Jamun Seed Powder: ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడి తీసుకుంటే.. ఈ 5 సమస్యలు దూరం..!
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:37 PM
Jamun Seed Powder Health Benefits: నేరేడు పండు ఆరోగ్యప్రదాయిని అని తెలిసిందే. అలాగే దీని విత్తనాల్లోనూ అద్భుత పోషకాలున్నాయి. నేరేడు గింజల పొడిని ఖాళీ కడుపుతో తీసుకున్నారంటే ఈ 5 అద్బుత సమస్యలు మీ దరిచేరవు.

Benefits of Jamun Seed Powder On Empty Stomach: భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండ్లలో నేరేడు కూడా ఒకటి. ఊదా రంగుతో, తీపి-వగరు కలగలిసిన ఈ చిన్ని పండుతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీన్ని తినగానే సూపర్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలగడం ఖాయం. చాలామంది రుచిగా ఉంటుందని చిటికెడు ఉప్పు జోడించి కూడా నేరేడు తినేస్తుంటారు. వేసవి పూర్తయ్యే సమయంలో వచ్చే ఈ కాలానుగుణ పండు విత్తనాల్లోనూ ఎన్నో అద్భుతమైన పోషకాలున్నాయి. నేరేడు గింజలను పొడిచేసి తీసుకుంటే కలిగే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మొదలుకుని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వరకూ ఎన్నో ఉపయోగాలున్నాయి. ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడిని తీసుకుంటే కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
ఖాళీ కడుపుతో నేరేడు గింజల పొడిని తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు:
1.రక్తంలో చక్కెర స్థాయి
రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి నేరేడు విత్తనాల పొడి చాలా మేలు చేస్తుంది. జాంబోలిన్, ఆల్కలాయిడ్స్ అనే పదార్థాలు ఇందులో ఉండటమే అందుకు కారణం. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడానికి సాయపడతాయి. గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక అధ్యయనంలో నేరేడు గింజల్లో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని కూడా రుజువైంది.
2. జీర్ణక్రియ
జీర్ణ సమస్యలను ఎదుర్కొనే వారికి నేరేడు దివ్యౌషధం. ఆస్ట్రింజెంట్, కార్మినేటివ్ లక్షణాలు ఇందులో ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది. ఉదయం పూట ఈ పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే పేగు కదలికలను నియంత్రించవచ్చు. కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. రోగనిరోధక శక్తి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, నేరేడులో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. మీరు క్రమం తప్పకుండా నేరేడు పొడిని తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ గణనీయంగా తగ్గుతుంది. అంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
4. బరువు
నేరేడు విత్తనాల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి తగ్గుతుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల సంతృప్తి భావన కలుగుతుంది. దీని ద్వారా పగటిపూట అతిగా తినే అలవాటును నిరోధించవచ్చు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ ప్రకారం, నేరేడు కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
5. చర్మ ఆరోగ్యం
నేరేడులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన చర్మానికి కూడా చాలా మంచిది. మొటిమలు, పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు. దాని పొడిని తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్యం. నిస్తేజమైన చర్మ సమస్యను కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి, మీరు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నేరేడు విత్తనాల పొడిని తీసుకోవడం వెంటనే ప్రారంభించండి.
నేరేడు విత్తనాల పొడి తయారీ విధానం:
ఇంట్లో నేరేడు గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గుజ్జు తీసేసిన గింజలను బాగా కడగాలి. అవి పూర్తిగా తేమ లేకుండా అయ్యే వరకు 5 నుంచి 7 రోజులు ఎండలో ఆరబెట్టండి. తర్వాత తక్కువ వేడి మీద తేలికగా వేయించాలి. మిక్సర్ లేదా బ్లెండర్ ఉపయోగించి మెత్తని పొడిగా రుబ్బుకోండి. అనంతరం గాలి చొరబడని కంటైనర్‌లో వేసి మూతపెట్టండి. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
(NOTE: ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..
ఏసీలో గంటల తరబడి కూర్చుంటే..? ఈ సమస్య తప్పదు!
For More Health News