Share News

Modi in Maldives: మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:50 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లో రెండు రోజుల సుదీర్ఘ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, ఈరోజు మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు.

Modi in Maldives: మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు
Modi in Maldives

రెండు రోజుల యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన ముగించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శుక్రవారం మాల్దీవుల రాజధాని మాలేలో (Modi in Maldives) అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి వంటి ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే నగరం భారత జాతీయ పతాకాలు, రంగురంగుల బ్యానర్లు, భారీ పోస్టర్లతో ఆకర్షణీయంగా మారింది.


ఉత్సాహభరితంగా స్వాగతం

మోదీ రాక సందర్భంగా మాలేలోని రిపబ్లిక్ స్క్వేర్, ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే మార్గాలు అందంగా సిద్ధం చేశారు. భారత సంతతికి చెందిన ఎందరో విమానాశ్రయం సమీపంలో రహదారుల వెంబడి త్రివర్ణ పతాకాలను ఊపుతూ, నినాదాలతో మోదీకి ఉత్సాహభరితంగా స్వాగతం పలికారు. ఈ దృశ్యం భారత్-మాల్దీవుల స్నేహబంధానికి, రాజకీయ, ప్రజా స్థాయి సౌహార్దానికి ప్రతీకగా నిలిచింది.


చారిత్రాత్మక సందర్భం

అధ్యక్షుడు ముయిజ్జు ఆహ్వానం మేరకు, జూలై 26న మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఏ విదేశీ దేశాధినేత, ప్రభుత్వాధినేత కానీ మాల్దీవులను సందర్శించడం ఇదే మొదటిసారి. మోదీ ప్రధానమంత్రిగా మాల్దీవులకు ఇది మూడో పర్యటన. ఈ సందర్భంగా భారత్-మాల్దీవుల మధ్య 60 ఏళ్ల దౌత్య సంబంధాల చరిత్ర కొనసాగుతోంది.


రాజకీయ, ఆర్థిక సహకారంపై చర్చలు

జులై 25-26 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో మోదీ, అధ్యక్షుడు ముయిజ్జుతో సమగ్ర చర్చలు జరపనున్నారు. భారత్ సహకారంతో మాల్దీవుల్లో నిర్మితమవుతున్న అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ పర్యటన భారత్-మాల్దీవుల సంబంధాలకు కీలకమైనదిగా భావిస్తున్నారు. గతంలో ముయిజ్జు పాలనలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత హాట్ టాపిక్‎గా మారిన నేపథ్యంలో ఈ సందర్శన వారికి కొత్త అవకాశాలను అందించనుంది.


హిందూ మహాసముద్రంలో శాంతి, స్థిరత్వం

తన పర్యటనకు ముందు, మోదీ ఒక ప్రకటనలో ఇలా తెలిపారు. మాల్దీవులతో మన దౌత్య సంబంధాలు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, అధ్యక్షుడు ముయిజ్జు, ఇతర రాజకీయ నాయకులతో సమావేశమై, సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యం కోసం మా ఉమ్మడి దృష్టిని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సంపద, స్థిరత్వం కోసం మా సహకారాన్ని మరింత పెచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈ పర్యటన భారత్-మాల్దీవుల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 12:07 PM