Airlines: అదృశ్యమైన విమానం.. 50 ప్రయాణికులతో వెళ్తుండగా..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:54 AM
రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది.

రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. చైనా బోర్డర్ సమీపంలో అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సడన్‌గా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానం అదృశ్యమవడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. విమానం ఎక్కడ ఉంది, ఇలా జరగడానికి వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్
రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి