Canada: ఖలిస్థానీలు తీవ్రవాదులే
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:00 AM
తమ భూభాగం నుంచి ఖలిస్థానీ తీవ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కెనడాలోని అత్యున్నతస్థాయి నిఘా సంస్థ తొలిసారి అంగీకరించింది..

ఒట్టావా, జూన్ 19: తమ భూభాగం నుంచి ఖలిస్థానీ తీవ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కెనడాలోని అత్యున్నతస్థాయి నిఘా సంస్థ తొలిసారి అంగీకరించింది. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు, హింసాత్మక కార్యకలాపాలకు కుట్ర పన్నేందుకు, నిధులు సమీకరించేందుకు ఖలిస్థానీలు కెనడా భూభాగాన్ని వాడుకుంటున్నారని భారతదేశం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇదే విషయాన్ని తాజాగా కెనడా పార్లమెంటుకు సమర్పించిన వార్షిక నివేదికలో సీఎ్‌సఐఎ్‌స(కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్) నిర్ధారించింది. ‘భారత్‌లో హింసాత్మక చర్యలకు కుట్రలు పన్నేందుకు, నిధులు సమీకరించేందుకు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ఖలిస్థానీ తీవ్రవాదులు కెనడా భూభాగాన్ని వాడుకుంటూనే ఉన్నారు’ అని ఆ నివేదికలో సీఎ్‌సఐఎస్ స్పష్టం చేసింది.