World Thyroid Day 2025: పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా థైరాయిడ్ ఎందుకొస్తుంది?
ABN , Publish Date - May 26 , 2025 | 01:59 PM
Thyroid Disease In Women Vs Men: థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఎవరికైనా రావచ్చు. కానీ స్త్రీలే అధికంగా ఈ సమస్య బారిన పడుతుంటారు. దీని కారణంగా అధిక బరువు, ప్రెగ్నెన్సీ ఆలస్యం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు సంభవించి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ సమస్యకు వీలైనంత త్వరగా చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే, పురుషులతో పోలిస్తే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?

Why Women Get Thyroid More Than Men: ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ రుగ్మతల గురించి అవగాహన పెంచడం ఈ దినోత్సవ లక్ష్యం. స్త్రీ పురుషుల మధ్య శరీర నిర్మాణం, హార్మోన్లలో చాలా వ్యత్యాసాల ఉంటాయి. ఈ కారణంగానే పురుషుల కంటే స్త్రీలే అధికగా థైరాయిడ్ సమస్యలకు ప్రభావితమవుతారు. కొన్ని సర్వేల ప్రకారం, ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒకసారైనా థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది.
మహిళల్లోనే థైరాయిడ్ ఎందుకు ఎక్కువ?
పురుషుల కంటే మహిళలకు థైరాయిడ్ ప్రమాదం దాదాపు 10 రెట్లు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేగాక, థైరాయిడ్ గ్రంథి మహిళల ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ ఎక్కువగా ఉండటానికి కొన్ని కారణాలు కింద ఇవ్వబడ్డాయి.
1.ఆటో ఇమ్యూన్ వ్యాధులు
స్త్రీలలో ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది హషిమోటోస్ థైరాయిడిటిస్ (హైపోథైరాయిడిజానికి దారితీస్తుంది), గ్రేవ్స్ వ్యాధి (హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది) వంటి థైరాయిడ్ వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారకంగా పనిచేస్తుంది. థైరాయిడ్ రుగ్మతలు స్వభావరీత్యా స్వయం ప్రతిరక్షకమైనవి. అంటే తెల్ల రక్త కణాలు మన రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన భాగమని తెలిసిందే. శరీరంలోని వ్యాధికారకాలను నశింపజేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ, థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో తెల్లరక్తకణాలు తప్పుగా పనిచేస్తాయి. కాపాడాల్సిన థైరాయిడ్ గ్రంథిపైనే దాడి చేస్తాయి. అందువల్లే తరచుగా ఆటో ఇమ్యూనిటీకి కారణమయ్యే క్రోమోజోమ్‌లపై (జన్యు గుర్తులు) స్త్రీలలో దెబ్బతింటాయి. ఈ జన్యు అసమానతలే స్త్రీలలో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ రుగ్మతలు అభివృద్ధి చెందే అవకాశాలను పెంచుతాయి.
2.హార్మోన్ల పాత్ర
స్త్రీ పురుషుల మధ్య హార్మోన్ల నిర్మాణం, దాని విధులలో గణనీయమైన వ్యత్యాసం ఉంటుందని మనందరికీ తెలుసు. స్త్రీ శరీరం ఎక్కువగా స్త్రీ లైంగిక హార్మోన్లు అంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ద్వారా నియంత్రించబడుతుంది లేదా ప్రభావితమవుతుంది. ఈ రెండు హార్మోన్లు థైరాయిడ్ పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయలేని స్థితికి వస్తుంది. ఫలితంగా థైరాయిడ్ రుగ్మతలు సంభవిస్తాయి. ఋతు చక్రం, గర్భం సమయంలో హార్మోన్లలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధికి మద్దతుగా తల్లి శరీరం ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మహిళల్లో థైరాయిడ్ రుగ్మతల వచ్చే అవకాశాలను ఇంకా పెంచుతుంది. అదేవిధంగా బిడ్డను ప్రసవించిన తర్వాత స్త్రీలలో థైరాయిడ్ గ్రంథిలో వాపు రావచ్చు. దీనినే తరచుగా 'ప్రసవానంతర థైరాయిడిటిస్' అని పిలుస్తారు. ఇదే కాక పెరి-మెనోపాజల్ దశలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం, బరువు పెరగడం వల్ల మహిళలు సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజంతో బాధపడవచ్చు.
3.జన్యుపరమైన కారకాలు
స్త్రీల క్రోమోజోమ్ కూర్పు 46, XX అయితే పురుషులకు 46, XY ఉంటాయి. థైరాయిడ్ వ్యాధులకు కారణమైన జన్యువులు X క్రోమోజోమ్‌పై ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్త్రీలకు రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి కాబట్టి పురుషులతో పోలిస్తే థైరాయిడ్ రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..