Share News

Trumph-Zelensky: రెచ్చిపోవద్దు.. జెలెన్‌స్కీని ముందే హెచ్చరించిన యూఎస్ సెనెటర్

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:20 PM

అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి.

Trumph-Zelensky: రెచ్చిపోవద్దు.. జెలెన్‌స్కీని ముందే హెచ్చరించిన యూఎస్ సెనెటర్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్టు ట్రంప్ నడుస్తు్న్నారని డెమోక్రాట్‌లు ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్‌తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య సమర్ధిస్తోంది. ట్రంప్‌ ఎంతో కూల్‌గా పెద్దమనిషి తరహాలో వ్యవహరించారని రష్యా నేతలు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ కార్యాలయంలోకి అడుగుపెట్టే ముందే జెలెన్‌స్కీని జాగ్రత్తగా మాట్లాడమని యూఎస్ సెనెటర్ హెచ్చరించిన వైనం వెలుగులోకి వచ్చింది.

Israel: ఇజ్రాయెల్‌ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..


ట్రంప్‌తో సమావేశానినికి కొద్ది గంటలకు ముందు జెలెన్‌స్కీకి రిపబ్లికన్ సెనెటర్ లిండ్స్ గ్రాహం ఒక సూచన చేశారు. ''ఎలాంటి వాదోపవాదాలకు దిగవద్దు, నిగ్రహం పాటించాలి'' అని సూచించారు. న్యూయార్క్ టైమ్స్‌తో ఈ విషయం లిండ్స్ గ్రాహం తెలియజేశారు. సెక్యూరిటీ ఏర్పాట్లపై ఎలాంటి వాదనకు దిగవద్దని జెలెన్‌స్కీకి తాను హితవు చెప్పానని అన్నారు.


ట్రంప్‌తో సమావేశం ప్రారంభం కాగానే, ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలు, అమెరికా మిలటరీ ఎయిడ్‌ అనిశ్చితిపై జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేకుండా పోయిందని ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్సే మాట్లాడటంతో జర్నలిస్టుల ముందే ఊహించని విధంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉభయుల మధ్య మినరల్స్ షేరింగ్ డీల్‌ కుదురుతుందని అందరూ అంచనాలతో ఉన్న తరుణంలో జెలెన్‌స్కీ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.


మాస్కోతో శాంతి ఒప్పందంపై సంప్రదింపులు జరపమని ట్రంప్ పదేపదే సమావేశంలో జెలెన్‌స్కీకి సూచించారు. జెలెన్‌స్కీ మిలటరీ స్టయిల్ దుస్తులతో అడుగుపెట్టినప్పుడు కూడా ట్రంప్ ఆయన డ్రెస్‌సెన్స్‌ను అభినందించారు. సెనెటర్ గ్రాహం తొలుత తను తాను మధ్యవర్తిగా చెప్పుకున్నప్పటికీ ఆ తర్వాత జెలెన్‌స్కీ రాజీనామా చేసి వేరొకరిని పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రిపబ్లికన్ నేతలు కూడా ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. ట్రంప్‌ పట్ల ఎలాంటి గౌరవం ప్రదర్శించలేదంటూ జెలెన్‌స్కీని తప్పుపట్టారు. జెలెన్‌స్కీ సైతం తన ధిక్కార ప్రదర్శనను ఒక ఇంటర్వ్యూలో సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సంభాషణలు వేడెక్కుతున్న విషయాన్ని తాను గుర్తించానని, కానీ అనివార్య పరిస్థితుల్లోనూ తాను అలా వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు.


Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 02 , 2025 | 07:26 PM