Telugu News and National News