Ukraine: ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే మాదారి మేము చూసుకుంటా.. యూఎస్ మంత్రి రూబియో
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:20 PM
ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.

పారిస్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఓ ముగింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా ఇక ఎంతోకాలం వేచిచూడలేదని, తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marko Rubio) చెప్పారు. యూరోపియన్, ఉక్రెయిన్ నేతలతో సమావేశానంతరం ఆయన శుక్రవారంనాడు మీడియోతో మాట్లాడుతూ, మా అధ్యక్షుడు ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
Trump China trade war: చైనాను ఒంటరిని చేద్దాం
''యుద్ధానికి ముగింపు పలికే విషయంలో మా అధ్యక్షుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చాలా శక్తియుక్తులు ఉపయోగిస్తున్నారు. సంధి కుదిర్చేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నా ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. ప్రస్తుత సంధి ప్రయత్నాల్లో పురోగతి కనిపించకుంటే ఆయన దీనిని వదిలేసి ముందుడుగు వేస్తారు. ఇక నెలలు, వారాల పాటు ప్రయత్నించడం ఉండదు'' అని రూబియో చెప్పారు.
ఉక్రెయిన్ శాంతి ఒప్పందం త్వరలోనే సాకారం కావచ్చని ట్రంప్ గురువారంనాడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం కూడా చేసుకోనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే చర్చల ప్రయత్నాలు అమెరికా ఆపేసి తన దారి తాను చూసుకుంటుందని రూబియో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..