Curd Risks Monsoon: ఈ సమస్యలుంటే వర్షాకాలంలో పెరుగు తినకూడదు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
ABN , Publish Date - Jul 09 , 2025 | 08:27 PM
ఆయుర్వేదం ప్రకారం, మారుతున్న రుతువులను బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చాలా వేగంగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే..

Curd Side Effects In Monsoon: వాస్తవానికి పెరుగు అద్భుతమైన పోషకాహారం. ఇందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. దీన్ని రోజూ తింటే జీర్ణక్రియకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అందుకే శతాబ్దాలుగా భారతీయుల రోజువారీ ఆహారంలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు వర్షాకాలంలో పెరుగు వినియోగాన్ని తక్కువ పరిమాణంలో లేదా పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదు?
ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో పెరుగు శరీరంలోని మూడు దోషాలకు కారణమవుతుంది. వాత, పిత్త, కఫాలు ప్రభావితమవుతాయి. ఇది శరీరాన్ని బలహీనపరిచి అనేక కాలానుగుణ వ్యాధులకు కారణమవుతుంది.
వర్షాకాలంలో పెరుగు తింటే ఈ సమస్యలు:
జీర్ణ సమస్యలు
వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా పెరుగు తింటే జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, జలుబు చేసే పదార్థాలు జీర్ణక్రియను బలహీనపరుస్తాయి. ఇవి ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే పెరుగులో చిటికెడు నల్ల మిరియాలు, వేయించిన జీలకర్ర లేదా తేనె కలపడం చాలా మంచిది. ఇవేవి వేసుకోకుండా కేవలం పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
వర్షాకాలంలో పెరుగు శరీరాన్ని మరింత చల్లబరుస్తుంది. ఈ పాల ఉత్పత్తిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ సీజన్లో చల్లని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. ఇది కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీసి వేగంగా రోగాలకు గురయ్యేలా చేస్తుంది. అలెర్జీలకు కారణమవుతుంది.
శ్వాసకోశ సమస్యలు
వర్షాకాలంలో పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు సహా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఈ సీజన్లో తేమ అధికంగా ఉండటం వల్ల వేగంగా వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి, వైరల్ ఫీవర్లు, అలెర్జీల ప్రమాదమూ ఎక్కువే.
పెరుగు తినడానికి సరైన మార్గం ఏమిటి?
వర్షాకాలంలో పెరుగు తినాలనుకుంటే దానిని సరైన రీతిలో తినడం చాలా ముఖ్యం. ముందుగా పెరుగులో చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లేదా తేనె జోడించండి. అలా చేయడం వల్ల పెరుగులో చల్లబరిచే గుణాలు క్షీణిస్తాయి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే జీర్ణక్రియతో పాటు పేగు ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జాగ్రత్త.. ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!
For More Health News