Share News

Weight Gain: సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

ABN , Publish Date - May 26 , 2025 | 08:02 AM

Weight Gain Tips: ఇప్పుడు చాలామంది సన్నగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో బరువు తగ్గించుకునేందుకు ఆహారం తినడం మానేస్తున్నారు. ఈ అలవాటు వల్ల సన్నగా, పీలగా కనిపిస్తుంటారు. శారీరక బలహీనత కారణంగా చిన్న పనికే అలసిపోతుంటారు. కాబట్టి, హెల్తీ వెయిట్ కోసం రోజూ ఈ ఆహారాలు కచ్చితంగా తినండి.

Weight Gain: సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
Healthy Foods For Weight Gain

Healthy Foods For Weight Gain: కొంతమంది చాలా సన్నగా ఉంటారు. వారు తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోకపోతే మరింత పీలగా తయారవుతారు. నిస్సత్తువ కారణంగా రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండలేరు. శక్తి తక్కువగా ఉంటే ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్న చాలామందికి ఆహారం తిన్న తర్వాత అంత త్వరగా జీర్ణం కాదు. అందుకే ఆరోగ్యకరమైన బరువు కోసం ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. స్లిమ్‌గా ఉంటూనే ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ కింది ఆహారాలు తినండి.


కండరాలు

కండరాలు బలహీనంగా ఉండటం వల్లే సన్నగా ఉన్నవారు మరింత బక్కచిక్కిపోతారు. ఇది శారీరక బలహీనతను మరింత పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో కండరాలను పెంచే ఆహారాన్ని తినాలి. గుడ్లు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, గింజలు వంటి ప్రొటీన్ పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కోసం బ్రౌన్ రైస్, బార్లీ, హోల్-వీట్ బ్రెడ్ వంటి రోజూ తగిన మోతాదులో తినాలి. ఇవి కండరాల సౌష్ఠవాన్ని పెంచి చక్కటి శరీరాకృతిని ఇస్తాయి.


టోపు

సన్నగా ఉన్నవారు రాత్రి భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండే టోపు తినాలి. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది. ప్రోటీన్ శరీరంలో కండరాల బలానికి, నిర్మాణానికి సహాయపడుతుంది.


బాదం, ఖర్జూరం, అంజీర్

బాదం, ఖర్జూరం, అంజీర్ పండ్లను నానబెట్టి ప్రతి రాత్రి తినండి. ఈ మూడింటిలోనూ ఫైబర్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ శరీరానికి పోషణను అందిస్తాయి. కండరాలు వేగంగా పెరిగేందుకు ఉపకరిస్తాయి.


పాలు, మఖానా

మీ ఎముకలు బలహీనంగా ఉండి ఎముకల సాంద్రత తక్కువగా ఉంటే రాత్రిపూట పాలు తాగడం ప్రారంభించండి. పాలలో ఎముకలను బలోపేతం చేసే కాల్షియం ఉంటుంది. ప్రతి రాత్రి పాలలో తామర గింజలు లేదా మఖానా కలిపి తినడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే పాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. బలహీనత, అలసట, నీరసం తగ్గి ఉత్సాహంగా తయారవుతారు.


బీన్స్

కేలరీలు, కార్బోహైడ్రేట్లతో పాటు బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. రోజూ రాత్రి బీన్స్ తింటే ఆరోగ్యకరమైన బరువు పెరగుతారు.


పాలు, ఎండుద్రాక్ష

రాత్రిపూట పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇక బరువు పెరగడానికి సమతుల్య భోజనంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవడం ముఖ్యం.


ఇతర చిట్కాలు:

  • బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య ఆకలిగా అనిపిస్తే పండ్లు, కూరగాయలు తినండి.

  • పాలు, నట్స్, నూనెలు వంటి వాటితో కూడిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోండి.

  • ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి.

  • తక్కువ బరువుతో ఉన్నప్పటికీ వ్యాయామం చేయాలి. .

  • కేకులు, ఇన్‌స్టంట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, ఫ్యాట్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను నివారించడానికి ప్రయత్నించండి.


Also Read:

Ginger Benefits: అల్లం ఇలా వాడితే కీళ్లనొప్పులు పరార్..

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ వదిలించుకోవడానికి 5 సింపుల్ చిట్కాలు..

For More Health News and Telugu News..

Updated Date - May 26 , 2025 | 08:08 AM