Share News

America: విదేశీ విద్యార్థులకు మళ్లీ వీసాలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:25 AM

గత నెలలో నిలిపివేసిన విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది...

America: విదేశీ విద్యార్థులకు మళ్లీ వీసాలు

  • ప్రక్రియ పునఃప్రారంభిస్తున్నామన్న అమెరికా

  • సోషల్‌ ఖాతాలను అన్‌లాక్‌ చేయాలని షరతు

వాషింగ్టన్‌, జూన్‌ 19: గత నెలలో నిలిపివేసిన విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. అయితే ప్రభుత్వ పరిశీలన కోసం వారి సోషల్‌ మీడియా ఖాతాలను అన్‌లాక్‌ చేసి ఉంచాలని షరతు విధించింది. ఆ సోషల్‌ మీడియా ఖాతాల్లో అమెరికాకు, తమ ప్రభుత్వానికి, సంస్కృతికి, సంస్థలకు వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు ఉంటే వాటిని కాన్సులర్‌ అధికారులు పరిశీలిస్తారని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.

Updated Date - Jun 20 , 2025 | 03:31 AM