Acidity Home Remedies : ఈ వంటింటి చిట్కాలతో.. ఎసిడిటీ క్షణాల్లో మాయం..
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:23 PM
మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. మందులు వాడినా పెద్దగా ఉపశమనం లభించకపోతే ఒకసారి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ వంటగదిలో ఉండే వస్తువులతో తక్షణమే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడి..

ఎసిడిటీ అనేది భారతదేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన జీర్ణ సమస్య. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు సంభవించే ఒక సాధారణ జీర్ణ సమస్య, ఇది గుండెల్లో మంట, ఛాతీ నొప్పి, అజీర్ణం ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారిలో గొంతులోకి యాసిడ్ తన్నుకొస్తుంది. ఈ కారణంగా ఆహారం సరిగా తీసుకోలేరు. విశ్రాంతి తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే మందులు వేసుకునే బదులు.. ఎసిడిటీ నుంచి బయటపడేందుకు హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం మంచిది. ఇంట్లో ఉండే వస్తువులతోనే కడుపు ఉబ్బరం ఎలా దూరం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఎసిడిటి సమస్యకు కారణాలు:
1. అతిగా తినడం లేదా స్పైసీ/కొవ్వు పదార్ధాలు తినడం
2. ఒత్తిడి, ఆందోళన
3. పేలవమైన జీర్ణక్రియ
4. కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం
5. ధూమపానం
ఇంట్లో ఉపయోగించే ఈ కొన్ని వస్తువులను వాడటం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.
1. అల్లం: అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. తాజా అల్లాన్ని వేడి నీటిలో వేసి అల్లం టీ తయారు చేసుకోండి. రుచికి తేనె లేదా నిమ్మకాయ కలుపుకోండి. రోజుకు 2-3 సార్లు త్రాగితే చాలు. ఎసిడిటీ సమస్య ఇట్టే దూరమవుతుంది.
2. అలోవెరా జ్యూస్: భోజనం తర్వాత 1/2 కప్పు కలబంద రసం తాగటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే, అలోవెరా జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి. మీరు దీన్ని స్మూతీస్ లేదా సలాడ్‌లకు కూడా జోడించవచ్చు
3. బేకింగ్ సోడా: బేకింగ్ సోడా కడుపులోని యాసిడ్‌ని తటస్థం చేసి ఎసిడిటీ నుంచి త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను 1/2 కప్పు నీటితో కలపండి. భోజనం తర్వాత లేదా మీకు ఎసిడిటీ వచ్చినట్లు అనిపిస్తే ఈ ద్రావణాన్ని తాగాలి.
4. చల్లని పాలు: చల్లని పాలు కడుపులోని యాసిడ్‌ని చల్లబర్చేందుకు సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత లేదా మీకు ఎసిడిటీ వచ్చినప్పుడ ఒక గ్లాసు చల్లని పాలు తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
5. అరటిపండు: అరటిపండ్లు సహజసిద్ధమైన యాంటీయాసిడ్. భోజనం తర్వాత లేదా కడుపు ఉబ్బరంగా అనిపించినపుడు ఒక అరటిపండు తినండి.
6. జీలకర్ర, సోంపు గింజలు: జీలకర్ర జీర్ణక్రియ చక్కదిద్దేందుకు, ఎసిటిడీని నివారించేందుకు అద్భుత ఔషధం. ఒక టీస్పూన్ జీలకర్ర లేదా సోంపు గింజలను 1/2 కప్పు నీటిలో వేసుకుని భోజనం తర్వాత, ఎసిడిటీ వచ్చినప్పుడు తాగితే ఉపశమనం లభిస్తుంది.
7. నిమ్మరసం : నిమ్మరసం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. అర కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని భోజనం తర్వాత లేదా ఎసిడిటీ సమస్య వచ్చినప్పుడు తాగండి.
8. గ్రీన్ టీ : రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే ఇన్‌ఫ్లమేషన్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మీరు రుచికి తేనె లేదా నిమ్మకాయను కూడా జోడించవచ్చు
9. పెరుగు : రోజుకు 1 కప్పు పెరుగు తినటం అలవాటు చేసుకోండి. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, ఎసిడిటీని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. రుచికి తేనె లేదా పండ్లను కూడా పెరుగులో కలుపుకుని తీసుకోవచ్చు.
అదనపు చిట్కాలు
1. భోజనం ఇలా తినండి : తక్కువ మొత్తంలో భోజనం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గుతుంది. తద్వారా ఎసిడిటీ సమస్య అదుపులోకి వస్తుంది.
2. స్పైసీ లేదా ఫ్యాటీ ఫుడ్స్ : ఇవి ఎసిడిటీని ప్రేరేపిస్తాయి. కాబట్టి, ఇవి తినటం మానేస్తే మంచిది.
3. హైడ్రేటెడ్‌గా ఉండండి : టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, ఎసిడిటీని తగ్గించడానికి రోజంతా నీరు పుష్కలంగా త్రాగాలి.
4. ఒత్తిడి : ఒత్తిడి అసిడిటీని పెంచుతుంది. కాబట్టి, ధ్యానం లేదా శ్వాస ప్రక్రియల ద్వారా ఒత్తిడిని తగ్గించే పద్ధతులు ప్రాక్టీస్ చేయండి.
5. వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎసిడిటీ సమస్య తొలగిపోతుంది.
ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు నిరంతరం తీవ్రమైన ఎసిడిటీతో బాధపడుతుంటే సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వెంటనే వైద్యులను సంప్రదించండి.