Russia: 10లక్షల భారతీయ కార్మికులకు రష్యా ఉపాధి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:55 AM
నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతోన్న రష్యా ఈ ఏడాది ఆఖరు కల్లా పది లక్షల మంది భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించనుంది.

మాస్కో, జూలై 14: నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతోన్న రష్యా ఈ ఏడాది ఆఖరు కల్లా పది లక్షల మంది భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించనుంది. భారీ పరిశ్రమలు, మిలిటరీ కాంప్లెక్స్ ఉన్న యురల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్‌బర్గ్‌లో వీరికి ఉపాధి కల్పిస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా కాన్సులేట్ జనరల్ కూడా ప్రారంభించనున్నారు. పారిశ్రామిక సంస్థల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని యురల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆండ్రీ బెసెడిన్ తెలిపారు. ఇందుకోసం భారత్‌తో పాటు శ్రీలంక, ఉత్తర కొరియాల నుంచి నైపుణ్యం ఉన్న కార్మికులను తీసుకుంటామని చెప్పారు. 2030 నాటికి రష్యాలో 3.1మిలియన్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని అంచనా.