Share News

Beyond US: భారత్ పక్క చూపులు, యూకే, ఫ్రాన్స్ వైపు మొగ్గు!

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:51 PM

అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌తో కలిసి..

Beyond US: భారత్ పక్క చూపులు, యూకే, ఫ్రాన్స్ వైపు మొగ్గు!
Fighter Jet Engines

ఇంటర్నెట్ డెస్క్: భారత్ తన యుద్ధ విమానాల కోసం ఇంజిన్లను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్(అమెరికా)ను పక్కనపెట్టి ముందుకు సాగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం యునైటెడ్ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌తో కలిసి యుద్ధ విమాన ఇంజిన్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని న్యూఢిల్లీ అన్వేషిస్తున్నట్లు సమాచారం.

భారతదేశ తదుపరి తరం(నెక్స్ట్ జనరేషన్) తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) Mk-2 ఫైటర్ జెట్ కోసం అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (GE)ఇంజిన్ల సరఫరాలో జాప్యం నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, భారతదేశం తన దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తోంది.

Tejas.gif


భారతదేశ ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం యూకే లేదా ఫ్రాన్స్?

ఉమ్మడి ఫైటర్ జెట్ ఇంజిన్ల ఉత్పత్తి కోసం భారతదేశం రోల్స్ రాయిస్, ఇంకా సఫ్రాన్ మధ్య ఉన్న వెసులుబాట్లను పరిశీలిస్తోంది. ఈ రెండు కంపెనీలు డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బెంగళూరుకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ల్యాబ్‌తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. మేధో సంపత్తి హక్కులను, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని (ToT)పంచుకోవడానికి కూడా వారు అంగీకరించారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇది.. భారత రక్షణ రంగానికి మరింత ఊపునిచ్చే అంశంగా చెబుతున్నారు.

rolls-royce-fighter-jet-eng.gif


ఇందులో ఏం డౌట్ లేదు.. ఐదేళ్ళు నేనే సీఎం..

8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:30 PM