Share News

Excess Salt in Food : ఆహారంలో అదనపు ఉప్పు తగ్గించేందుకు.. 5 సులభమైన పద్ధతులు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:03 PM

How To Reduce Salt in Food : ఉప్పు లేకుండా ఆహారం రుచిగా ఉండదు. అలా అని ఉప్పు ఎక్కువగా వేస్తే నోట్లో పెట్టుకోవడం అసాధ్యం. అదనపు ఉప్పు వంటకం రుచిని పాడు చేస్తుంది. ఈ పద్ధతులు పాటిస్తే అదనపు ఉప్పు సమస్యను నివారించవచ్చు.

Excess Salt in Food : ఆహారంలో అదనపు ఉప్పు తగ్గించేందుకు.. 5 సులభమైన పద్ధతులు..
How To Remove Excess Salt From Curry

How To Remove Salt From Curry : ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యం. ఉప్పు వేయకపోతే ఆహారం రుచిగా ఉండదు. అయితే, వంట చేసేటప్పుడు కొన్నిసార్లు ఉప్పు ఎక్కువగా లేదా తక్కువగా వేయడం సహజం. వంటలో ఉప్పు తక్కువైతే మళ్లీ వేసుకోగలం. పొరపాటున అదనంగా ఉప్పు వేస్తే.. మీరు ఎంతో కష్టపడి తయారు చేసిన వంటకం తినడం అసాధ్యంగా మారుతుంది. ఎక్కువ ఉప్పు వల్ల మొత్తం ఆహారం రుచే చెడిపోతుంది. వంట చేసే ప్రతి ఒక్కరూ తరచూ ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే, ఇలా అయిందని మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆహారంలో ఉప్పును తగ్గించేందుకు మీరు ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలు


ఆహారంలో ఉప్పు తగ్గించేందుకు 5 చిట్కాలు..

బంగాళాదుంపలు

బంగాళాదుంపలను ఉపయోగించి మీరు ఆహారంలో ఉప్పును తగ్గించవచ్చు. అదెలాగంటే, వండిన పదార్థంలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలను కలపండి. ఇవి ఆహారంలో అదనపు ఉప్పును గ్రహిస్తాయి. అందువల్ల పర్‌ఫెక్ట్ టేస్ట్ వస్తుంది.


పెరుగు

మీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడానికి పెరుగును ఉపయోగించవచ్చు. మీరు కూరగాయలు వండేటప్పుడు వాటిలో పెరుగు వేసి ఉడికించాలి. ఇది ఉప్పును తగ్గించడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది.


నెయ్యి

నెయ్యి ఏ ఆహార పదార్థం రుచినైనా రెట్టింపు చేస్తుంది. అంతేకాదు.. నెయ్యికి ఆహారంలో అధిక ఉప్పును తగ్గించే శక్తి ఉంది. తరచూ తీసుకోవడమూ ఆరోగ్యానికి చాలా మంచిది.


నిమ్మకాయ

కొన్ని రకాల కూరగాయలు వండిన తర్వాత ఉప్పును అధికంగా పీల్చుకుంటాయి. ఇలాంటప్పుడు మీరు నిమ్మకాయ రసాన్ని ఆహారానికి జోడించవచ్చు. ఇందులోని పులుపు అదనపు ఉప్పును సమతుల్యం చేసి పదార్థానికి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది.


పిండి

ఆహారంలో అదనపు ఉప్పును తగ్గించే మరో మార్గం బియ్యం, కార్న్ ఫ్లోర్ లేదా ఏదైనా పిండితో చేసిన బాల్స్ వంటకంలో వేసి కొంతసేపు ఉడికించాలి. అప్పుడు ఆహారంలోని ఉప్పు పరిమాణం ఆటోమాటిగ్గా తగ్గిపోతుంది.


Read Also : High Protien: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

Kidney Problem: ఈ తప్పులు చేస్తే కిడ్నీలు చెడిపోవడం ఖాయం.. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉండాలంటే..

MRI Scan: మహిళ ప్రాణాలు తీసిన MRI స్కాన్.. వీరు జాగ్రత్తగా ఉండాలి..

Updated Date - Mar 16 , 2025 | 03:12 PM