Home » Ukraine
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్‌ను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్‌ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు పున:ప్రారంభం కాబోతున్న దశలో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. రష్యా తమపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్‌లతో పాటు భిన్న రకాలైన 70 క్షిపణుల్ని ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ ఉద్యక్షుడు జెలెన్‌స్కీతో గురువారంనాడు సమావేశమయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది..
గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి చర్చలు జరిపినప్పటికీ.. యుద్ధం ఆపలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక భేటీపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
తమ భద్రతకు పాశ్చాత్య దేశాలు హామీ ఇస్తే నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అయితే, నాటో సభ్యదేశాలకు ఉన్న రక్షణలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. అమెరికా ప్రతినిధితో చర్చల అనంతరం మీడియాతో ఈ కామెంట్స్ చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్‌ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్‌కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిండర్‌గార్డెన్‌పై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దాడి తాలూకా భీకర దృశ్యాలు ఉన్నాయి. చిన్నారులు భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని అన్నారు.