Heart attack symptoms: మీ చేతులు, కాళ్ళలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్ ముప్పు..!
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:20 AM
Early Indicators of a Heart Attack: గుండెపోటు ప్రారంభ సంకేతాలు సాధారణంగా అంత త్వరగా బయటపడవు. కానీ, మీరు నిశితంగా గమనిస్తే మాత్రం శరీరంలో కలిగే మార్పులు గుర్తించవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. చేతులు, కాళ్ళలో ఈ 5 లక్షణాలు కనిపించినా హార్ట్ ఎటాక్ ముప్పు ఉన్నట్టే..

How Heart Problems Show Up in Hands and Legs: ఛాతీలో నొప్పి వస్తేనే హార్ట్ అటాక్ వచ్చినట్టు! అని మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. అయితే, ప్రతి హార్ట్ అటాక్ కూడా ఇదే రూపంలో రాదని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. నిజానికి, గుండెపోటు వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపించవని భావిస్తాం. కానీ, ఈ నిశ్శబ్ద సంకేతాలు మనల్ని హెచ్చరిస్తాయి. చేతులు, కాళ్లు వంటి శరీర భాగాల్లో కొన్ని చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే ప్రాణాంతక హార్ట్ అటాక్ ప్రమాదాన్ని ముందే అరికట్టవచ్చు.
గుండెకు రక్త ప్రవాహం అందడంలో లోపాలు ఏర్పడితే ఏర్పడే పరిస్థితే గుండెపోటు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజల మరణాలకు గుండె జబ్బులే కారణం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2019లో 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణించారని అంచనా. వీరిలో 85% మంది గుండెపోటు, స్ట్రోక్ కారణంగా మరణించారు.
చేతులు, కాళ్ళలో చలి లేదా చెమట
మీ చేతులు, కాళ్ళు చల్లబడిపోతే రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు. అప్పుడు గుండె పనితీరు కూడా దెబ్బతింటుంది. హృదయం రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు ముఖ్యమైన అవయవాలకు పనిచేసేందుకు మద్ధతు దొరకదు. అలాంటప్పుడు చేతులు, కాళ్ళను నుండి రక్తం ఇతర భాగాలకు మళ్లించబడుతుంది. దీనివల్ల చేతులు, కాళ్ళు చల్లగా చెమటతో నిండి ఉంటాయి.
చేతులు, కాళ్ళలో వాపు
చేతులు, కాళ్ళలో వాపు రావడాన్ని 'ఎడెమా' అని కూడా పిలుస్తారు. ఇది గుండె వైఫల్యానికి సంకేతం కావచ్చు. గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గినప్పుడు చేతులు, కాళ్ళలో ద్రవాలు పేరుకుపోతాయి. ఇది ముఖ్యంగా పాదాలలో వాపుకు దారితీస్తుంది.
తిమ్మిరి లేదా జలదరింపు
గుండె ధమనులు మూసుకుపోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం సరిగా ఉండదు. చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా సూదులతో గుచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇది సూక్ష్మంగానే ఉండవచ్చు. అయితే, ఈ పరిస్థితే నిరంతరంగా ఉంటే సంబంధిత నరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిందని అర్థం చేసుకోవాలి.
నీలం లేదా ఊదా రంగు
చేతులు, కాళ్ళు నీలం లేదా ఊదా రంగులోకి మారితే ఆయా భాగాల్లో మీ రక్తం తగినంత ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం లేదనేందుకు సూచిక. గుండె పనితీరు తగ్గడం లేదా ధమనులు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
ఎడమ చేతికి నొప్పి
గుండెపోటుకు ఇది ప్రధాన సంకేతం. ముఖ్యంగా ఎడమ చేయి, భుజం లేదా చేతిలో నొప్పిని అనుభవిస్తారు. గుండె, చేతులలోని నరాలు ఒకే రక్త ప్రసరణ మార్గాలను పంచుకుంటాయి. అందువల్ల ఈ భాగాల్లో అసౌకర్యం కలిగి హార్ట్ ఎటాక్ రావచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
వయసు పెరిగే కొద్దీ పొట్ట, నడుముపై కొవ్వు పేరుకుపోవడానికి కారణాలు.. పరిష్కారాలు..
నేరేడు పండ్లను ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్..!