Reham Khan: కొత్త పార్టీ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..
ABN , Publish Date - Jul 16 , 2025 | 07:58 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. ఆయన మాజీ భార్య రెహం ఖాన్ కొత్త పార్టీని ప్రారంభించింది. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) కేవలం రాజకీయ పార్టీ కాదని, ఇది ప్రజా ఉద్యమం అని ఆమె అభివర్ణించింది.

Imran Khan Ex-wife Reham New Party: పీటీఐ వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) రెండేళ్లుగా జైల్లో మగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) పేరిట సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. తమ పార్టీ అన్ని రాజకీయ పార్టీ కంటే ఎక్కువని.. ప్రజా గొంతుకగా మారి పాలకవర్గాన్ని జవాబుదారీగా ఉంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమం నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చిందని అభివర్ణించారు.
జర్నలిస్ట్, రచయిత్రి అయిన రెహమ్ ఖాన్ మాట్లాడుతూ, తాను కొత్తగా పెట్టిన పీఆర్పీ పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని, పాలక వర్గాలను జవాబుదారీగా ఉంచడానికి కట్టుబడి ఉంటుందని నొక్కి చెప్పారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ నుంచే పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పుట్టిందని ఆమె వివరించారు.
'నేను ఇంతకు ముందు ఎప్పుడూ రాజకీయ పదవులను అంగీకరించలేదు. నేను ఒక వ్యక్తి కోసం ఒకసారి ఒక పార్టీలో చేరాను. కానీ నేడు, నేను నా స్వంత షరతులపై నిలబడతాను. ఇది కేవలం ఒక పార్టీ కాదు. రాజకీయాలను సేవగా మార్చడానికి చేస్తున్న ఒక ఉద్యమం' అని కరాచీ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో రెహమ్ ఖాన్ వెల్లడించారు. కష్టకాలంలో కరాచీ ప్రెస్ క్లబ్ అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. అధికారం తమ పార్టీ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఎవరి మద్ధతూ లేకుండానే పార్టీ ఏర్పాటు చేశానని.. త్వరలోనే మ్యానిఫెస్టో ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఇవి కూాడా చదవండి..
లైవ్‌లో ఉండగానే యాంకర్ పరుగో పరుగు
ప్రణాళిక ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి.. షాంఘై సమావేశంలో జైశంకర్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి