వాళ్లు రెండుసార్లు ట్రంప్‌ను చంపేందుకు ప్రయత్నించారు: నెతన్యాహు
ABN , Publish Date - Jun 16 , 2025 | 07:52 AM
Netanyahu Iran Trump: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ను చంపేందుకు రెండుసార్లు కుట్రపన్నారని ఆరోపించారు.

Netanyahu accuses Iran of Trump assassination: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ.. ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా రెండు సార్లు ట్రంప్‌ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని.. ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అందుకే ట్రంప్‌ను టార్గెట్ చేశారు..
ఆదివారం ఫాక్స్ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఆయన హత్యకు రెండుసార్లు విఫల ప్రయత్నాలు చేశారని అన్నారు. ట్రంప్‌ను తమ అణు ఆశయాలకు ప్రభుత్వ ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
మా పాత్ర లేదు: ఇరాన్
2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని.. అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే, నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా, ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు.
కాక రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు
ఇరాన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ, ఒక ప్రధాన దేశాధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అదీ, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
ట్రంప్ స్పందన
ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కన్నప్ప సినిమాకు షాక్.. బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాటం సక్సెస్..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
For International And Telugu News