Dr Shakil Afridi: యూఎస్-పాక్.. ఓ డాక్టర్.. 14 ఏళ్లుగా తెగని పంచాయితీ!
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:26 AM
అమెరికా-పాకిస్థాన్.. నడుమ ఓ డాక్టర్. 14 ఏళ్లుగా ఈ పంచాయితీ తెగట్లేదు. యూఎస్ ఏం చెప్పినా తలాడించే పాక్.. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అని అంటోంది.

అగ్రరాజ్యం అమెరికా ఏం చెప్పినా తలాడిస్తూ ఉంటుంది పాకిస్థాన్. తమ మాట కాదంటే ఎక్కడ తోక కట్ చేస్తుందోననే భయంతో ఏం చెబితే దానికై సై అంటుంది పాక్. అయితే ఒక విషయంలో మాత్రం యూఎస్ మాటను బేఖాతరు చేస్తోంది. ఆ డాక్టర్‌ను వదిలేయండి అంటూ వైట్‌హౌస్ కోరినా పాక్ మాత్రం మాట వినడం లేదు. అతడు తమ మనిషి అని.. తమకు ఎంతో సాయం చేశాడని.. ప్లీజ్ వదిలేయండి అంటూ అమెరికా రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదు పాక్. మరి.. ఎవరా డాక్టర్? యూఎస్‌కు అతడికి ఉన్న లింక్ ఏంటి? అగ్రరాజ్యం మాటను పాక్ ఎందుకు బేఖాతరు చేస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం..
అమెరికాకు హీరో..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్‌ను గుర్తించడంలో సీఐఏకు సాయం చేశాడు డాక్టర్ షకీల్ అఫ్రిది. 2011 మే 2వ తేదీన అబోటాబాద్ సిటీలోని తన ఇంట్లో అమెరికా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో లాడెన్ హతమయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే డాక్టర్ అఫ్రిదీని పాక్ అరెస్ట్ చేసింది. ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అతడికి ఏకంగా 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. ఆ తర్వాత ఈ శిక్షను 23 సంవత్సరాలకు తగ్గించారు. అయితే లాడెన్‌ను పట్టుకోవడంలో సాయం చేసిన షకీల్‌ను అమెరికా హీరోగా చూస్తోంది. దేశద్రోహిగా భావించడం ఏంటంటూ పాక్‌పై సీరియస్ అవుతోంది.
మరోసారి అప్పీల్!
డాక్టర్ షకీల్ అఫ్రిదీని విడుదల చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు పాక్‌ను కోరింది యూఎస్. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో పాక్ అఖిలపక్ష బృందం తమ దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో డాక్టర్ రిలీజ్ కోసం తాజాగా మరోమారు అప్పీల్ చేసింది అమెరికా. షకీల్‌ను విడుదల చేయాలని యూఎస్ చట్టసభ్యుడు బ్రాడ్ షెర్మన్ కోరారు. మరి.. ఈ విషయంలో పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, పాక్‌కు చెందిన అఫ్రిదీ ఫిజీషియన్‌గా పని చేసేవాడు. లాడెన్ కుటుంబసభ్యుల డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరణ కోసం ఖైబర్‌పఖ్తుంఖ్వాలో సీఐఏ నిర్వహించిన పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో డాక్టర్ కీలకపాత్ర పోషించాడు.
ఇవీ చదవండి:
మాపైనే దర్యాప్తునకు ఆదేశిస్తారా?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి