Share News

Pakistani Celebrities: పాక్‌ సెలబ్రిటీలకు షాక్.. భారత్ తాజా నిర్ణయంతో..

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:19 AM

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాాజాాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది..

Pakistani Celebrities: పాక్‌ సెలబ్రిటీలకు షాక్.. భారత్ తాజా నిర్ణయంతో..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సింధూ జలాలను నిలిపేయడం, సార్క్ వీసాలను రద్దు చేయడం, పాకిస్తాన్ నుండి దిగుమతులను నిషేధించడం, అటారీ-వాఘా సరిహద్దును మూసేయడం.. వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా, పాకిస్తాన్ సెలబ్రిటీలకు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.


పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన సెలబ్రిటీలు, యూట్యూబ్‌, ఇన్‌స్టా (YouTube, Insta) తదితర ఖాతాలపై మరోసారి నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌కు సంబంధించిన సెలబ్రిటీలతో పాటూ అన్ని సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆంక్షలను ఎత్తేయడంతో మళ్లీ ఆ చానల్స్ వీడియోలన్నీ కనిపించాయి. అయితే దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు సంబంధించిన అన్ని చానల్స్‌ను నిషేధించాలనే డిమాండ్లు పెరిగిపోవడంతో తాజాగా, భారత ప్రభుత్వం.. మళ్లీ పాకిస్తాన్ సెలబ్రిటీల ఖాతాలపై నిషేధం (Ban on Pakistani celebrity accounts) విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


వీరి చానల్స్ అన్నీ బ్లాక్..

భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌కు సంబంధించిన అన్ని రకాల చానల్స్‌పై వేటు పడింది. ఈ క్రమంలో ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్ చానల్స్‌ కూడా భారత్‌లో క్లోజ్ అయ్యాయి. వాటిలో పాకిస్తాన్‌కు సంబంధించిన మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, బాసిత్ అలీ తదితర ప్రముఖులకు సంబంధించిన చానల్స్ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్‌లోని పలువురు సినీ నటులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు కూడా ఇండియాలో బ్లాక్ అయ్యాయి.

Updated Date - Jul 03 , 2025 | 10:20 AM