Trump Warns Russia: 50 రోజుల్లోగా యుద్ధం ఆపకపోతే టారిఫ్ శిక్ష
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:59 AM
ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్, జూలై 14: ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 50రోజుల్లోగా యుద్ధం ఆపకపోతే రష్యాపై టారి్‌ఫలు విధించి శిక్షిస్తానన్నారు. ‘‘పుతిన్ విషయంలో నేను చాలా నిరాశచెందాను. అతను మాటమీద నిలబడే వ్యక్తి అనుకున్నాను. అందంగా మాట్లాడతాడు కానీ రాత్రి వేళల్లో ప్రజలపై బాంబులు వేస్తాడు. అది మాకు నచ్చడం లేదు’’ అని చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉక్రెయిన్‌కు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను పంపుతున్నట్లు ట్రంప్ నిర్ధారించారు. అది ఉక్రెయిన్‌కు చాలా అవసరం అయినందువల్ల పంపుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఎన్ని పంపించాలనేదానిపై నిర్ణయం తీసుకోలేదని, ఉక్రెయిన్ రక్షణకు వాటి అవసరం ఉంది కాబట్టి కొన్ని పంపుతున్నామని వెల్లడించారు. తాము పంపే వాటికి ఉక్రెయిన్ వంద శాతం డబ్బు చెల్లిస్తుందని, అది తమ వ్యాపారమని అన్నారు.