Share News

Viral Video: ప్రధాని మోదీ, ట్రంప్‌ని మెచ్చుకున్న మహిళా ప్రధాని.. వారిపై విమర్శలు..

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:35 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో పాల్గొన్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ప్రధాని మోదీ, ట్రంప్‌ని మెచ్చుకున్న మహిళా ప్రధాని.. వారిపై విమర్శలు..
Giorgia Meloni

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలను కపటవాదులని ఎద్దేవా చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో పాల్గొన్న క్రమంలో ఆమె వెల్లడించారు. అంతేకాదు భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, తనలాంటి మితవాద నేతల ఆవిర్భావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలంతా కలత చెందారని పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


వారిని గొప్ప నాయకులని..

90వ దశకంలో బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ గ్లోబల్ లెఫ్టిస్ట్ నెట్‌వర్క్‌ను సృష్టించినప్పుడు, వారు గొప్ప నాయకులని పిలిచారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ట్రంప్, మెలోనీ, మోదీ మాట్లాడినప్పుడు, ప్రజాస్వామ్యానికి ముప్పు అని పిలుస్తారని వ్యాఖ్యానించారు. ఇక్కడే వామపక్షాల ద్వంద్వ విధానం అర్థమవుతుందని మెలోని అన్నారు. మితవాద నాయకుల ఎదుగుదల నేపథ్యంలో వామపక్షాలు విసుగు చెందుతున్నాయని ఆరోపించారు. వారు మనపై ఎన్ని బురద చల్లినా, పౌరులు తమకు ఓటు వేస్తున్నారని ఇటలీ ప్రధాని అన్నారు. ఎందుకంటే మనం స్వేచ్ఛను కాపాడుకుంటాం. మేము మా దేశాలను ప్రేమిస్తున్నామని మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు.


అమాయకులు కాదు..

అంతేకాదు ప్రజలు వామపక్షాలు అనుకునేంత అమాయకులు కాదన్నారు. మాకు సురక్షితమైన సరిహద్దులు కావాలి, వ్యాపారాలను, పౌరులను వామపక్ష పిచ్చి నుంచి రక్షిస్తామన్నారు. మేము కుటుంబాన్ని, జీవితాన్ని రక్షించుకుంటామని, మా విశ్వాసాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుంటామని వెల్లడించారు. ట్రంప్ విజయంతో వామపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయన్నారు. ఈ క్రమంలో వారి చికాకు కూడా హిస్టరీగా మారిందన్నారు. ఎందుకంటే సంప్రదాయవాదులు గెలుపొందడం మాత్రమే కాదు, ఇప్పుడు సంప్రదాయవాదులు ప్రపంచవ్యాప్తంగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇటలీ మహిళా ప్రధాని ఈ నేతలను మెచ్చుకుంటూ ప్రసంగం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 23 , 2025 | 04:36 PM