Russian Airlines: కూలిన రష్యా విమానం..
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:05 PM
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.

అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. రష్యాలోని అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం టిండా నగరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అంగారా ఎయిర్‌లైన్స్ ఏఎన్-24 విమానం.. చైనా బోర్డర్ సమీపంలోకి వెళ్లగానే ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం అదృశ్యమవగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసి పడుతున్నాయి.
ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. రెండోసారి ప్రయత్నించే క్రమంలో రాడార్ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం 49 మంది ఉండగా.. వారిలో 5 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్
రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి