kyiv:కీవ్‌పై రష్యా దాడి.. తొమ్మిది మంది మృతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 02:23 PM
kyiv: ఉక్రెయిన్‌పై భారీ క్షిపణులతో రష్యా మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కీవ్, ఏప్రిల్ 24: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఆ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ మిసైల్‌తో దాడి చేసింది. ఈ దాడిలో తొమ్మిది మంది మరణించారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత మూడేళ్లుగా జరుగుతోన్న ఈ యద్ధంలో రాజధాని కీవ్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి అని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ స్పష్టం చేసింది. అయితే ఈ దాడిలో గాయపడిన వారిలో 42 మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారని స్పష్టం చేసింది.
ఈ దాడి కారణంగా ఐదు జిల్లాలు దెబ్బతిన్నాయని.. అలాగే పలు భవనాల్లో మంటలు చెలరేగాయని.. వాటిని వెంటనే ఆర్పివేసినట్లు చెప్పారు. ఈ దాడిలో నివాస భవనాలు సైతం దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే పలు భవనాలు నెలమట్టం కావడంతో.. ఆ యా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది. ఏప్రిల్ ప్రారంభంలో కీవ్ చివరిసారిగా క్షిపణుల దాడికి గురైందని.. ఆ సమయంలో ముగ్గురు గాయపడ్డారని గుర్తు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
India Vs Pakistan: కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్
Rahul Gandhi: పర్యటన రద్దు చేసుకొన్న రాహుల్.. ఎందుకంటే..
Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు
Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
For National news And Telugu News