Imran Khan: మోదీని తక్కువ అంచనా వేయద్దు.. అలా చేస్తే యుద్ధం తప్పదు..
ABN , Publish Date - May 14 , 2025 | 03:41 PM
Modi Imran Khan Conflict: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్-పాక్ ఉద్రిక్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క జైల్లో ఇమ్రాన్ మరణించారనే ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో ఇమ్రాన్ నుంచి ఈ సందేశం వచ్చింది. ఇంతకీ, ఏమన్నారంటే..

India Pakistan Tensions: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ భారత్-పాక్ ఉద్రిక్తతలపై భయాందోళనలు వ్యక్తం చేశారు. భారత్ కాల్పుల విరమణను అంగీకరించినప్పటికీ.. కచ్చితంగా త్వరలో పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జైళ్లో ఎవరో తమ పార్టీ అధ్యక్షుడిని హతమార్చారని పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అతడ్ని కలిసేందుకు జైలుకు వెళ్లారు. సుమారు 8 వారాల తర్వాత జైలు పరిపాలన శాఖ వారికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలోనే భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ పాక్‌ను ద్వేషిస్తున్నారు..
పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, ఇమ్రాన్‌ను కలిసిన తర్వాత ఆయన సోదరి అలీమా మీడియాతో మాట్లాడుతూ, 'భారతదేశం నుంచి ఇంకా దాడి జరగవచ్చని మా సోదరుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను ద్వేషిస్తున్నారని.. కోపంతో మళ్ళీ దాడి చేయించే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో 60% మైండ్ గేమ్ అని.. కచ్చితంగా భారత ప్రభుత్వం మళ్ళీ దాడి చేస్తుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.' ఇంకా, ఇమ్రాన్ ఖాన్ తరపున సైనిక కోర్టులో జరుగుతున్న కేసుల గురించి కూడా మాట్లాడారు.
ఇమ్రాన్ ఖాన్ మే 9, 2023 నుండి జైలులో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో, అతడి మద్ధతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు, సైనిక స్థావరాలపై దాడులు కూడా చేశారు. ఈ స్థావరాలపై దాడి చేసిన వారిపై సైనిక కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. అయితే, ఈ అంశాలపై నిరసన తెలపడానికి తన మద్దతుదారులు వీధుల్లోకి రావాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు. కాగా, గతవారం పాకిస్థాన్ సుప్రీంకోర్టు సాధారణ పౌరులపై సైనిక కోర్టులలో కేసులు నమోదు చేసే అధికారం సైన్యానికి ఇచ్చింది. అప్పటి నుంచి ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కు మరింత అధికారం లభించిందని చర్చ నడుస్తోంది. కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటారనే ఊహాగానాలు పెరిగాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపి రాజకీయంగా బలహీనపరిచినందుకు ప్రతిఫలంగానే అసిం మునీర్‌కు విస్తృత అధికారాలు లభించాయనే ఆరోపణలున్నాయి.
Read Also: Burkina Faso: బుర్కినాఫాసోలో జిహాదీ దాడి..100 మంది మృతి
US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య భారీ ఆయుధ ఒప్పందం
Operation Bunyanum Marsoos: ఇస్లాం నమ్మకాలకు అనుగుణంగానే పాక్ ఆపరేషన్‌కు ఆపేరు..