Hyderabad: భార్యను హత్యచేసిన భర్త.. పుట్టినరోజు వేడుకలో అందరూ చూస్తుండగానే దాడి
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:34 AM
ట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర రక్త స్రావంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీకాలనీ గురువారం రాత్రి జరిగింది.

- అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
హైదరాబాద్: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర రక్త స్రావంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలోని బీసీకాలనీ గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ సూర్యాపేటకు వలస వచ్చి అక్కడే ఉంటూ అదే ప్రాంతానికి చెందిన కళమ్మను, ఆ తర్వాత ఆమె సొంత చెల్లెలు సమ్మక్కను పెళ్లి చేసుకున్నాడు. శ్రీనివాస్ సూర్యాపేటలో ఇనుప సామాన్ల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సమ్మక్క(45), శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇటీవల మరోసారి గొడవ జరుగడంతో కుల సంఘాల మధ్య పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. దాంతో 15 రోజుల క్రితం శ్రీనివాస్‌ను వదిలేసి సమ్మక్క అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బీసీ కాలనీకి వచ్చి అద్దెకు ఉంటోంది.
అయితే, గురువారం రాత్రి అదే కాలనీలో ఉంటున్న సమ్మక్క బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకకు హాజరైంది. తనను వదిలేసి వచ్చిందన్న కోపంతో రగిలిపోయిన శ్రీనివాస్ అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చి పుట్టిన రోజు వేడుక జరుగుతున్న బంధువుల ఇంటికెళ్లాడు. కేక్ కట్ చేస్తున్న సమయంలో అందరూ చూస్తున్న సమయంలో శ్రీనివాస్.. సమ్మక్కను ఎడమ భుజంపై కత్తితో రెండుసార్లు పొడిచాడు.
దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం శ్రీనివాస్ కత్తిని తీసుకుని బైక్‌పై పారిపోయాడు. ఎల్‌బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు మాధవరావు, కరుణాకర్‌రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News