Root Canal Heart Link: రూట్ కెనాల్ చేస్తే వీరికి హార్ట్ అటాక్ ముప్పు? తాజా పరిశోధనలో సంచలన నిజాలు..!
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:00 PM
ఇటీవల దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రజలు తరచూ డెంటల్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు. చిన్నవయసులోనే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే, తాజా పరిశోధనలో రూట్ కెనాల్ గుండె సమస్యలకు ఎలా కారణమవుతుందో బయటపడింది.

Link Between Root Canal and Heart Problems: ప్రతిరోజూ లక్షలాది మంది డెంటల్ క్లినిక్‌లకు వెళ్లి రూట్‑కెనాల్ (Root Canal) చికిత్స తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని దంత సమస్యలకు రూట్ కెనాల్ తప్ప మరో మార్గం ఉండదు. పళ్ల లోపల సోకిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగించేందుకు రూట్ కెనాల్ ప్రక్రియ అవసరం. అయితే, సమస్య ఉన్న పళ్లను శుభ్రం చేసి క్రిమిరహితం చేశాక పంటిపై బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకు సీల్ వేస్తారు డెంటిస్టులు. సహజ దంతాలకు ఇన్ఫెక్షన్ సోకకుండా చేసే రూట్ కెనాల్ ఈ సందర్భాల్లో తీవ్ర గుండె సమస్యలకు దారితీసే ప్రమాదముంది.
చాలా మంది దంత సమస్యలతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు కచ్చితంగా రూట్ కెనాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక దంత ప్రక్రియ. ఈ చికిత్సలో భాగంగా చెడిపోయిన దంతాల లోపల సోకిన ఇన్ఫెక్షన్ లేదా వాపుకు కారణమైన గుజ్జును తొలగిస్తారు. దీని తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి క్రిమిరహితం చేసి సీలు చేస్తారు. ఇది మీ పంటిపై బ్యాక్టీరియా పెరుగుదలను, దంతాలకు తిరిగి ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఇతర దంతాలనూ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది.
రూట్ కెనాల్ గుండెపోటుకు దారితీస్తుందా?
రూట్ కెనాల్ గుండె సమస్యలకు దారితీస్తుందని రుజువు చేసేందుకు శాస్త్రీయ రుజువు లేదు. రూట్ కెనాల్ నేరుగా గుండెపోటుకు కారణం కాదు. కానీ నోటి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
రూట్ కెనాల్ గుండెపోటుకు దారితీస్తుందా?
నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం, హృదయ సంబంధ సమస్యల మధ్య సంబంధంపై ఇప్పటికే పలు అధ్యయనాలు చేశారు పరిశోధకులు. రూట్ కెనాల్ చికిత్స ఎలా హార్ట్ ఎటాక్ సమస్యలను తెచ్చిపెడుతుందో కనుగొన్నారు.
పీరియాంటైటిస్ (చిగుళ్ల వ్యాధి) వంటి పరిస్థితులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని తేల్చారు.
ముఖ్యంగా రూట్ కెనాల్ చికిత్స సమయంలో, దంతాల నుండి బ్యాక్టీరియాను తొలగించే సమయంలో పూర్తిగా శుభ్రం చేయకపోతే లేదా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే అది నోటి ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించవచ్చు. ఇది రక్త నాళాలలో వాపును ప్రేరేపించి గుండె జబ్బులకు దారితీస్తుంది.
గుండె జబ్బులు లేదా ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్‌స్ ఉన్నవారు దంత బాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లకు (ఎండోకార్డిటిస్ వంటివి) ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో సమస్యలను నివారించడానికి దంతవైద్యులు తరచుగా ప్రక్రియలకు ముందు యాంటీబయాటిక్‌లను సిఫార్సు చేస్తారు.
అయితే, రూట్ కెనాల్ చికిత్స సరిగ్గా చేస్తే ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. కేవలం, దంత ఇన్ఫెక్షన్‌లను నిర్లక్ష్యం చేయడం వల్లే గుండె ప్రమాదాలు పెరుగుతాయి.
Also Read:
మధుమేహం ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. MIT కొత్త ఇంప్లాంట్ అభివృద్ధి.!
వర్షాకాలంలో వంకాయలు.. ఆరోగ్యానికి మంచివేనా?
For More Health News