Airstrikes: 24 గంటల్లో 59 మంది మృతి.. పట్టించుకునేవారే లేరా..
ABN , Publish Date - Jan 05 , 2025 | 08:10 AM
ఇజ్రాయెల్ మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గత 24 గంటల్లోనే 59 మంది మరణించారు. అయితే ఖతార్‌లో కాల్పుల విరమణ చర్చల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్న క్రమంంలోనే ఈ దాడి జరిగింది.

ఇజ్రాయెల్ (Israel) నిరంతరం గాజా(Gaza)లోని హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక చిన్నారి సహా దాదాపు 15 మంది మరణించారు. ఈ విషయాన్ని అక్కడి ఆసుపత్రి ఉద్యోగులు తెలిపారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 59 మంది మరణించారని వెల్లడించారు. ఖతార్‌లో కాల్పుల విరమణ చర్చల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది.
ఖాన్ యూనిస్ నగరంలో వైమానిక దాడి
దాడి తర్వాత దృశ్యాన్ని వివరించిన అధికారులు, ఓ చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర ఏడుస్తున్నాడని తెలిపారు. మరోవైపు ప్లాస్టిక్‌తో చుట్టిన మృతదేహాల పక్కన ఓ మహిళ పడి ఏడుస్తుందని వెల్లడించారు. ఇలా అనేక విషాదకర దృశ్యాలు కనిపించాయని, తమను పట్టించుకునే వారే లేరని వెల్లడించారు. నాసర్ ఆసుపత్రి సిబ్బంది ప్రకారం ఖాన్ యూనిస్ నగరంలో మూడు వైమానిక దాడులు జరిగాయి. ఆ క్రమంలో ఒక కారు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వీధిలో చాలా మంది మరణించారు.
15 నెలల పోరాటం తర్వాత
గాజా నగరంలోని సరయా కాంపౌండ్ వెనుక ఉన్న నివాస ప్రాంతాన్ని వైమానిక దాడులు ధ్వంసం చేశాయని, కనీసం ఐదుగురు మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది. గత 24 గంటల్లో జరిగిన దాడుల్లో కనీసం 59 మంది మరణించారని, 270 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 15 నెలల పోరాటం తర్వాత కాల్పుల విరమణ కోసం ఖతార్ రాజధాని దోహాలో జరుగుతున్న పరోక్ష చర్చలపై తక్షణ ప్రకటన లేదు. చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయని, ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని హమాస్ ఉగ్రవాద సంస్థ శుక్రవారం తెలిపింది.
సెంట్రల్ గాజాలో జరిగిన దాడుల్లో
గురువారం రాత్రి, శుక్రవారం గాజాలో జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 42 మంది మరణించారు. సెంట్రల్ గాజాలోని నుస్రత్, జావిదా, మఘాజీ, దీర్ అల్-బలాలో జరిగిన దాడుల్లో డజనుకు పైగా మహిళలు, పిల్లలు మరణించారని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఒకరోజు ముందు ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ప్రాంతాల్లో డజన్ల కొద్దీ ప్రజలు చనిపోయారు.
అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు దాడి చేయడంతో 15 నెలల యుద్ధంలో US నేతృత్వంలోని చర్చలు పదేపదే నిలిచిపోయాయి. మిలిటెంట్లు దాదాపు 1,200 మందిని హతమార్చారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు, దాదాపు 250 మందిని అపహరించారు. గాజాలో దాదాపు 100 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో కనీసం మూడింట ఒకవంతు మంది చనిపోయారని భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News